British : భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆర్థిక వ్యవస్థ. భారతదేశానికి అపారమైన వనరులు, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయని, అయితే బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని పాలించినప్పుడు, వారి విధానాలు భారతదేశాన్ని ఆర్థికంగా బలహీనపరిచాయని చరిత్ర చెబుతుంది. బ్రిటీష్ వారి దోపిడీ కారణంగా భారతీయ సమాజం, ఆర్థిక వ్యవస్థపై బలమైన ముద్ర వేసింది. దాని ప్రభావం నేటికీ అనుభవిస్తున్నాము. బ్రిటీష్ వారు భారతదేశాన్ని దోచుకోకపోతే భారతదేశ తలసరి ఆదాయం చాలా భిన్నంగా ఉండేది. వారు దేశాన్ని దోచుకోవడం వల్ల భారతీయుల తలసరి ఆదాయం గణనీయమైన ప్రభావాన్ని చూపింది.
బ్రిటిష్ దోపిడీ భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపింది?
బ్రిటిష్ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్ష్యం బ్రిటన్ ప్రయోజనాల కోసం పని చేయడం. బ్రిటీష్ వారు భారతదేశ సహజ వనరులను దోపిడీ చేశారు, వ్యవసాయ ఉత్పత్తులు, ముడిసరుకులను బ్రిటన్‌కు పంపారు. భారతదేశంలో ఫ్యాక్టరీలు, పరిశ్రమలను స్థాపించడానికి బదులుగా భారతదేశాన్ని ముడిసరుకు సరఫరాదారుగా మార్చారు. ఫలితంగా, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఆటంకం ఏర్పడింది. ఆ సమయంలో భారతదేశ తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. వలసవాద విధానం కారణంగా భారతీయుల సామాజిక-ఆర్థిక స్థితి క్షీణించింది.
బ్రిటీష్ వారు భారతదేశాన్ని దోచుకోకపోతే ఏమి జరిగేది?
బ్రిటీష్ వారు భారతదేశాన్ని పాలించకపోతే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వేరే దిశలో ఉండేది. భారతదేశం తన సహజ వనరులు, మానవ మూలధనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఉంటే, ఈ రోజు భారతదేశ తలసరి ఆదాయం చాలా రెట్లు ఎక్కువగా ఉండేదని చాలా మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. బ్రిటీష్ పాలనలో భారతదేశ తలసరి ఆదాయం బాగా తగ్గిపోయిందని, వలస విధానాల వల్ల భారత్‌లో ఉన్న శ్రేయస్సు కొల్లగొట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. గణాంకాల ప్రకారం.. బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని దోచుకోవడానికి.. దోపిడీ చేయడానికి బదులుగా భారతీయ వనరులను సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే, నేడు భారతదేశ తలసరి ఆదాయం సుమారు 5,000డాలర్లు అంటే ప్రతి సంవత్సరం రూ. 4,22,330.50. ప్రస్తుతం, భారతదేశ తలసరి ఆదాయం సుమారు 2,300డాలర్లు అంటే సుమారు రూ.1,94,272.03గా ఉండేది. భారత దేశం నుంచి దాదాపు 40లక్షల కోట్ల సంపదను బ్రిటీష్ వాళ్లు దోచుకుపోయినట్లు అంచనా. అదే కనుక ఇప్పుడు ఉంటే భారతీయులు అందరూ లక్షాధికారులు అయి ఉండేవారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: British what would our per capita income have been if the british had not plundered our country
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com