https://oktelugu.com/

Directors : ఈ తరంలో స్టైలిష్ డైరెక్టర్స్ వీళ్లేనా..?బాలీవుడ్ మేకర్స్ కూడా వీళ్ళకి భయపడుతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.ఇక ఇప్పటికే వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకున్నారు. పాన్ ఇండియాలో వాళ్ళని మించిన దర్శకులు మరెవరు లేరు అనేంతల గుర్తింపును కూడా సంపాదించుకున్నారు...ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఇక పాన్ ఇండియాని శాశిస్తున్న వారిలో మన దర్శకులు నెంబర్ వన్ పొజిషన్ లో ఉండడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : November 6, 2024 / 08:07 AM IST

    Are these the stylish directors of this generation? Are Bollywood makers afraid of them?

    Follow us on

    Directors : సినిమా ఇండస్ట్రీలో ఒక్కోతరంలో కొంతమంది దర్శకులు వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులలో కొంతమంది యంగ్ డైరెక్టర్స్ వాళ్ళకంటూ స్టైలిష్ మేకర్స్ గా పేరును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా సుజీత్ లాంటి దర్శకుడు స్టైలిష్ మేకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన సాహో సినిమా ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత స్టైలిష్ ఫిల్మ్ గా మిగిలిపోయిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికి సుజీత్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి… ఇక నాగ్ అశ్విన్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా కల్కి సినిమాతో తనకంటూ ఒక డిఫరెంట్ సినిమాను చేయడమే కాకుండా ఆయనలో ఉన్న కొత్త యాంగిల్స్ ని బయటకు తీస్తూ ఆ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం తెలుగు సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ తో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను కొట్టడంలో ఈయన దిట్ట అనే చెప్పాలి. ఇక ఆయనకంటు ఒక సపరేట్ స్టైల్ ఉంది.

    అందులో హీరోలను చాలా డిఫరెంట్ వేరియేషన్స్ లో చూపిస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేయడంలో కూడా సందీప్ రెడ్డి వంగ తీవ్రమైన కృషి చేస్తూ ఉంటాడు. అందువల్లే సందీప్ రెడ్డివంగ సినిమాలో నటించిన టాప్ హీరోలందరూ పోటీ పడుతున్నారనే చెప్పాలి.

    ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడిని సినిమా ఇండస్ట్రీలో కొంతవరకు విమర్శిస్తున్నప్పటికి ఆయనలోని టాలెంట్ ను చూసిన ప్రతి ఒక్కరు ఆయనకు సలాం చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ అతన్ని భారీగా విమర్శిస్తుంది. అయినప్పటికీ బాలీవుడ్ లోనే ఆయనకు నీరాజనాలు పట్టే అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా వరకు కృషి చేస్తున్నారు.

    ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన దర్శకులలో వీళ్ళందరూ కూడా ముఖ్యపాత్ర వహిస్తున్నారనే చెప్పాలి. ఇకమీదట కూడా వీళ్లు భారీ సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. చూడాలి మరి ఈ దర్శకులు ఫ్యూచర్ లో ఎలాంటి మ్యాజిక్ లను చేస్తూ సినిమా ఇండస్ట్రీని ఏ స్థాయికి తీసుకెళ్తారు అనేది…