Genghis Khan: చెంఘిజ్‌ఖాన్.. ప్రపంచాన్ని జయించిన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. సుమారు ఎనిమిది శతాబ్దాల క్రితం మంగోలుల సంచారి టెముజిన్ ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి చెంఘిజ్ ఖాన్‌గా చరిత్రలో నిలిచాడు. ఆఫ్రికా నుంచి మొదలుకుని అనేక దేశాలను జయించుకుంటూ భారత సరిహద్దు వరకు తన సామ్రాజా‍్యన్ని విస్తరించాడు. అయితే భారత్‌లోకి మాత్రం అడుగు పెట్టలేదు. భారత సరిహద్దు నుంచే వెనుదిరిగాడు. చంఘిజ్‌ఖాన్ ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.
కఠిక దారిద్య్రం నుంచి మహా విజేతగా..
బైకాల్ సరస్సు ప్రాంతంలో 1162లో జన్మించాడు చెంఘిజ్, చిన్నప్పుడే తండ్రికి శత్రువులు విషం ఇచ్చి చంపేశారు. దీంతో కుటుంబ భారం అతనిపై పడింది. పేదరికం, అవమానాల మధ్య పెరిగాడు. 13 ఏళ్ల వయసులోనే సవతి సోదరుడిని హత్య చేసి పోరాటాన్ని ప్రారంభించాడు. తనకన్నాపెద్దవాడైన సోదరుడిని వారసుడిగా భావిస్తాడని చంపేశాడు. ఇది ఆయనలోని క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. షామానిజం విశ్వాసాలతో ఆకాశ దేవతలను ఆరాధించిన ఈ మంగోల్ నాయకుడు.. 50 ఏళ్ల వయసులో సొంత సైనిక వ్యవస్థను సృష్టించుకున్నాడు. విజయ పరంపర మొదలు పెట్టాడు. చైనా, మధ్య ఆసియా, యూరప్‌లో విజయాలు సాధించాడు. అలెగ్జాండర్, నెపోలియన్ తరహాలో తన సామ్రాజ్యాన్ని విస్తరించి ప్రపంచ యోధుడిగా నిలిచాడు.
క్రూరత్వం, నైపుణ్యాల మిశ్రమం
చదవడం, రాయడం రాకపోయినా చెంఘిజ్ వ్యక్తిత్వం ద్వంద్వం సైనిక మేధస్సు కలిగినది. ప్రజల మనసును చదవగల నేర్పరి. దూరదృష్టి కలవాడు. క్రూరత్వం, కృతజ్ఞత లేకపోవడం, ప్రతీకారేచ్ఛ వంటి దుర్గుణాలు కూడా ఉన్నాయి. భార్య కిడ్నాప్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. చంఘీజ్‌కు కోపం ఎక్కువ. తన ఉత్తర ప్రత్యుత్తరాల కోసం గుమస్తాను నియమించుకున్నాడు. ఒకసారి ‘‘మోసుల్ యువరాజు, సిరియాపై దాడి చేయబోతున్నారనే వార్త చెంఘిజ్‌కు తెలిసింది. ‘ఆ సాహసం చేయొద్దు’ అంటూ మోసుల్ యువరాజుకు తన గుమాస్తాతో హెచ్చరిక లేఖ రాయించాడు. కానీ, ఆ గుమస్తా దౌత్యపరంగా ఆలోచించి, లేఖలో కాస్త మృదువైన భాషను ఉపయోగించారు. ఇస్లామిక్ ప్రపంచంలో ఉన్న గౌరవప్రదమైన పదాలను మోసుల్ యువరాజు కోసం లేఖలో గుమాస్తా ఉపయోగించారు. ఆ లేఖను మంగోలియా భాషలో చదివి వినిపించినప్పుడు చెంఘిజ్ ఖాన్ కోపంతో ఊగిపోయారు. ద్రోహిగా భావించి సైనికుడితో చంపించాడు. చరిత్రకారులు అతని క్రూరత్వాన్ని కాలపరిస్థితులకు ఆపాదిస్తూ, ‘లొంగిపోండి లేక చనిపోండి‘ విధానాన్ని శత్రు లొంగడానికి అవకాశంగా వర్ణించారు. జమూగా యుద్ధంలో విషబాణంతో గాయపడినప్పుడు సహచరుడు జెల్మే ప్రాణాలు కాపాడినా, కృతజ్ఞత లేకుండా వ్యవహరించాడు.
భారత్‌లో అడుగు పెట్టకుండా..
చెంఘిజ్ ఖాన్ 1211–16 మధ్య చైనా జయఘనాల తర్వాత, ఖ్వారెజ్మ్ షా జలాలుద్దీన్‌ను వెంబడి చెంఘిజ్ సింధు నది ఒడ్డునికి చేరాడు. మూడు వైపులా చుట్టుముట్టి జలాలుద్దీన్ సైన్యాన్ని ధ్వంసం చేశాడు. ధైర్యవంతుడైన జలాలుద్దీన్ నదిలోకి దూకి తప్పించుకున్నా, అతని బంధువులను చంపాడు. దిల్లీ సుల్తాన్ ఇల్తుత్మిష్ జలాలుకు ఆశ్రయం ఇవ్వకపోవడం మంగోలులకు అవకాశం కల్పించినా, చెంఘిజ్ ముందుకు సాగలేదు. భారత వేడి చెంఘిజ్‌కు అసహ్యం పట్టణాల్లో జ్వరాలు, వ్యాధులు సైన్యాన్ని బలహీనపరిచాయి. 10 వేల గుర్రాలకు రోజుకు 250 టన్నుల మేత, నీరు అవసరం, కానీ ముల్తాన్, సింధ్‌లో మేత కొరత. అడవులు, పర్వతాల గురించి సమాచారం లేకపోవడం, ఖడ్గమృగం చూసి మూఢనమ్మకాలతో చెడు శకునంగా భావించడం కీలకం. ఈ అంశాలు కలిసి, మంగోలియాకు తిరిగి రావడానికి దారితీశాయి. ఇది అతని దూరదృష్టి, వ్యూహాత్మక నిర్ణయాన్ని తెలియజేస్తుంది.