Sambasiva Rao TV5: ద గ్రేట్ టీవీ5 సాంబశివరావు ఎక్కడ? ఎందుకు కనిపించడం లేదు?

తెలుగు నాట ఎన్నో న్యూస్ చానల్స్ ఉండవచ్చు గాక.. మరెన్నో యూట్యూబ్ ఛానల్స్ సందడి చేస్తూ ఉండవచ్చు గాక.. కానీ కొంతమంది పాత్రికేయులు వాగాడంబరంతో ప్రచారంలోకి వస్తారు. ఇంకా కొంతమంది విషయ పరిజ్ఞానంతో వెలుగులోకి వస్తారు..

Written By: Anabothula Bhaskar, Updated On : November 6, 2024 8:04 am

Sambasiva Rao TV5

Follow us on

Sambasiva Rao TV5: తెలుగు నాట తరచూ వార్తల్లో ఉండే పాత్రికేయుల్లో సాంబశివరావు అలియాస్ టివి5 సాంబశివరావు ఒకరు. టీవీ5 ఛానల్ లో మూర్తి స్థాయిలో ప్రైమ్ టైం డిబేట్ ను సాంబశివరావు రన్ చేసేవారని మీడియా సర్కిల్స్ లో అప్పట్లో ప్రచారం జరిగేది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన వాటిల్లో టీవీ5 సాంబశివరావు కూడా ఒకరు అనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికి టివి5 టిడిపి అనుకూల ఛానల్ అయినప్పటికీ.. ఆ ఛానల్ మేనేజ్మెంట్ కంటే ఎక్కువగా సాంబశివరావు వ్యవహరించేవారనే వ్యాఖ్యలు వినిపించేవి. వాటికి తగ్గట్టుగానే సాంబశివరావు వ్యవహార శైలి ఉండేది.. డిబేట్లో ఆయన నేరుగానే అప్పటి వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. జగన్మోహన్ రెడ్డికి సవాళ్లు విసిరేవారు. డిబేట్లో కూర్చున్న వ్యక్తులతో నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయించేవారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నాడు వైసిపి నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేసినప్పటికీ సాంబశివరావు పట్టించుకునేవారు కాదు. పలు సందర్భాల్లో ఆయన నేరుగానే టిడిపికి సపోర్ట్ ఇచ్చారు. చంద్రబాబును జైల్లో వేసినప్పుడు చాలా బాధపడ్డారు.. అప్పట్లో దీనిని కొంతమంది నెగటివ్ గా ప్రచారం చేస్తే.. సాంబశివరావు ఒంటి కాలు మీద లేచారు.

కనిపించడం లేదు

సాంబశివరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీ5 ఛానల్ లో కనిపించడం లేదు. వాస్తవానికి ఆయన వేరే ఛానల్ లో పనిచేస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఆయన ఏ ఛానల్ లోనూ కనిపించడం లేదు. టివి5 నుంచి బయటికి వెళ్లిపోవడం వెనక కూడా రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. టీవీ5 మేనేజ్మెంట్ తో ఆయనకు వాగ్వాదం జరిగిందని.. అందువల్లే బయటికి వెళ్లిపోయారని ప్రచారంలో ఉంది. ఆ మధ్య ఏదో చానల్లో చేరిపోయారని.. కీలక పోస్టు లభించిందని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్త కూడా గాలికి కొట్టుకుపోయిన పేలపిండి సామెతను నిరూపించింది. మొత్తంగా చూస్తే సాంబశివరావు కూటమి ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో ఉంటారని భావిస్తే.. తీరా టీవీ ఫైవ్ ఛానల్ ఎండి నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యారు. అంటే ఇన్నాళ్లు టివి5 ఛానల్ తరఫున టిడిపి వాయిస్ వినిపిస్తే.. చివరికి సాంబశివరావు అడ్రస్ లేకుండా పోయాడు. సాంబశివరావు పేరు ఆమధ్య ఏదో వివాదంలో వినిపించింది. ఆ తర్వాత సద్దుమణిగింది. టీవీ 5 ఛానల్ పెద్ద తలకాయలలో సాంబశివరావు ఒకడిగా ఉండేవాడు. కానీ అతడు అనామకంగా వెళ్ళిపోయాడని తెలుస్తోంది. ఏం వివాదం జరిగిందో తెలియదు గానీ.. ఛానల్ నుంచి అతడు వెళ్లిపోవడం కాస్త వెలితిగానే కనిపిస్తోంది. పైకి కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ సాంబశివరావు ఉదంతం తెలుగు నాట ఎంతో మంది జర్నలిస్టులకు కనువిప్పు.