Kiran Abbavaram: తల్లి కూలీ పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి..సినిమాల్లోకి రాకముందు కిరణ్ అబ్బవరం పడ్డ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ వంటి వారు ఇండస్ట్రీ లోకి వచ్చి ఈమధ్య కాలంలో సక్సెస్ అయ్యారు. కానీ వీళ్లంతా అప్పర్ మిడిల్ క్లాస్ కి సంబంధించిన కుర్రాళ్ళు. వీళ్లకు సినిమాలకు కాకపోతే మరో వ్యాపారం చేసుకొని బ్రతికేయగలరు. కానీ కిరణ్ అబ్బవరం అలా కాదు, నిరుపేద కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి వచ్చిన అబ్బాయి.

Written By: Vicky, Updated On : November 1, 2024 3:19 pm

Kiran Abbavaram

Follow us on

Kiran Abbavaram: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలకు ఒక సినిమాని విజయవంతంగా పూర్తి చేసి,విడుదల చేయడమే పెద్ద సక్సెస్. అలాంటిది ఒక సక్సెస్ ఫుల్ సినిమాతో వెండితెర అరంగేట్రం చేస్తే ఎలా ఉంటుంది..?, అలాంటి అదృష్టం కేవలం కొంతమంది యంగ్ హీరోలకు మాత్రమే దక్కుతుంది. వారిలో ఒకరిగా కిరణ్ అబ్బవరం నిలిచాడు. ఈయన ‘రాజావారు రాణివారు’ అనే చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద వసూళ్లు రాకపోయినా, కమర్షియల్ గా మాత్రం సూపర్ హిట్ గా నిల్చింది.ఈ సినిమాకి ముందు ఆయన యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండేవాడు. అలా వచ్చిన ఫేమ్ తోనే సినిమాల్లోకి వచ్చాడు.

ఇలా బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ వంటి వారు ఇండస్ట్రీ లోకి వచ్చి ఈమధ్య కాలంలో సక్సెస్ అయ్యారు. కానీ వీళ్లంతా అప్పర్ మిడిల్ క్లాస్ కి సంబంధించిన కుర్రాళ్ళు. వీళ్లకు సినిమాలకు కాకపోతే మరో వ్యాపారం చేసుకొని బ్రతికేయగలరు. కానీ కిరణ్ అబ్బవరం అలా కాదు, నిరుపేద కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి వచ్చిన అబ్బాయి. ఇతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, బాల్యం నుండి కష్టాలు పడ్డాడు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. కిరణ్ అబ్బవరం ఆంధ్ర ప్రదేశ్ లోని రాయచోటి ప్రాంతం లో జన్మించాడు. చిన్నతనం లో ఇంటిని పోషించేందుకు కిరణ్ అబ్బవరం తల్లి కూలీ పనులు చేసుకుంటూ ఉండేది. ఆమెకు కిరణ్ అబ్బవరం గొప్పగా చదువుకోవాలని, ఉన్నత స్థానంలో స్థిరపడాలని కోరికలు ఉండేవి. తన కొడుకుని ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివించాలనే ఆశతో ఆమె కువైట్ కి వెళ్లి పనిచేసింది. అలా కిరణ్ అబ్బవరం పాలు తాగే వయస్సులోనే అమ్మ దూరమైంది. 20 ఏళ్లలో కేవలం రెండేళ్లు మాత్రం అమ్మ కిరణ్ అబ్బవరం వద్ద ఉన్నిందట.

మిగిలిన సంవత్సరాలన్నీ ఆయన తల్లి లేకుండానే పెరిగాడు. ఆమె కువైట్ లో పని చేస్తూ పంపిన డబ్బులతో కిరణ్ అబ్బవరం బీటెక్ ని పూర్తి చేసాడు. ఆ తర్వాత బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలలో రెండున్నర ఏళ్ళ వరకు నెట్వర్క్ కన్సల్టెంట్ గా పనిచేసాడు. అలా ఒక పక్క జాబ్ చేస్తూ, మరోపక్క ఖాళీ సమయం దొరికినప్పుడల్లా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం, సినిమాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఆయన ‘రాజావారు రాణివారు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఆయన నుండి నిన్న ‘క’ చిత్రం విడుదలైంది. రహస్య ఈయన జీవితంలోకి వచ్చిన వేళావిశేషం గొప్పగా ఉందేమో, అందుకే ‘క’ చిత్రం కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమా , కిరణ్ అబ్బవరం కి టాలీవుడ్ లో ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పర్చిన సినిమాగా నిలిచింది. ఇక నుండి ఆయన కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.