https://oktelugu.com/

Ka : క మూవీ మలయాళం రైట్స్ తీసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యంగ్ హీరో ల హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఇక ఇప్పటికే వాళ్ళు చేస్తున్న చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా వల్లకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో కూడా వారు ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 7, 2024 / 02:20 PM IST

    Do you know who is the star hero who took the Malayalam rights of the movie?

    Follow us on

    Ka : కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్ – సందీప్ అనే దర్శకులు చేసిన క సినిమా గత వారం రిలీజ్ అయి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటుంది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా కిరణ్ అబ్బవరం తన స్టామినా ఏంటో చూపించుకోవడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకోవడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక మొదటి నుంచి కూడా తను యాక్టింగ్ పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరోసారి గుర్తు చేసినప్పటికి ఈ సినిమాలో మాత్రం ఆయన యాక్టింగ్ కొంతవరకు మెరుగుపడిందనే చెప్పాలి. ఇక ఇంతకుముందు సినిమాలతో చూసుకుంటే ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా గాని కంటెంట్ పరంగా గాని ఆయన చాలా స్ట్రాంగ్ గా కనిపించారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించిందనే చెప్పాలి.

    ఇక ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం చాలా సంవత్సరాల తర్వాత మరొక మంచి విజయాన్ని అందుకున్నాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన కీలక పాత్ర వహిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను పొందడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మలయాళం రైట్స్ ని ఒక స్టార్ హీరో కొనుగోలు చేశాడనే విషయం మనలో చాలామందికి తెలియదు.

    ఇంతకీ ఆయన ఎవరు అంటే దుల్కర్ సల్మాన్ గా తెలుస్తుంది. ఇక తను చేసిన లక్కీ భాస్కర్ సినిమాతో పాటే రిలీజ్ అయిన క సినిమాను మళయాళంలో ఆయనే రిలీజ్ చేశారు. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటు కు కొనుగోలు చేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఈ కుర్ర హీరో తెలుగు సినిమాను మలయాళం లో ఎంకరేజ్ చేస్తూ అక్కడ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయడం అనేది ముఖ్యంగా మంచి విషయమనే చెప్పాలి. ఇక లక్కీ భాస్కర్ సినిమా ఇక్కడ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఆయనకి తెలుగులో కూడా మంచి క్రేజ్ అయితే పెరిగింది.

    అలాగే క సినిమాని అక్కడ రిలీజ్ చేయడానికి డబ్బింగ్ రైట్స్ తను తీసుకున్నప్పటికి ఇంకా ఈ సినిమా అక్కడ రిలీజ్ కాలేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా తొందర్లోనే అక్కడ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధిస్తుందని మరి కొంతమంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని నమోదు చేసుకొని ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…