https://oktelugu.com/

Rajamouli : రాజమౌళి పెట్టిన టాస్క్ లకు బెంబేలెత్తి పోతున్న మహేష్ బాబు…ఇలా అయితే కష్టం అంటున్న జక్కన్న…

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా తీశాడో అప్పటినుంచి పాన్ ఇండియాలో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మన హీరోలు సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమైతే లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : October 28, 2024 / 04:37 PM IST

    Mahesh Babu is worried about the tasks given by Rajamouli... Jakkanna says it is difficult if this is the case...

    Follow us on

    దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఒకసారి ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమాకి భారీ రేంజ్ లో క్రేజ్ అయితే దక్కుతుంది. ముఖ్యంగా ఆయన సినిమాల్లో నటించడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు నటుడు సిద్ధంగా ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతో వరల్డ్ లెవెల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇప్పుడు డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమాతోనే రంగంలోకి దిగుతున్నాడు…ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం రాజమౌళి మహేష్ బాబుకి భారీ టాస్క్ లను పెడుతున్నట్టుగా తెలుస్తోంది…అది ఏంటి అంటే రాజమౌళి పర్ఫెక్షన్ కోసం నానా రకాల ఇబ్బందులను పెడుతున్నాడట. ఎందుకు అంటే ప్రతి చిన్న విషయంలో కూడా రాజమౌళి పర్ఫెక్షన్ కోరుకుంటాడు.
    ఇక మహేష్ బాబు అరకొరగా చేస్తే అక్కడ గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి రాజమౌళి తనకు నచ్చినట్టుగా మహేష్ బాబు తో చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే మేకోవర్  విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నిజానికి మేకోవర్ విషయం లో అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
    ఇంకా షూట్ స్టార్ట్ అవ్వకముందే మహేష్ బాబు ను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్న రాజమౌళి షూట్ స్టార్ట్ అయిన తర్వాత మహేష్ బాబు ను ఏ రేంజ్ లో కష్టపెడతాడో తెలియాల్సి ఉంది. మరి ఈ టార్చర్ ని బరిస్తూ మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తాడా? లేదంటే మధ్యలోనే వదిలేస్తాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు పెద్దగా మేకోవర్ విషయంలో కానీ, సినిమా విషయంలో కానీ భారీ రిస్క్ అయితే చేయలేదు. తను ఉన్న కంఫర్ట్ జోన్ లోనే సినిమాలను చేసుకుంటూ వచ్చాడు. అయినప్పటికి ఆ సినిమాలు సక్సెస్ లను సాధించాయి.
    ఇక ఇప్పుడు చేయబోయే సినిమాలతో ఆయన చాలావరకు తనను తాను మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కొన్ని రిస్కీ షాట్స్ ను కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. వాటన్నింటికీ సిద్ధమైన తర్వాతే రాజమౌళి మహేష్ బాబుని తీసుకున్నాడు. ఒకవేళ తనకు అవన్నీ ఇప్పుడు ఇబ్బందికరంగా మారినా కూడా షూట్ లో పాల్గొనక తప్పదనే చెప్పాలి…