World’s Fastest High-Speed Train: ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన ప్రయాణ సాధనంగా విమానం ఉన్నది. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే సామర్థ్యం విమానాలకు ఉంటుంది. కొన్ని ప్రైవేటు జెట్ లకు ఇంకా ఎక్కువ సామర్ధ్యం ఉంటుంది. అయితే ఇకపై వీటి వేగం గత చరిత్రకానుంది. ఎందుకంటే వీటిని అధిగమించే.. వీటి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే సాధనం ఒకటి వచ్చింది. అయితే అది రాకెట్ కాదు.. అత్యంత అధునాతనమైన విమానం కూడా కాదు.. ఇంతకీ అది ఏంటంటే..
శాస్త్ర సాంకేతిక రంగాలలో అమెరికాను మించి పోవాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అనేక రకాలుగా పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలో భాగంగా సి ఆర్ 450 అనే మ్యాగ్నెటిక్ లెవిటేషన్(మాగ్లెవ్) అనే రైలును ప్రవేశపెట్టింది. అయితే ఈ రైలు ఇంకా పరుగులు పెట్టనప్పటికీ.. ప్రయోగ దశను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది గంటకు 620 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోయింది.. వాస్తవానికి సగటు కమర్షియల్ ప్యాసింజర్ జెట్ గంటకు 480 నుంచి 575 కిలోమీటర్ల మధ్య ప్రయాణిస్తుంది.. అయితే చైనా తయారుచేసిన మాగ్లెవ్ రైలు 7 సెకండ్ల కంటే తక్కువ సమయంలోనే గంటకు 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. ఈ రైలు విద్యుత్ అయస్కాంత శక్తి ద్వారా ముందుకు దూసుకుపోతుంది. 2024లో సిఆర్ 450ఏఎఫ్ బుల్లెట్ రైలు ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మాగ్లెవ్ రైలు ముందు భాగం కూడా దాన్ని మాదిరిగానే ఉంది. ఇది గాలి నిరోధకతను పూర్తిగా తగ్గిస్తుంది..
చైనా దేశంలో వివిధ ప్రాంతాలను అత్యంత వేగంగా కవర్ చేయడానికి దీనిని రూపొందించినట్టు తెలుస్తోంది. పైగా ఈ ప్రాంతాల మధ్య ప్రయాణం ప్రజలకు అత్యంత ఖరీదుగా మారడంతో.. ఈ రైలును ప్రవేశపెట్టింది.. అందువల్లే అంత వేగంతో నడిచే విధంగా దీనిని రూపొందించింది.. సాంప్రదాయ హై స్పీడ్ రైళ్ల కంటే.. దీని నిర్వహణ కర్చు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.. ఈ రైలు ట్రాక్ లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇతర రైళ్లు దీని మీద నడవడానికి అవకాశం ఉండదు. ఈ రైళ్లు అత్యధికంగా శబ్దాన్ని చేస్తాయి. ఆ ధ్వని కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.. ఉదాహరణకు షాంగై మాంగ్లేవ్ రైలు గంటకు 430 కిలోమీటర్ల వేగంతో నడిచినప్పుడు దాని ధ్వని 96 డేసిబిల్స్ నమోదవుతుంది.. అయితే మాంగ్లేవ్ రైలు మాత్రం ఇంతకుమించి శబ్దాన్ని చేస్తుంది. అని శబ్దాన్ని తగ్గించడానికి ప్రత్యేకమైన సొరంగాలు అవసరం..
ప్రయాణికులను అత్యంత వేగవంతంగా గమ్యస్థానాలను చేర్చడం.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడం.. విమాన ప్రయాణాలు భారంగా మారడం.. వంటి కారణాలతో ఈ రైలును చైనా ప్రవేశపెట్టింది. సరిగ్గా 2010లో చైనాలోని హైవే సి110లో 12 రోజులపాటు ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసే వారి సంఖ్య పెరగడం వల్ల ఇలాంటి సమస్య ఎదురయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చైనా ఈ హై స్పీడ్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోదశ విజయవంతమైన నేపథ్యంలో.. త్వరలో పట్టాల మీద పరుగులు పెడుతుందని చైనా మీడియా చెబుతోంది.