https://oktelugu.com/

Sleep: బోర్లా పడుకునే వారంతా ఈ వార్తను తప్పక చదవాలి

సాధారణ మనుషులు అయితే బోర్లా పడుకున్న ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ కడుపు సంబంధిత సమస్యలు, గర్భిణులు ఉన్నవారు బోర్లా పడుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే బోర్లా పడుకోవడం ఆరోగ్యానికి మంచిదా? లేకపోతే నష్టామా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 21, 2024 10:33 pm
    sleeping-on-stomach

    sleeping-on-stomach

    Follow us on

    Sleep: ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అనేది తప్పనిసరి. రాత్రిపూట ఎంత ఫుల్‌గా నిద్రపోతే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే నిద్రపోయేటప్పుడు ఒక్కోరు ఒక్కో భంగిమలో నిద్రపోతారు. కొందరు పక్కకి నిద్రపోతే మరికొందరు బోర్లా పడుకుంటారు. అయితే పడుకునే విధానం బట్టి ఆరోగ్యం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర అనేది మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. సరైన భంగిమలో నిద్రపోతే బాడీ, కండరాలు పట్టేస్తాయి. ఇది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇదే కాకుండా వెన్నెముకపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మంది సాధారణంగా కంటే బోర్లానే పడుకుంటారు. సాధారణ మనుషులు అయితే బోర్లా పడుకున్న ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ కడుపు సంబంధిత సమస్యలు, గర్భిణులు ఉన్నవారు బోర్లా పడుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే బోర్లా పడుకోవడం ఆరోగ్యానికి మంచిదా? లేకపోతే నష్టామా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

    బోర్లా పడుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. బోర్లా పడుకోవడం వల్ల కొన్నిసార్లు వెన్నెముక మీద ఒత్తిడి పడుతుంది. దీంతో నడుము నొప్పి, శరీరంలో ఇతర భాగాల్లో నొప్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే కడుపు మీద కూడా ప్రభావం పడుతుంది. బోర్లా పడుకోవడం వల్ల ముఖంపై బాగా ఒత్తిడి పడుతుంది. దిండును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కాస్త మురికి ఉంటుంది. దీనివల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు అయితే అసలు బోర్లా పడుకోకూడదు. అలాగే కొందరికి ఛాతీ నొప్పి కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఛాతీ మీద ఒత్తిడి పెరిగి గుండెకు ప్రభావం చూపుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి జీర్ణ సమస్యలు ఉంటాయి. వారు బోర్ల నిద్రపోకపోవడం మంచిది. ఎందుకంటే బోర్లా పడుకోవడం వల్ల పొట్టపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    బోర్లా పడుకోవడం వల్ల గురక సమస్య క్లియర్ అవుతుంది. నిటారుగా పడుకుంటే ఎక్కువగా గురక సమస్య వస్తుంది. అదే బోర్లా పడుకుంటే ఈ గురక సమస్య పూర్తిగా నయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తుంటి భాగంలో నొప్పితో బాధపడుతున్న వారికి బోర్లా పడుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయట. వీటితో పాటు మెడ నొప్పి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏదో ఒక భంగిమలో నిద్రపోవద్దు. ఆరోగ్యానికి మేలు చేసే భంగిమలో మాత్రమే నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర పోయే భంగిమ బట్టి ఆరోగ్యం ఉంటుంది. సరైన భంగిమలో నిద్రపోకపోవడం వల్ల కొన్నిసార్లు బాడీ పెయిన్స్, మెడ పట్టేయడం వంటివి జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రపోయేటప్పుడు బోర్లా కాకుండా కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.