Homeవింతలు-విశేషాలుWhy Do Cats Eat Only Half Food: ప్లేట్ నిండా పెట్టినా.. పిల్లులు సగమే...

Why Do Cats Eat Only Half Food: ప్లేట్ నిండా పెట్టినా.. పిల్లులు సగమే ఎందుకు తింటాయి..

Why Do Cats Eat Only Half Food: ఆకలి అనేది ఏ జీవికైనా సరే ఒకే విధంగా ఉంటుంది. ఆ సమయానికి ఆహారం కడుపులో పడితే శక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఏ జీవి అయినా సరే కడుపునిండా తినిపిస్తుంది. కనిపించిన ఆహారాన్ని వేగంగా కడుపులోకి పంపిస్తుంది. చిన్న చీమ నుంచి మొదలు పెడితే అతిపెద్ద ఏనుగు వరకు ఆకలిని ఇలానే తీర్చుకుంటాయి. కానీ పిల్లి మాత్రం పూర్తిగా విరుద్ధం. పెంపుడు పిల్లులను మీరు ఒకసారి […]

Why Do Cats Eat Only Half Food: ఆకలి అనేది ఏ జీవికైనా సరే ఒకే విధంగా ఉంటుంది. ఆ సమయానికి ఆహారం కడుపులో పడితే శక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఏ జీవి అయినా సరే కడుపునిండా తినిపిస్తుంది. కనిపించిన ఆహారాన్ని వేగంగా కడుపులోకి పంపిస్తుంది. చిన్న చీమ నుంచి మొదలు పెడితే అతిపెద్ద ఏనుగు వరకు ఆకలిని ఇలానే తీర్చుకుంటాయి. కానీ పిల్లి మాత్రం పూర్తిగా విరుద్ధం.

పెంపుడు పిల్లులను మీరు ఒకసారి గమనిస్తే.. వాటికి పెట్టిన ఆహారంలో కేవలం సగం మాత్రమే తింటాయి. మిగతా ఆహారాన్ని వదిలేస్తుంటాయి. దీనికి తో బలమైన కారణం ఉంది. ఆహారం వల్ల వచ్చే వాసన పిల్లులకు ఇబ్బంది కలిగిస్తుంది . అందువల్లే పిల్లులు సగం ఆహారాన్ని మాత్రమే తింటాయి. మిగతా ఆహారాన్ని అలా వదిలేస్తూ ఉంటాయి. ఎంత మంచి ఆహారం పెట్టిన సరే.. రోజు అదే పెడితే పిల్లులు తినడం పక్కన పెడతాయి. ఒకవేళ వేరువేరు రకాలైన ఆహార పదార్థాలను పెడితే.. అవి ఇష్టంగా తినేస్తుంటాయి. పిల్లులు ఆహారానికంటే.. రుచికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తాయి.

ఇటీవల కొంతమంది పరిశోధకులు పిల్లుల ఆహార అలవాట్ల గురించి పరిశోధన చేశారు. కొన్ని పిల్లులను పరిశీలించారు. ప్రతిరోజు వాటికి ఒకే విధమైన ఆహారాన్ని పెట్టారు. ఆ ఆహారాన్ని తినడంలో పిల్లులు కాస్త నిరాసక్తతను ప్రదర్శించాయి. వేరే ఆహారం పెడితే ఇష్టంగా లాగించాయి. ఆకలిగా ఉన్నప్పుడు వాటికి ఆహారం పెడితే తినడానికంటే ముందు.. వాసన చూసేందుకు ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్లే పిల్లులు సగం ఆహారాన్ని మాత్రమే తింటాయి. ఇక మాంసాహార విషయంలో కూడా పిల్లులు ఇదే విధానాన్ని కొనసాగిస్తాయి. ఒకరోజు చికెన్.. మరొక రోజు మటన్.. ఇంకొక రోజు ఫిష్.. ఇలా మార్చి మార్చి పెడితే అవి ఇష్టంగా తింటాయి.

పిల్లు లకు ఎంత గొప్పగా ఆహారం పెట్టినా.. ఇంకా ఎంత మంచిగా వాటిని చూసుకున్నా.. అవి విశ్వాసాన్ని మాత్రం అంతగా చూపించవు. కుక్కల మాదిరిగా వాటికి విశ్వాసం ఉండదు. కేవలం ఆ క్షణం వరకే సరదాగా ఉంటాయి. ఆ తర్వాత తమ దారి తాము చూసుకుంటాయి. యజమానుల మీద విపరీతమైన ప్రేమ ఉన్న పిల్లులు మాత్రం కొంతమేర అనుబంధాన్ని ప్రదర్శిస్తాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper