https://oktelugu.com/

US Presidential Elections: అటు పోలింగ్.. ఇటు కౌంటింగ్.. అమెరికా ఎన్నికల వేళ ఉత్కంఠ..

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మునుపెఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఫలితాలపై ఎవరూ స్పష్టంగా అంచనా వేయ లేదు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 6, 2024 / 08:12 AM IST

    US Presidential Elections(2)

    Follow us on

    US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. మొదటి దశ, చివరి దశ పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అమెరికాలో పేపర్‌ బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతతాయి. ఓటింగ్‌ మెషీన్లపై అక్కడ ఓటర్లలో నమ్మకం లేకపోవడమే ఇందుకు కారణం. అయితే అక్కడి ఎన్నికల విధానం తరహాలో కౌంటింగ్‌ కూడా భిన్నంగా ఉంటుంది. మన దగ్గర పోస్టర్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటంది. అమెరికాలో మాత్రం ఎన్నికలు జరిగిన రోజు పోలైన ఓట్లనే మొదట లెక్కిస్తారు. తర్వాత మెయిల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. విదేశాల నుంచి వచ్చిన ఓట్లను, మిలటరీ బ్యాలెట్‌ను తర్వాత లెక్కిస్తారు. కాన్వాసింగ్‌ ప్రక్రియద్వారా ఎన్నికైన స్థానిక ఎన్నికల అధికారులు ఓట్లను పరిశీలించి లెక్కిస్తారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి.. ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లు ఉన్నాయి. అనేది పోలుస్తూ అర్హత గత ప్రతీ ఓటును లెక్కించేలా చూస్తారు. ప్రస్తుతం ఒకవైపు పోలింగ్‌ జరుగుతుంటే.. చిన్నా రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసి కౌంటింగ్‌ కూడా పారంభమైంది.

    హై అలర్ట్‌..
    ఒకవైపు పోలింగ్‌ జరుగుతుండగా, మరోవైపు అమెరికాలో ముపుపెన్నడూ లేనిరీతిలో హై అలర్ట్‌ ప్రకటించారు.అమెరికా నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అప్రమత్తమయ్యారు. వాషింవగ్‌టన్‌ సహా 18 రాష్ట్రాల్లో భారీస్థాయిలో నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించాయి. గత ఎన్నిల టైంలో ఫలితాల తర్వాత క్యాపిటల్‌ భవనం వద్ద జరిగిన దాడి ఘటన అమెరికా చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ట్రంప్‌ అనుకూ వర్గమే ఈ దాడికి పాల్పడిందనే అభియోగాలు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో అంతర్యుద్ధం తలెత్తిందా అనే స్థాయిలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ మూడో సారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరినామాల నేపథ్యంలో మరోసారి ఆ తరహా ఘటనలు జరుగకుండా భద్రతావర్గాలు అప్రమత్తం అయ్యాయి.

    బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాసులు, గ్రిల్‌తో కూడిన బారికేడ్లు..
    ఇక భద్రతా సిబ్బంది బుల్లెట్‌ ప్రూఫ్‌ గ్లాసులు, గ్రిల్‌తో కూడిన భారికేడ్లు, ఆయుధాలతో ప్రత్యేక దళాలు, భారీగా మోహరించిన నేషనల్‌ గార్డ్స్, ఎన్నికల సిబంది చేతిలో అందుబాటులో పానిక్‌ బటన్స్‌.. సుమారు లక్ష పోలింగ్‌ స్టేషన్ల వద్ద కనిపిస్తున్న దుశ్యాలివీ. ఏఐ టెక్నాలజీ సాయంతో నిఘాను పటిష్టం చేశారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో ఆ భద్రతను మరింత పటిష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హింసాత్మక ఘటనలు జరుగకుండా నిఘా సంస్థలు అంచనాల నడుమ నేషనల్‌ గార్డ్స్‌ లోని సివిల్‌ సర్వీస్‌ ట్రూప్స్‌తోపాటు సైబర్‌ నిపుణులను కూడా రంగంలోకి దింపారు.