Sandeep Reddy : సందీప్ రెడ్డి వంగ సినిమా వస్తుందంటే భయపడే వాళ్ళు ఎవరో తెలుసా..?

అర్జున్ రెడ్డి సినిమా నుంచి తన ప్రస్తానాన్ని మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగ మొదటి సినిమా నుంచే కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వివాదంలో అయితే ఇరుక్కుంటుంది. ఆయన బోల్డ్ కంటెంట్ తో సినిమాలను తెరకెక్కిస్తుంటాడు అది నచ్చని కొందరు ఆయన మీద విమర్శలను చేస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : October 23, 2024 9:52 am

Do you know who are afraid of the release of Sandeep Reddy's Vanga movie..?

Follow us on

Sandeep Reddy : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఆయన చేస్తున్న స్పిరిట్ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ మేకోవర్ విషయం లో కూడా చాలా కేర్ తీసుకొని ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి తను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమాని భారీ బ్లాక్ బస్టర్ గా నిలుపుతానని ఇప్పటికే ప్రభాస్ అభిమానులకు మాటిచ్చాడు.ఇది ఏమైన కూడా తను అనుకున్నది అనుకున్నట్టుగా చేసి భారీ కలెక్షన్లు వచ్చే విధంగా సినిమాను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కూడా చెప్పడం విశేషం… ఇక ఇంతకుముందు ఈయన చేసిన అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు భారీ సక్సెస్ ని సాధించాయి. ఇక దాంతో ఈయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు బాలీవుడ్ మాఫియా భయంతో వణికి పోతుంది. ఎందుకంటే ఆయన ఎవరికీ లొంగడం లేదు. వాళ్ళ మాటలని అసలు పట్టించుకోవడం లేదు. వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆయనలాంటి దర్శకుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి బాలీవుడ్ మాఫియా సందీప్ రెడ్డి వంగను భారీగా తొక్కేయ్యాలనే ప్రయత్నం చేసింది.
అయినప్పటికీ ఆయన మాత్రం వాళ్లకు లొంగకుండా తన సినిమాను తను చేసుకుంటూ భారీ కలెక్షన్లను రాబట్టే దిశగా ముందుకు తీసుకెళ్లాడు. ఇక మొత్తానికైతే ప్రభాస్ తో చేస్తున్న ఈ సినిమాతో ఆయన మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా తనను తను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వచ్చే సినిమా కథలను మార్చడనే చెప్పాలి.
ఇక అప్పటివరకు మూస ధోరణిలో వెళ్తున్న సినిమా కథలను ఒక్కసారిగా టర్న్ చేస్తూ భారీ చేంజ్ ఓవర్ణయితే తీసుకొచ్చాడు. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ డైరెక్టర్ గా మార్చుకొని తన సినిమాలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకొని సందీప్ రెడ్డివంగా ముందుకు కదులుతున్నాడు.
నిజానికైతే సందీప్ వంగ తెలుగు సినిమాలకి సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక బాలీవుడ్ మాఫియా లాంటి వాళ్లకి సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడే కరెక్ట్ అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…