https://oktelugu.com/

Harish Shankar : హరీష్ శంకర్ సినీ కెరియర్ క్లోజ్ అయినట్లేనా..?

సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లందరూ సినిమాలను చేస్తూ స్టార్ హీరోలతో భారీ సక్సెస్ లను అందుకుంటుంటే కొంతమంది దర్శకులు మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం లేక మీడియం రేంజ్ హీరోలతో చేసిన సినిమాలు సక్సెస్ సాధించలేక చాలావరకు ఢీలా పడిపోతున్నారనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 1, 2024 3:16 pm
    Is Harish Shankar's film career closed?

    Is Harish Shankar's film career closed?

    Follow us on

    Harish Shankar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిరపకాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హరీష్ శంకర్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోతాడు అనుకున్న హరీష్ శంకర్ తన తర్వాత సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకోవడంతో పాతాళానికి పడిపోయాడు. ఇక ఆ తర్వాత సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన స్టార్ డైరెక్టర్ అనే ఇమేజ్ ని సాధించలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మీదనే ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా కనక తేడా కొడితే ఇక హరీష్ శంకర్ సినీ కెరియర్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉందనే చెప్పాలి. ఇక ఇంతకు ముందు రవితేజ తో చేసిన సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో హరీష్ శంకర్ తో సినిమా చేయడానికి చాలామంది హీరోలు భయపడుతున్నారు. ఇక అదే విధంగా ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ బిజీగా ఉన్నారు. కాబట్టి అతనికి డేట్స్ ఇవ్వలేదు అంటూ ఆయన కబుర్లు చెబుతున్నప్పటికి ఆయనతో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    ఇక కొన్ని ఆయన రీసెంట్ గా చేసిన మిస్టర్ బచ్చన్ సినిమాలో సీన్లు అయితే మరి దారుణంగా ఉంటాయి. అలాంటి సీన్లను ఎలా రాశాడో కూడా మనకు అర్థం కాదు.
    మరి ఇలాంటి సందర్భంలో హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో రోజురోజుకి తన క్రేజ్ ను తగ్గించుకుంటున్నాడంటు సినీ మేధావులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    మరి ఆయన ఇప్పుడు చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తో కనక సక్సెస్ ని సాధించకపోతే మాత్రం స్టార్ హీరోలు ఎవరు అతనికి డేట్స్ ఇచ్చే అవకాశాలు అయితే లేవు. కాబట్టి తన ముందున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ఆయన కెరియర్ అనేది మరిన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. లేకపోతే మాత్రం ఆయన ముందుకు సాగడం చాలా కష్టంతో కూడుకున్న పనే అవుతుంది…

    ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. తన కంటే వెనకాల వచ్చిన యంగ్ డైరెక్టర్లందరూ స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపును సంపాదించుకుంటుంటే ఆయన మాత్రం ఇంకా రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను చేస్తూ సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ రికార్డును అయితే మూటగట్టుకుంటున్నాడు…