https://oktelugu.com/

Films : చిన్న సినిమాలను చంపేస్తున్న రివ్యూ రైటర్స్…ఇందులో ఎంత వరకు నిజముంది..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే దర్శకుడు చాలా కేర్ ఫుల్ గా ఆ సినిమాను తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 / 01:24 PM IST

    Review writers who are killing small films...how much truth is there in this...?

    Follow us on

    Films : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్లు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. నిజానికైతే వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వాళ్లను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవడానికి స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేసే సినిమాలకు భారీగా క్రేజ్ అయితే దక్కుతుంది…ఇక ఇది ఇలా ఉంటే చిన్న సినిమాకి మాత్రం ప్రతి చోట అన్యాయం జరుగుతూనే ఉంది. ఎందుకంటే కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమాలకు అసలు థియేటర్లను ఇవ్వడం లేదు. నిజానికి సినిమాకి సక్సెస్ టాక్ వస్తేనే తప్ప ప్రేక్షకులు ఆ సినిమా వైపు చూసే అవకాశం కూడా లేదు…ఇక ఇదిలా ఉంటే రివ్యూ రైటర్ల వల్ల చిన్న సినిమాలు ప్లాప్ అవుతున్నాయనే విషయాన్ని కూడా చాలాసార్లు చాలామంది సినీ మేధావులు సైతం తెలియజేశారు. నిజానికైతే రివ్యూ రైటర్ల వల్ల ఎందుకు చిన్న సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అనే అనుమానులు అందరిలో కలుగుతున్నాయి. నిజానికి ఈ రోజుల్లో సినిమా వచ్చిన 15 రోజుల్లోపే ఆ సినిమాలు ఓటిటి ల్లో దర్శనమిస్తున్నాయి. కాబట్టి పెద్ద సినిమా బాగాలేదని కొంతమంది రివ్యూలు ఇచ్చినప్పటికి రెండు మూడు రోజులు గడిచిన తర్వాత అయిన కూడా పెద్ద సినిమాకి మౌత్ టాక్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రివ్యూ రైటర్లు తప్పుగా రివ్యూ ఇచ్చినా కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రేక్షకులు అసలు టాక్ ను తెలుసుకొని సినిమా థియేటర్ కి రావచ్చు.

    కానీ చిన్న సినిమాల పరిస్థితి అలా లేదు. పొరపాటున రివ్యూ రైటర్లు చిన్న సినిమా బాలేదు అని రివ్యూ ఇచ్చారు అంటే మొదటి నాలుగైదు రోజులు థియేటర్లో ఎవ్వరు ఉండరు. ఇక దానివల్ల సినిమా ప్లాప్ అయిందని థియేటర్ యాజమాన్యం నిర్ణయించి థియేటర్లో నుంచి ఆ సినిమాలను తీసేస్తారు.

    నిజానికి మంచి సినిమా అయిన కూడా కొంతమంది రివ్యూ రైటర్ల వల్ల సినిమా అనేది ప్లాప్ అవుతుంది అంటూ కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చిన్న సినిమాకు సినిమా ఇండస్ట్రీలో చాలా రకాలుగా అన్యాయం జరుగుతుందనే చెబుతూ వస్తున్నారు.

    మరి మొత్తానికైతే చిన్న సినిమా బతకాలి అంటే ప్రొడ్యూసర్లతోపాటు సినిమా చూసే అభిమానులు కూడా ఆ సినిమాను ఆదరించాల్సిన అవసరం అయితే ఉంది… ఇక రివ్యూ రైటర్లు కూడా సినిమా బాగుంటే బాగుందని రాస్తే చాలా సంతోషం అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం…