Home Blog Page 8429

డ్రాగన్ దూకుడుకు కళ్లెంవేస్తున్న మోడీ?


చైనా దేశం జిత్తులమారి అని ప్రపంచానికి ఎప్పుడో తెలుసు. పెదాలపై నవ్వుతో నోసలతో వెక్కిరిస్తూ చైనా భారత్ ను కవ్విస్తోంది. సరిహద్దుల్లో భారత జవాన్లను దొంగదెబ్బ తీసింది చాలక.. ఆ నెపాన్ని భారత్ పైనే రుద్దాలని చూసింది. చైనా నమ్మదగిన దేశం కాదని ప్రపంచానికి తెలుసు కాబట్టే చైనా మాటలకు పెద్దగా స్పందన లభించలేదు. భారత ఆర్మీ చైనాను సరిహద్దుల్లో సమర్ధవంతంగా తిప్పికొట్టడంపై ప్రపంచదేశాలు సైతం మనకే మద్దతు పలుకుతున్నాయి. రక్షణరంగంలో అద్వితీయ శక్తిగా భావిస్తున్న చైనాకు భారత్ సరిహద్దుల్లో గట్టిగానే బుద్దిచెబుతోంది.

కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?

భారతదేశం శాంతికాముక దేశమని ప్రపంచానికి చాటిచెబుతోంది. అయితే తనపై దాడిచేస్తే ఎంతమాత్రం ఊపేక్షించేది లేదని ప్రపంచానికి మరోసాటి చాటిచెప్పింది. సరిహద్దుల్లో 300వరకు ఉన్న చైనా సైన్యం వందమంది భారత జవాన్లపై దొంగదెబ్బ తీశారు. వీరిలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందగా 74మంది గాయాలపాలై తిరిగి కోలుకున్నారు. అయినప్పటికీ భారత జవాన్లు చైనా సైన్యాన్ని సరిహద్దుల నుంచి తరిమి ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ఆ దేశానికి రుచిచూపించారు. భారత సైన్యం ఆత్మస్థైర్యం ముందు డ్రాగన్ తోకముడవక తప్పలేదు. భారత ఆర్మీని నేరుగా ఎదుర్కోక చైనా భారత మిత్రదేశాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలను తాయిలాలు ప్రకటిస్తూ భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తోంది. దీనిని పసిగట్టిన భారత్ మిత్రదేశాలను విషయంలో సంయమనం పాటిస్తోంది.

మరోవైపు పాకిస్థాన్ తో కలిసి చైనా సరిహద్దుల్లో కవ్విస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో చైనాకు చెందిన యుద్ధవిమానాలను రంగంలోకి దింపింది. దీనిని భారత్ నిఘా వ్యవస్థ గుర్తించి సరిహద్దుల్లో అప్రత్తమైంది. ఈమేరకు భారత ఎయిర్స్ ఫోర్స్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా సరిహద్దుల్లో మిస్సైల్ విధ్వంస రాడర్ వ్యవస్థ(ఆకాష్)ను మోహరించింది. భారత సరిహద్దుల్లోకి చైనా యుద్ధవిమానాలు వస్తే వీటికి అక్కడక్కడే కూల్చేందుకు ఆకాశ్ సిస్టంను ఇప్పటికే గమ్యస్థానాలను భారత ఆర్మీ మోహరించింది. ప్రపంచంలో ఇప్పటివరకు శక్తివంతంగా పేరుగాంచిన రఫెల్ యుధ్ధ విమానాలను భారత్ అర్జెంట్ దేశానికి రప్పిస్తోంది. ఇవి అతి కీలకమైన టార్గెట్లను క్షణాల్లో పూర్తి చేయగలవు. వీటి ద్వారా చైనాకు, పాకిస్థాన్ ఒకేసారి బుద్ది చెప్పేందుకు భారత ఆర్మీ రెడీ అవుతోంది.

భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఆవరించిన వెంటనే అమెరికా భారత్ కు మద్దతు ప్రకటించింది. ఇప్పటికే భారత్ కు రష్యా ఎప్పటి నుంచి మిత్రదేశంగా ఉంది. చైనాను వ్యతిరేకించే జపాన్ తదితర దేశాలు భారత్ కే మద్దతు ఇస్తున్నారు. అమెరికా బలగాలు ఇప్పటికే భారత్ కు చేరాయి. దీంతో అన్నివైపుల నుంచి భారత్ చైనాకు కళ్లెంవేస్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మరి చైనా ప్రపంచం ముందు తలదించుకుంటోంది. ఇలాంటి తరుణంలో భారత్ తో యుద్ధంచేసి ప్రపంచం ముందు మరోసారి దోషిగా నిలుస్తుందా? అనేది చైనా నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ఎక్కువగా నష్టపోయేది చైనానే అనే వాదనలు విన్పిస్తున్నాయి.

ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి…

సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ చైనాను రక్షణ పరంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బతీస్తూ ముందుకెళుతోంది. భారత్ ను కవ్విస్తే ఎంతదూరమైనా వెళుతామంటూ చైనాకు గట్టి వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటికే చైనా అంతరంగాన్ని పసిగట్టిన ప్రధాని మోదీ చైనాతో మైండ్ గేమ్ ఆడుతోన్నారు. చైనాతో యుధ్ధానికి రెడీ అనే సంకేతాలు పంపుతున్నారు. ఒకవేళ చైనా భారత్ తో యుద్ధానికి దిగితే ఎక్కువ నష్టపోయే చైనానే అనే వాదనలు విన్పిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనే చైనా కల భారత్ తో యుద్ధానికి దిగితే అది కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉండటంతో చైనాకు ఏం చేయాలో పాలుపోవడంలేదని తెలుస్తోంది. బయటికి చైనా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్న భారత్ ఆర్మీతో పెట్టుకునే సాహనం చేయడం లేదు.

1962 యుద్ధానికి ముందున్న భారత సైన్యానికి ఇప్పుడున్న ఇండియన్ ఆర్మీకి చాలా తేడా ఉందని చైనాకు కూడా తెలుసు. రక్షణలో భారత్ ప్రపంచ దేశాలకు ఏమాత్రం తీసిపోవిధంగా తయారైంది. నిత్యం సరిహద్దుల్లో పాకిస్థాన్, ఉగ్రవాదులతో యుద్ధాలు చేస్తూ బలమైన శక్తిగా మారింది. ఇక చైనా ఎప్పుడు కూడా నేరుగా యుద్ధంలో పాల్గొన్న సందర్భాలు లేవు. దొంగదెబ్బతోనే యుద్దాల్లో గెలిచిన సంఘటన ఉన్నాయి. దీంతో యుద్ధం వస్తే భారత్ కే ఎక్కువ గెలుపు అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి చైనాకు గట్టిగానే బుద్ధి చెప్పేందుకు భారత ఆర్మీ రెడీ అంటోంది.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

Jagan

తెలంగాణ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కొవిడ్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం వల్ల ఆయన కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా కరోనా జాగ్రత్తల విషయంలో కొంచం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఆయ‌న ముఖానికి మాస్క్ ధ‌రించడానికి అంతగా ఆసక్తిగా లేరని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవ‌ల సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్ విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్ మాస్క్ ఎందుకు ధ‌రించ‌డం లేదో ప్రెస్‌ మీట్‌ లో విలేక‌రులు ప్ర‌శ్నించాల‌ని సూచించారు.

ట్రైనీ ఐఏఎస్‌ లు క్యాంప్ కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్‌ ను, రాజ్‌ భ‌వ‌న్‌ లో గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. వీటికి సంబంధించి ప‌త్రిక‌ల్లో ప‌క్క‌ప‌క్క‌నే ఫొటోలు ప్ర‌చురించారు. ఈ ఫొటోల్లో రాజ్‌ భ‌వ‌న్‌ లో గ‌వ‌ర్న‌ర్‌ తో పాటు ట్రైనీ ఐఏఎస్‌ లు మాస్క్‌ లు ధ‌రించ‌డంతో పాటు భౌతిక దూరం పాటించి కొవిడ్ నిబంధ‌న‌లు తూచా త‌ప్ప‌క అమ‌లు చేయ‌డం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపించింది.

సీఎం జ‌గ‌న్‌ ను క‌లిసిన సంద‌ర్భంలో కరోనా నిబంధ‌న‌ల‌ను ఏ మాత్రం పాటించ‌లేదు. సీఎం జ‌గ‌న్ స‌హా యువ ఐఏఎస్‌ లు కూడా మాస్క్‌ లు ధ‌రించ‌క‌పోవ‌డంతో పాటు భౌతిక దూరం పాటించ‌లేదు. పాల‌కుడి ప్ర‌తి న‌డ‌వ‌డిక‌ను ప్ర‌జ‌లు క్షుణ్ణంగా గ‌మ‌నిస్తూ ఉంటారు. సాక్ష్యాత్తు సీఎం జ‌గ‌నే కొవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే…సామాన్యుల‌కేం సందేశాన్ని పంపుతారు?

వైవిధ్యానికి ‘నాంది’ పలికిన అల్లరి నరేశ్


అల్లరి నరేశ్ అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్. దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా వెండితెరకు పరిచయమైన నరేశ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పారుచుకున్నాడు. మొదట్లో అన్నీ కామెడీ సినిమాలే చేసినా.. ‘గమ్యం’తో తనలోని సిసలైన నటుడిని పరిచయం చేశాడు. కానీ, మళ్లీ కామెడీ వైపే నడిచిన అల్లరోడి సినిమా ప్రయాణం సాఫీగా సాగలేదు. రొటీన్‌ కామెడీ కథలతో దండయాత్రలు చేసినా అతనికి సరైన విజయాలు లభించలేదు. ఇక లాభం లేదనుకొని సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ మూవీలో సీరియస్‌ పాత్రలో కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్నాక ఇప్పుడు తనలోని మరో వైవిధ్యమైన కోణాన్ని బయటపెట్టాడు. పూర్తిస్థాయి ఎమోషన్‌ కాన్సెప్ట్‌తో ‘నాంది’ అనే సినిమాలతో మళ్లీ ట్రాక్‌లో పడే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీస్‌ స్టేషన్‌లో నరేశ్‌ నగ్నంగా కూర్చొని ఉన్న ఫొటోతో ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్‌ అయింది. ఇది నరేశ్‌ 57వ సినిమా.

కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?

తాజాగా నరేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ మూవీ టీజర్ను రిలీజ్‌ విడుదలైంది. యువ హీరో విజయ్ దేవరకొండ సోషల్‌ మీడియాలో దీన్ని రిలీజ్ చేశాడు. ‘ఈ ప్రపంచాన్ని టీజర్ రూపంలో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. నరేశ్ అన్నా ఇందులో మీరు అద్భుతంగా ఉన్నారు’ అని ఈ సందర్భంగా విజయ్‌ అన్నాడు. 1.28 నిమిషాల నిడివి ఉన్న టీజర్ ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఉన్నాయి. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీ క్యారెక్టర్లో నరేశ్‌ నటన ఆకట్టుకుంది. జైల్లో నరేశ్‌ను చిత్ర హింసలకు గురి చేస్తారు. చివర్లో ‘ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్‌ పడుతుంది. మరి, నాకు న్యాయం చెప్పడానికేంటి సార్.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది’ అని నరేశ్‌ చెప్పిన డైలాగ్‌ ఆలోచింపజేసేలా ఉంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ ఆద్య పాత్రలో నటిస్తోంది. రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్ అనే పోలీసు అధికారి పాత్రలో హరిశ్ ఉత్తమన్‌ నటిస్తున్నారు. ప్రవీణ్, దేవీ ప్రసాద్‌, విన‌య్ వ‌రమ్, సీఎల్‌ న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్రపాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.

సామాన్యులు గాంధీకి.. ప్రజాప్రతినిధులు ప్రైవేటుకు..!


కరోనా మహమ్మరికి చాలా ఆత్మగౌరవం ఎక్కువ.. అది పిలిస్తేనే మన ఇంటికి వస్తుందని.. ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిన మాటలివి.. ఈ మహమ్మరి పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా చూపకుండా అందరి సమాన దృష్టితో చూస్తోంది. మనం నిర్లక్ష్యంగా ఉంటేనే దాడి చేస్తోంది. అలాంటి మహమ్మరికి చికిత్స అందించే విషయంలో మాత్రం ప్రభుత్వం తేడాలు చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రముఖులకు, సామాన్యులకు వేర్వురుగా చికిత్స అందిస్తుండటంపై ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి…

రాష్ట్రంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కరోనాకు సోకిన వారందరికీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం ప్రైవేట్ కు వెళ్లి చికిత్స చేయించుకుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై ఆరోపణలు వస్తున్నారు. ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ చెబుతుండగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు ప్రైవేటుకు వెళ్లి చికిత్స చేయించుకుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతోన్నాయి.

కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. ఆచరణలో చేస్తున్న దానికి పొంతన ఉండటంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఉన్నవారికి ఈ విషయం తెలుసు గనుకగానే ఇటీవల ప్రయివేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనే ఆరోపణలున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన తర్వాతే ప్రయివేట్ కు అనుమతి ఇవ్వడంతో ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రజాప్రతినిధులు మాత్రంపై సర్కార్ దావాఖానాలను నమ్ముకోకుండా ప్రైవేట్ కే మొగ్గుచూపుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనే కావాలనే కొందరు దుష్పచారం చేస్తున్నారని విమర్శలను తిప్పికొడుతోంది.

కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?

డబ్బులున్న ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కార్పొరోట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటూ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. డబ్బుల్లేని పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం అరకొర వసతులు ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. దేవుడిపై భారంవేసి సామాన్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. వీరిలో కొంతమంది కరోనా నుంచి కోలుకోని ఇంటిముఖం పట్టగా మరేకొందరు ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. కరోనా రోగులందరికీ గాంధీలోనే చికిత్స అందిస్తామని సర్కార్ తొలినాళ్లలో చెప్పి నేడు ప్లేట్ ఫిరాయించడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సామాన్యులకు వైద్యం సరిగా అందడం లేదని విమర్శలు ఇటీవలీ కాలంలో వెల్లువెత్తుతోన్నాయి.

అయితే ప్రభుత్వం ఈ విమర్శలను పెద్దగా పట్టించుకున్నట్లు కన్పించడం లేదు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా దీనిని ఖండించారు. కావాలనే కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుప్రతుల్లో వైద్యం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంత బాగుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రైవేట్లోకి ఎందుకు వెళ్లారో చెప్పడానికి ఆయన నానా ఇబ్బందులు పడుతోన్నాయి. ప్రజాప్రతినిధులందరికీ ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారని.. వారికి ఆసుప్రతులున్నాయని.. అందుచేతనే వారు అక్కడ చికిత్స చేయించుకుంటున్నారని చెబుతున్నాయి. అలాంటి వారిని బలవంతంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించలేమంటూ చెప్పుకొచ్చారు. సామాన్యులు మాత్రం ప్రజాప్రతినిధులు ఎక్కడ చికిత్స చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని.. ప్రభుత్వ ఆస్పతుల్లో మెరుగైన వైద్యం అందిస్తే చాలంటూ వాపోతున్నారు.

సినీ పరిశ్రమలో భయం..భయం..

Telugu Films


ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందల కోట్లకు తెలుగు సినిమా పరిశ్రమ ఎదిగినప్పుడు అందరం సంతోషం పడ్డాం. బాహుబలి లాంటి తెలుగు చిత్రం ప్రపంచమంతా ఆడి 2వేల కోట్లు కొల్లగొట్టినప్పుడు తెలుగువారంతా గర్వపడ్డారు. కానీ ఇప్పుడు సినీ పరిశ్రమ కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న రంగం ఏదైనా ఉందంటే అందులో మొదటిది తెలుగు సినిమా పరిశ్రమ.

బాహుబలితో తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి దేశవ్యాప్తం, విశ్వవ్యాప్తమైంది. తెలుగు కథలకు డిమాండ్ పెరిగింది. మన హీరోల మార్కెట్ విస్తృతమైంది. ప్యాన్ ఇండియా స్టార్లుగా మారారు. 200 కోట్ల క్లబ్ లో చేరారు. దీంతో కోట్లుగా వచ్చిన డబ్బును చాలా మంది హీరోలు థియేటర్లపై పెట్టారు. ఇప్పుడు అదే వారిని చేతులు కాల్చుకునేలా చేస్తోంది.

ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి..

అవును ప్రభాస్ అప్పట్లో నెల్లూరు జిల్లాలో అతిపెద్ద భారీ థియేటర్ కట్టి ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు.. యూవీ క్రియేషన్స్ తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ ను కొని బిజినెస్ చేస్తోంది. మహేష్ బాబు కూడా ఎంబీ థియేటర్స్ పేరుతో థియేటర్స్ వ్యాపారంలోకి దిగాడు. వీరిద్దరే కాదు.. మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్, దిల్ రాజ్, సురేష్ ప్రొడక్షన్స్ ఇలా అందరు నిర్మాతల చేతిల్లో థియేటర్స్ ఉన్నాయి.

కానీ ఇప్పుడు ఆ థియేటర్స్ లో పురుగు కూడా లేదు. భవిష్యత్ లో జనాలు వస్తారన్న గ్యారెంటీ లేదు. మూడు నెలలు దాటింది. కరోనా భయంతో థియేటర్స్ మూతపడ్డాయి. కరోనా తగ్గితేనే జనాలు థియేటర్స్ కు వస్తారు. అది ఇప్పట్లో తగ్గేలా లేదు. పెరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదు. అందుకే అందరికంటే ఎక్కువ భయాలు సినీ పరిశ్రమలో ఉన్నాయి..

కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?

టాలీవుడ్ లోనే తెలివైన బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. అసలు ఈ కరోనా పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్ లో సినిమా నిర్మిస్తామో లేదో అన్న భయాందోళనలు కలుగుతున్నాయని.. దీన్ని ఎప్పుడు బయటపడుతామో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. దీన్ని బట్టి సినిమా పరిశ్రమలో బడా నిర్మాతలే వణుకుతున్న పరిస్థితి నెలకొంది.

కరోనా చేతుల్లో సినీ పరిశ్రమ చిక్కుకుంది. కుదేలవుతోంది. కోట్లు పెట్టుబడిగా పెట్టిన తారలు, సినీ నిర్మాతలు ఇప్పుడు వణుకుతున్నారు. భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. అందరూ బయటపడుతారనే నమ్మకం ధైర్యం ఉన్నా.. సామూహికంగా సినిమాలు చూసే థియేటర్స్ కు జనం కరోనా భయంతో వస్తారా? సినీ పరిశ్రమ మునుపటిలా నడుస్తుందా అన్న భయాలు సినీ రంగాన్ని వెంటాడుతున్నాయి..

-ఎన్నం

ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి…


నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా కాంట్రాక్టు ఉద్యోగిని పై గవర్నమెంట్ అధికారి దాడి చేశారు. సి సి టీవీలో రికార్డు అయిన ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుర్చీలో కూర్చొని ఉన్న ఆ మహిళపై సదరు అధికారి పాశవికంగా దాడి చేశారు. ఆ మహిళ జుట్టు పట్టుకొని చేతికి దొరికిన వస్తువులు తీసుకొని గాయపరచడం సి సి టీవీలో స్పష్టంగా రికార్డు అయ్యింది. ఇక ఆమెపై ఆ అధికారి దాడి చేయడానికి కారణం, అతనికి సామాజిక బాధ్యత గుర్తు చేయడమే అని తెలుస్తుంది. ఫేస్ మాస్క్ లేకుండా ఆఫీస్ కి వచ్చిన ఆ అధికారిని, ఆ మహిళా ఉద్యోగి ప్రశ్నించగా..ఆయన కోపంతో ఊగిపోతూ ఆమె పై దాడి చేశారు.

బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

ఆఫీస్ లోని మిగతా ఉద్యోగులు వారించడడంతో పాటు ఆమెను దాడి నుండి కాపాడే ప్రయత్నం చేశారు. హఠాత్పరిణామంతో ఆ మహిళ దిగ్బ్రాంతికి గురయ్యారు. నెల్లూరు ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుండగా… అది ఏ విభాగం, ఆ అధికారి ఎవరు అనే పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా ఆడవారికి రక్షణ లేదని తాజా ఉదంతం గుర్తు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ మహిళపై అందరూ చూస్తుండగా దాడి జరగడం విస్మయానికి గురిచేసింది. దీనిపై సామాజిక వేత్తలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. జూన్ 27వ తేదీన ఈ సంఘట జరిగినట్టు తెలుస్తుండగా…సి సి టీవీ ఫుటేజ్ బయటకి రావడంతో సంఘటన వెలుగు చూసింది.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

ఇప్పటికే సదరు అధికారిపై చర్యలకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆయనపై దిశ చట్టం క్రింద కేసు నమోదయ్యే అవకాశం కలదు. సోషల్ మాధ్యమాలలో ఈ వీడియో వైరల్ అవుతుండగా అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు సైతం ఈ సంఘటనపై గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే సూచనలు కనిపిస్తున్నాయి. అమానుషమైన ఈ ఘటన రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీయడం ఖాయం.

దరి చేరని మందులు, క్రిందికి దిగని ముడి పదార్థాలు!

Corona vaccine
జూన్ 22 నుంచి దేశంలోని అన్ని ప్రధాన ఓడ రేవుల్లో చైనా నుంచి వచ్చే దిగుమతులను కస్టమ్స్ అధికారులు ఆపేశారు. మన దేశంలో తయారవుతున్న మందులకు చాలా వరకూ ముడి పదార్థాలు చైనా నుంచి వస్తున్నాయి. ఈ సరుకుల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిలో… మందుల తయారీకి అవసరమైన ముడి సరుకులు కూడా ఉన్నాయి. అవన్నీ విమానాల్లోను, ఓడ రేవుల్లోను నిలిచిపోయాయి. అధికారులు వాటికి అనుమతి ఇవ్వట్లేదు. ముఖ్యంగా కరోనాను ఎంతో కొంత కంట్రోల్ చేస్తున్న రెమ్‌ డెసివిర్, ఫావిపిరావిర్ మందుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు ఇప్పుడు ఆ ఎయిర్ కార్గోలోనే ఉండిపోయాయి. అందువల్ల వాటి ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో… ఈ మందుల తయారీ అత్యవసరంగా మారింది. ముడి పదార్థాలకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఫార్మాస్యూటికల్ ఎక్స్‌ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్… కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వెంటనే అనుమతి ఇవ్వకపోతే… మందుల తయారీ ఆలస్యమై… అది కరోనా పేషెంట్లకు సమస్యగా మారుతుందని తెలిపింది.

రెమ్‌ డెసివిర్, ఫావిరావిర్ మందులు కరోనా నివారణలో బాగా పనిచేస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. ఐదు రోజులుగా ముంబై ఎయిర్ కార్గోలో ఆ రెండు మందుల ముడి పదార్థాలు నిలిచిపోయాయని… ఈ మందులతో తయారుచేస్తున్న రెండు బ్రాండ్లను పేషెంట్లకు ఇచ్చేందుకు అనుమతి లభించింది. జూన్ 22 నుంచి అధికారులు 30 శాతం ఫార్మా దిగుమతులను మాత్రమే పరిశీలించి రిలీజ్ చేశారు. ముంబై, చెన్నై ఓడరేవుల్లో కూడా వంద శాతం చెకింగ్ తర్వాత క్లియరెన్స్ ఇస్తున్నారు.

ఇలా లేట్ అయ్యేకొద్దీ మందుల తయారీ ఆలస్యం కానుంది. దీనికి తోడు… ఆయా ముడి సరుకులకు గ్రౌండ్ రెంట్, డెమ్మురేజ్ కాస్ట్ వంటి అదనపు ఖర్చులు కూడా అవుతున్నాయి. అందువల్ల మందుల రేట్లు కూడా పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఆత్మనిర్భర భారత్ కింద కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాలి గానీ… ఇలా సరుకులు రాకుండా ఆలస్యం చేయడం సరికాదంటున్నారు. కానీ కేంద్రం… చైనా విషయంలో చాలా సీరియస్‌ గా ఉంది. చైనాకి కలిసొచ్చేలా ఏదీ జరగకుండా జాగ్రత్త పడుతోంది. క్రమంగా పరిస్థితులన్నీ భారత్‌ కి అనుకూలంగా మారేలా కేంద్ర వర్గాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.

కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రి అయిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. కేసీఆర్ ముందుచూపుతోనే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిందని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటారు. సీఎం కేసీఆర్ ఆరేళ్ల పాలనలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందరివాడుగా కేసీఆర్ ఖ్యాతిగడించారు. ఈ ఆరేళ్ల కాలంలో తెలంగాణలో కేసీఆర్ మాటకు ఎదురులేకుండా పోయింది. అయితే చైనా నుంచి వచ్చిన మాయదారి రోగం సీఎం కేసీఆర్ కు కరోనా మరక అంటించింది. ఆయనను ముప్పుతిప్పులు పెడుతోంది. ఈ మహమ్మరి పట్ల తొలినాళ్లలో కేసీఆర్ ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

కరోనాను విషయంలో సీఎం కేసీఆర్ తొలినాళ్లలో చాలా నిర్లక్ష్యం ప్రదర్శించారనే భావన తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతోంది. కరోనా తెలంగాణ టెంపరేచర్లో బతుకదని.. 20డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో కరోనా స్మాష్ అవుతుందని.. సాధారణ జ్వరం వస్తే ఎలాంటి మందులు తీసుకుంటారో అలాంటిదే ఇదని.. పారాసిటామాల్ వేసుకుంటే సరిపోతుందని.. తెలంగాణ ప్రజాప్రతినిధులు మాస్కులు లేకుండా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కేసీఆర్ మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఆ తర్వాత కేసీఆర్ ఈ మహమ్మరి ఎంత డేంజరో తెలుసుకొని దేశంలో అందరి కంటే ముందుగానే లాక్డౌన్ విధించారు.

లాక్డౌన్ అమలు చేసిన తొలినాళ్లలో కరోనా కేసుల సంఖ్య అదుపులోనే ఉంది. అయితే లాక్డౌన్ సడలింపుల అనంతరం సర్కార్ ఉదాసీనంగా వ్యవహరించడం కరోనా వ్యాప్తికి అవకాశం ఏర్పడింది. వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరించింది. మరోవైపు వైరస్ సోకిన కాంటాక్టులను పూర్తిస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం కట్టడి చేయడంలో విఫలం అవడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కారణమని చెప్పొచ్చు. లాక్డౌన్ సడలింపులకు ముందు కేవలం హైదరాబాద్లో మినహా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు జీరోకు చేరువయ్యాయి. అయితే లాక్డౌన్ సడలింపుల తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పై నగరవాసులు తీవ్రస్థాయిలో మండిపడిపోతున్నారు. కరోనాపై ప్రభుత్వం చేతులేత్తిసిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వ్యాపారులు సర్కారును నమ్ముకోకుండా వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛంధంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నారు. స్వీయ నియంత్ర‌ణ పాటించ‌డం ద్వారానే మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోగ‌లుగుతామ‌ని వ్యాపారులు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సర్కార్ అలర్ట్ అయింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రజలు కూడా లాక్డౌన్ విధించాలని కోరుతుండటంతో అందుకనుగుణంగా సీఎం కేసీఆర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈసారి లాక్డౌన్ చాలా కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కిందటిసారి విధించిన లాక్డౌన్ ఫెయిల్ అవడంతో ఈసారి చాలా కఠినంగా లాక్డౌన్ ఉంటుందని తెలుస్తోంది.

కేవలం రెండుగంటలే నిత్యావసర సరుకులు కొనుగోలు పర్మిషన్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మిగతా సమయమంతా కర్ఫ్యూ ఉంటుందని సమాచారం. ఈమేరకు సీఎం కేసీఆర్ క్యాబినెట్ ను సమావేశపరిచి రెండ్రోజుల్లో కీలక నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కు అంటిన కరోనా మరక ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. దీనిని ఆయన ఏవిధంగా వదిలించుకుంటారో వేచి చూడాల్సిందే..!

‘బతక లేని బడిపంతులు’

 

Pawan Kalyan

ఓనమాలు నేర్పే గురువుల కష్టాలను గుర్తించవల్సిందిగా.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పవన్ మాట్లాడుతూ.. “విద్యాబుద్ధులు నేర్పే గురువును దైవంతో సమానంగా చూసే సంస్కృతి మనది. రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విపత్తు వల్ల ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న బోధన సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడం వల్ల ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఓనమాలు నేర్పే గురువులు నడిరోడ్డున నిలవాల్సి రావడం బాధాకరం. జీతాలు లేకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు రోడ్డుపై బండ్ల మీద పళ్ళు, కూరగాయలు అమ్ముకొంటున్నారని మాధ్యమాల ద్వారా తెలిసింది. కరోనా సమయంలో ఆర్థికపరమైన ఒడిదొడుకులు వస్తున్నాయి. చిన్నపాటి ప్రైవేట్ పాఠశాలలకు అలాంటి ఇక్కట్లు, వనరులు సమకూర్చుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిసింది. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో నిలదొక్కుకొని ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం ఆశ్చర్యకరం.

ఎందరో భవిష్యత్ ను తీర్చిదిద్దే స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రైవేట్ రంగంలో పని చేయడం వల్ల ఏడాదిలో పది నెలల జీతం మాత్రమే వస్తోందని, ఈ యేడాది కరోనా వల్ల అది కూడా లేకుండాపోయిందని సంబంధిత సంఘాల ప్రతినిధులు జనసేన పార్టీకి వినతి పత్రం అందచేశారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో 5 లక్షల మందికిపైగా బోధన సిబ్బంది ఉన్నారు. ఆయా విద్యా సంస్థలు యేడాది ఫీజులు వసూలు చేసినా తమకు మాత్రం కరోనా పేరుతో గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబం గడవటం ఇబ్బందికరంగా మారిందనీ, బోధన వృత్తి నుంచి హాకర్లుగా, రోజు కూలీలుగా మారుతున్నారని వాపోయారు. ఆన్ లైన్ క్లాసులు ఏర్పాటు చేసి విద్యార్థుల నుంచి రుసుములు తీసుకొంటున్న సంస్థలు తమ సిబ్బందిని తగ్గించేస్తున్నాయనే విషయం పార్టీ దృష్టికి వచ్చింది. లక్షల్లో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల కష్టాలను రాష్ట్ర విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగాలు చేస్తున్నవారిని ప్రభుత్వం గుర్తించి తక్షణ ఉపశమనం కోసం ఆర్థిక సాయం అందించాలి. తమకు పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ. కల్పించాలని ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ కోరుతోంది. వీటిని కల్పించడంపై దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. బతక లేక బడిపంతులు అనే గతకాలపు మాటను వర్తమానంలో నిజం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, విద్యాసంస్థల నిర్వాహకులపైనా ఉందని పవన్ వ్యాఖ్యానించారు.

చైతు సినిమా పై రాతలు.. మేకర్స్ కి చిరాకు !


క్రియేటివిటీలో కాస్త గట్టి విషయం, నమ్మకమైన విశ్వసనీయత ఉన్న డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీసి.. అక్కినేని ఫ్యామిలీ మెంబర్లకు ఆప్తుడు అయిపోయాడు విక్రమ్. అలాగే అఖిల్ హీరోగా ‘హలో’ అనే చిత్రాన్ని కూడా రూపొందించి.. అఖిల్ కి హిట్ ఇవ్వాలని శాయశక్తులా ప్రయత్నం చేశాడు. ఇక ఈ సారి ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగ‌చైత‌న్యతో ఓ సినిమాని తెర‌కెక్కించబోతున్నాడు. అయితే ఎప్పుడూ సొంత క‌థ‌లుతోనే సినిమా తీసే విక్ర‌మ్, ఈ సారి చైతుతో చేసే సినిమాకి క‌థ మాత్రం విక్ర‌మ్ రాయ‌లేద‌ట, హిట్ లేని రైటర్ బివిఎస్ రవి, దిల్ రాజు జ‌మానాలో రెడీ చేసిన స్క్రిప్ట్‌ ను విక్రమ్ తీసుకుని త‌న స్ట‌యిల్‌లో మార్పులు చేసుకుంటున్నాడట.

బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

అయితే ఈ సినిమా పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. వాటిలో బాగా వైరల్ అయిన న్యూస్ ఈ సినిమా ఒక హర్రర్ థ్రిల్లర్ లా ఉండబోతుందని.. అయితే చైతుతో తన చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదని, రొమాన్స్ మరియు కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్టైనర్ అని విక్రమ్ ఆ మధ్య క్లారిటీ ఇచ్చాడు. అయినా సినిమా పై రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. రోజూ ఈ సినిమా అలా ఉండబోతుంది ఇలా ఉంటుంది అంటూ లేనిపోని రాతలతో మేకర్స్ కి కూడా చిరాకు పుట్టిస్తున్నారు రూమర్ల క్రియేటర్స్.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

మొత్తానికి చైతు – విక్రమ్ సినిమా పై సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ అన్ని ఫేక్. ఇక లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇప్పటికే షూట్ కు అవసరమైన సెట్స్ ను కూడా మేకర్స్ నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి చైతుకి విక్రమ్ ఈ సారి ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

బతికుంటే బలుసాకు తిందాం.. ఇంటికి పోదాం!

Hyderabad

Hyderabad

“బతికుంటే బలుసాకైనా తిని బ్రతకొచ్చు” ఈ సిటీ లో నేను ఉండలేను. “ఇంత బ్రతుకు బ్రతికి ఈ దిక్కులేని చావు నేను చావను” అనుకుంటూ మూట ముళ్లే సర్దుకొని రాజధానిని విడిచిపెట్టి సొంతూళ్లకు బయల్దేరుతున్నారు నగర వాసులు. తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసులతో జనాల్లోనూ ఆందోళన మొదలయింది. అంతేకాదు త్వరలోనే హైదరాబాద్‌ లో సంపూర్ణ లాక్‌ డౌన్ విధిస్తారనే ప్రభుత్వ సంకేతాలతో.. చాలా మంది మళ్లీ సొంతూళ్ల బాటపట్టారు. హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్తున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. లాక్‌ డౌన్ ప్రకటిస్తే ఇక్కడే చిక్కుకుపోతామని భావించి.. ముందే అప్రమత్తమై.. బస్సులు, సొంత వాహనాల్లో సొంతూళ్లకు పయనమవుతున్నారు. అంతేకాదు హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కేసులు కూడా ఒక కారణం. ఇక్కడే ఉంటే తమకూ కరోనా సోకుతుందేమోనని భయపడిపోతున్నారు. అందుకే సొంతూళ్లకు వెళ్లి గంజీ నీళ్లు తాగైనా బతుకుతామని మళ్లీ ఊరిబాట పట్టారు.

మరోవైపు గ్రామీణ ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో అక్కడ కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా గ్రామాలు మళ్లీ అష్ట దిగ్బంధనంలోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారిపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఎవరైనా వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చాటింపు వేయిస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్లైతే హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని గ్రామంలోకి రానీయడం లేదు. మరికొన్ని గ్రామాల్లో 14 రోజులు హోంక్వారంటైన్‌ లో ఉండాలని నిబంధనలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వలస జీవులు హైదరాబాద్‌ లో ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 14,419 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 5,172 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 247 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 82,458 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ పరిధిలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది.

తేజ.. సాయి పల్లవికి ఫిక్స్ ! ‌


యాక్షన్ హీరో గోపీచంద్‌ కి కూడా బాలయ్య లాగే హీరోయిన్ సమస్య ఉంది. ప్రెజెంట్ ఉన్న చాలామంది హీరోయిన్స్ గోపిచంద్ కి సెట్ అవ్వరు. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలిమేలుమంగ వేంకటరమణ’లో కూడా హీరోయిన్ సమస్యే. పైగా అలిమేలు మంగ పాత్ర మీదే సినిమా నడుస్తోందట. మరి అలాంటి పాత్రలో ఎవరు నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ ను వండి వార్చారు రాతల రాయుళ్లు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అలిమేలు మంగగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిను ఫైనల్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

నిజానికి ఇప్పటికే స్టార్ హీరోయిన్ల పేర్లని కూడా తేజ పరిశీలించారు. వారిలో ముఖ్యంగా కాజల్‌, అనుష్కలో ఒకర్ని హీరోయిన్ గా తీసుకోవాలని వాళ్ళు అయితేనే పాత్రకు న్యాయం జరుగుతుందని తేజ గట్టిగానే నమ్మాడు. కానీ గోపిచంద్ ప్లాప్ ల పరంపరతో పాటు ఈ సినిమా చిత్రీకరణలు మొదలయ్యే నాటికి కాజల్, అనుష్క ఖాళీగా ఉండాలి. బల్క్ డేట్స్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. ప్రస్తుతం కాజల్‌ చేతిలో ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు2’తో పాటు మరో బాలీవుడ్‌ సినిమా కూడా ఉంది. అనుష్క కూడా వచ్చిన సినిమాలన్నీ అంగీకరించే మూడ్ లో లేదు. అయినా గోపిచంద్ హిట్ ఫామ్ లో ఉండి ఉంటే కష్టం అయిన సర్దుకుపోయేవాళ్ళు. కానీ యాక్షన్ హీరోకి హిట్ లేకపాయే.

దాంతో చేసేది ఏం లేక తేజ మిగిలిన హీరోయిన్స్ లిస్ట్ ను చూడగా.. హీరోయిన్ కీర్తి సురేష్ అయితే బాగుంటుందని మొదట అనుకున్నా ఇప్పటికే కీర్తి వరుస సినిమాలు ఒప్పుకుని హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేసింది. ఈ మధ్యలో రకుల్ ను కూడా కదిలించారు గానీ, ఎక్స్ పోజింగ్ కి తప్ప ఎక్స్ ప్రెషన్ కి పనికిరాని రకుల్ ను పెట్టుకుని ఇంకో ప్లాప్ కొట్టడం ఇష్టం లేక, తేజ.. సాయి పల్లవికి ఫిక్స్ అయ్యాడు.

అరె.. బాలయ్య సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ !


‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – బాలయ్య బాబు’ సినిమా అంటేనే కథ ఎలా ఉన్నా, టైటిల్ మాత్రం పవర్ ఫుల్ గా ఉండాలనేది బాలయ్య బాబుగారి అబిష్టం. అందుకే పాపం బోయపాటి, బాలయ్య సినిమాకి టైటిల్ పెట్టడానికి నానా తిప్పలు పడుతూ ఉంటాడు. టీజ‌ర్ ను ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా టైటిల్ పై మాత్రం ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?

అందులో ప్రధానంగా ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ బాగా వినిపిస్తోంది. అయితే తాజాగా ‘సూపర్ మాన్’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. పైగా గతంలో ‘సూపర్ మాన్’ అనే టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా కూడా చేశారు. కాగా కథకు ‘సూపర్ మాన్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడట. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోందని బోయపాటి ఇప్పటికే చెప్పారు. మరి ఆ హీరోయిన్ బాలయ్య ఏజ్ కి సూట్ అవుతుందా లేదా అని అభిమానుల్లో కొంత టెన్షన్ ఉంది. మొత్తానికి టీజర్ లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో… పైగా పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను బాగానే అలరించారు. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షేనా?


తెలంగాణలో వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. ఎమ్మెల్యేలకు కరోనా సోకగానే సీఎం కేసీఆర్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతిచ్చారు.అప్పటిదాకా కరోనా వైద్యం కేవలం గాంధీ ఆస్పత్రికేనన్న కేసీఆర్ ఎమ్మెల్యేలకు రాగానే ఫ్లేట్ ఫిరాయించాడు. ఇక డబ్బున్న వాళ్లు అంతా కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కట్టేస్తున్నారు. డబ్బులేని పేదలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న దైన్యం కనిపిస్తోంది.

జులై నుంచి కొత్త లాక్ డౌన్ రూల్స్?

తాజాగా తెలంగాణలో రెండు ఘటనలు వైద్యుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టాయి. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలోనే నిన్న వెంటిలేటర్ తీసేయడంతో ఒక వ్యక్తి.. ఈరోజు పట్టించుకోపోవడంతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా సయ్యద్ అనే వ్యక్తి తెలంగాణలో వైద్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో కళ్లకు కట్టినట్టు వీడియో తీశాడు.

కరోనా అందరిలోనూ మానవత్వాన్ని దూరం చేస్తోంది. కొన ఊపిరితో ఉన్న రోగుల పట్ల వైద్యులు కనికరం చూపడం లేదు. లక్షణాలు కనపడితే చాలు వైద్యం చేయడం లేదు వైద్యులు. అప్పట్లో జర్నలిస్ట్ మనోజ్ కూడా ఇలానే వైద్యం అందక మృతిచెందగా.. నిన్న మరో వ్యక్తి సేమ్ అలాగే ఊపిరి అందక మృతిచెందిన దైన్యం తెలంగాణలో కలకలం రేపింది.

వైద్యుల కర్కశత్వంతో ఓ నిండు ప్రాణం నిన్న గాలిలో కలిసింది. హైదరాబాద్ లోని జవహర్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికి వచ్చాడు. తనకు ఊపిరి ఆడడం లేదని చెప్పినా వెంటిలేటర్ ను తొలగించారని.. చనిపోయే ముందు తండ్రికి రోగి సెల్ఫీ వీడియో పంపాడు. 3 గంటలుగా బతిమిలాడినా సిబ్బంది వెంటిలేటర్ పెట్టడం లేదని గుండె ఆగిపోతోందని.. ఊపిరి ఒక్కటే కొట్టుకుంటుందంటూ వ్యక్తి తల్లడిల్లాడు. వద్దన్న వినకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని.. తాను చచ్చిపోతున్నా అంటూ సదురు రోగి వీడియోలో వేడుకున్న వైనం ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. తెలంగాణలో వైద్యం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.

హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

ఈరోజు మరో వ్యక్తి కూడా ఇలానే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ కు చెందిన సయ్యద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రికి వచ్చాడు.. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చేర్చారు. ఆ ఐసీయూలో ఒక్కడే ఉండడంతోపాటు వైద్యులు ఎవరూ పట్టించుకోవడం లేదని .. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఈ ఉదయం చనిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

తెలంగాణలో వైద్యుల నిర్లక్ష్యం ఈ రెండు ఘటనలతో బయటపడింది. వీడియో చూసిన నెటిజన్లు వైద్యులను తిట్టిపోస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు నిండు ప్రాణం బలయ్యాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. జర్నలిస్టు మనోజ్ లాగే మరో ఇద్దరు తెలంగాణలో మరణించడం ఇక్కడ వైద్య సేవలు ఎంత అథమ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లమవుతున్నాయి.

సరిహద్దులో యుద్ధానికి భారత్ సిద్ధం?

War with china

వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. చైనాతో యుద్ధానికి భారత్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. యుద్ధం అంటూ వస్తే చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు అన్ని రకాల అత్యాధునిక యుద్ధ విమానాలను, శతఘ్నులను, క్షిపణి రక్షక వ్యవస్థలను తయారుచేసుకుంటోంది.

150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా చేధించగల రఫెల్ యుద్ధ విమానాలను భారత్ సిద్ధం చేస్తోంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కచ్చితత్వంతో పనిచేసే ఈ ఫైటర్‌ జెట్స్‌ లో ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపువేగంతో దాడిచేయగలిగే సామర్థ్యం ఉంది. ఆకాశంతో పాటు భూమిపైన లక్ష్యాలను కూడా రఫెల్ సులభంగా చేధిస్తుంది. ఈ విమానాల నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. భారత అవసరాలకు అనుగుణంగా రఫెల్‌ లో మార్పులు చేశారు.  ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానంగా పేరున్న రఫెల్‌ తో పాక్, చైనాలకు చెక్ పెట్టవచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

చైనా 1962లో భారత్‌ పై దాడి చేయడమే కాకుండా ఆక్సయ్‌చిన్‌ను ఆక్రమించుకుంది. అనంతరం 1967లో సిక్కింలోని నాథులా కనుమలో మరో సారి దురాక్రమణకు దిగింది. ఈ పోరులో చైనా విపరీతంగా నష్టపోయింది. చివరకు వారే వెనక్కువెళ్లారు.  1987లోనూ అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని తవాంగ్‌ లోని సమ్‌ దురాంగ్‌ ను ఆక్రమించుకునేందుకు బీజింగ్‌ విఫలయత్నం చేసింది. ఆ సమయంలో జనరల్‌ సుందర్జీ నేతృత్వంలో ఆపరేషన్‌ ఫాల్కన్‌, ఆపరేషన్‌ చెకర్‌ బోర్డు కార్యక్రమాలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన చైనీయులు వెంటనే ఆక్రమితప్రాంతాల నుంచి వెనుదిరిగారు. ఆర్థిక రంగంలో ఉదారవాద విధానాలతో చైనా ప్రపంచంలోనే బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. భవిష్యత్తులో అమెరికాను కూడా దాటి అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవనుంది. ఈ సమయంలో భారత్‌తో యుద్ధం వస్తే చైనా తీవ్రంగా నష్టపోవాల్సివుంటుందని ఆ దేశ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  1962 తరువాత భారత్‌ సైనికంగానూ, ఆర్థికంగానూ బలపడింది. చైనా దగ్గర అణ్వాయుధాలుంటే మన దగ్గరా ఉన్నాయి. చైనాకు దీటుగా బదులివ్వగల సైన్యం, వాయుసేన, నౌకాదళం ఉన్నాయి. క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం వస్తే మన కంటే చైనా ఆర్థికంగా నష్టపోనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లోని సైనిక బలగాల కూర్పుపై అమెరికాకు చెందిన బెల్ఫర్‌ సెంటర్‌ అధ్యయనం చేసి ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.