Harsh Goenka Tweet Viral: అడవికి రాజు సింహమే. సింహం ఆకలిగా ఉంటే అడవి కూడా పస్తు ఉంటుందట. అదే సింహం వేటకు వెళితే అడవి కూడా పండగ చేసుకుంటుందట.. ఎంత మృగరాజు అయినా సరే సింహం తను వేటకు వెళ్లే సమయంలో అత్యంత గోప్యత పాటిస్తుంటుందట. దానికి సంబంధించిన చిన్న సమాచారం కూడా ఇతర జంతువులకు చేరవేయడానికి ఇష్టపడదట. సింహం వేటాడిన తర్వాత.. దాని ఆకలి తీరిన తర్వాత మిగతా మాంసాన్ని ఇతర జంతువులు తింటుంటే తనలో తాను నవ్వుకుంటుందట.. తను వేటాడే నైపుణ్యం.. ఇతర జంతువుల మీద చేసిన దాడి.. మిగతా వాటికి తెలియకుండా జాగ్రత్త పడడమే మంచిదని అనుకుంటుందట.
కేవలం సింహం మాత్రమే కాదు మనుషులు కూడా ఇలానే ఉండాలట. ఎందుకంటే మనుషులు తమ వ్యక్తిగత జీవితాలలో జరిగే అత్యంత లోతైన సంఘటనలు.. వాటికి సంబంధించిన విషయాలను ఇతరులతో ఏమాత్రం పంచుకోవద్దట. మనతో ఎంత సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలను ఇతరులతో ఏమాత్రం చెప్పుకోదట.. ముఖ్యంగా ఆదాయాలను.. చేసే ఖర్చులను.. భవిష్యత్తు కాలంలో చేపట్టబోయే ప్రణాళికలను.. కుటుంబ బంధాలను.. కుటుంబ సభ్యులతో ఎదురవుతున్న సమస్యలను.. ఆర్థిక సమస్యలను ఇతరులతో ఏమాత్రం చెప్పుకోదట. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయాంక చెబుతున్నారు.. తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఇదే విషయాన్ని ఆయన పంచుకున్నారు.
ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. మెజారిటీ ప్రజలు ఆయన చేసిన ట్వీట్ తో ఏకీభవిస్తున్నారు.. తమ వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలను ఇతరులతో పంచుకోవడం వల్ల ఇబ్బంది పడ్డట్టు చాలామంది అభిప్రాయపడ్డారు. అప్పటినుంచి తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకోవడం మానేశామని వారు చెబుతున్నారు. ఇప్పుడు మాత్రమే కాదు హర్ష గోయంక అనేక సందర్భాలలో ఇలా మోటివేషనల్ మాటలు మాట్లాడుతుంటారు. క్షణం కూడా తీరిక లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మోటివేషనల్ స్పీకర్ అవతారం ఎత్తుతారు. గొప్ప గొప్ప ప్రసంగాలు చేయరుగాని.. సమాజ గతి మార్చేసే మాటలు మాత్రం ఆయన చెబుతుంటారు. అందువల్లే ఆయనను చాలామంది అనుసరిస్తుంటారు. ఆయన చెప్పిన మాటలను ఆచరిస్తుంటారు.
My Guru always tells me “Never outshine the master. Impress, but don’t intimidate. Make those above you feel secure, and you’ll rise higher.”
— Harsh Goenka (@hvgoenka) August 28, 2025