https://oktelugu.com/

King Kong: మూడు సంవత్సరాలకే ఆరడుగుల ఎత్తు.. బాహుబలి దున్నపోతు కూడా దీని ముందు దిగదుడుపే.. వైరల్ వీడియో

పదునుగా కొమ్ములు.. దృఢమైన కాళ్లు. అంతకంటే బలమైన గిట్టలు.. విశాలంగా ముపూరం.. బలమైన దేహం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దున్నపోతు వర్ణన ఒక పట్టాన ముగియదు.

Written By: , Updated On : February 13, 2025 / 12:24 PM IST
King Kong

King Kong

Follow us on

King Kong: బాహుబలి లో బల్లాల దేవుడు పడగొట్టిన దున్నపోతు కంటే ఇది కొన్ని వందల రెట్లు పెద్దది.. దాని వయసు మూడు సంవత్సరాలే.. కానీ ఎత్తు మాత్రం ఆరు అడుగుల 8 ఇంచులు. అందువల్లే అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దున్నపోతుగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. ఇది థాయిలాండ్ లోని ఓ ఫామ్ లో జన్మించింది.. దీనికి కింగ్ కాంగ్ అని పేరు పెట్టారు. చూసేందుకు కూడా అలానే ఉంది. ఈ దున్నపోతు సాధారణ గేద కంటే 20 అంగుళాలు అధికంగా పొడవు ఉంది. అంత ఎత్తు ఉన్నప్పటికీ.. క్వింటాళ్లకొద్ది బరువు ఉన్నప్పటికీ.. అది ఏమాత్రం దూకుడు కొనసాగించడం లేదు. పైగా తన వద్దకు వచ్చే మనుషులతో అది అత్యంత స్నేహంగా ఉంటుంది. ఫామ్ లో సిబ్బంది ఈ దున్నపోతుకు ఉదయం పచ్చిగడ్డి.. మధ్యాహ్నం వేరుశనగ చక్క.. సాయంత్రం దాణాను ఆహారంగా ఇస్తున్నారు. ఇది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమృద్ధిగా నీరు తాగుతుంది.. మధ్యాహ్నం వేళలో సమీపంలో ఉన్న పచ్చిక బయళ్లల్లో మేతమేస్తుంది..

సంప్రదాయ గేదెకే జననం

ఈ దున్నపోతు సంప్రదాయ గేదెకే జన్మనిచ్చింది. నాటు జాతి దున్నపోతు అయినప్పటికీ.. ఇది ఎంతో ఎత్తు పెరుగుతుంది. అయితే దీని పెరుగుదల ఇప్పటితోనే ఆగిపోదని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. పైగా దీని జన్యువులలో విపరీతమైన పెరుగుదల లక్షణాలు ఉన్నాయని.. అందువల్లే ఆ దున్నపోతు ఆ స్థాయిలో పెరుగుతోందని పశువు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. థాయిలాండ్ లోని కొన్ని ప్రాంతాలలో దున్నపోతులకు పోటీలు నిర్వహిస్తారు. బరువులు లాగడం.. కొట్లాట వంటి వాటిని నిర్వహిస్తారు. అయితే ఈ దున్నపోతును ఇటీవల కొట్లాట పోటికి తీసుకెళ్తే.. దాని ఆకారం చూసి.. ప్రత్యర్థి దున్నపోతు యజమాని పోటీ నుంచి విరమించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దున్నపోతు వీర్యానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉందట. గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఈ దున్నపోతు గురించి ప్రముఖంగా ప్రస్తావించడంతో.. దీని వీర్యం కోసం అనేక దేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయని ఫామ్ నిర్వాహకులు చెబుతున్నారు.. అయితే వీర్యాన్ని తాము అమ్మడం లేదని.. దీని జాతిని పరిరక్షించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నామని.. ఫామ్ లో ఈ దున్నపోతును ప్రత్యేకంగా పెంచుతున్నామని నిర్వాహకులు అంటున్నారు. ” మా ఫామ్ లో పెరిగిన ఈ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇది ఎత్తు పెరగడం మాకు ఆనందాన్ని ఇస్తోంది. అయితే దీనిని ప్రత్యేకమైన ఫామ్ లో పెంచుతున్నాం. ఇతర దున్నపోతులతో కలవనీయడం లేదు. దీన్ని ప్రత్యేకంగా చూస్తున్నాం. దీని వీర్యం అమ్మడం మాకు ఏ మాత్రం ఇష్టం లేదని” నిర్వాహకులు అంటున్నారు.

 

King Kong: Tallest Water Buffalo - Guinness World Records