Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan New Movie Title: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. ఫ్యాన్స్...

Pawan Kalyan New Movie Title: పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే వార్త..

Pawan Kalyan New Movie Title: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక కొత్త టీం ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. జెన్ జీ యూత్ ఆడియన్స్ కి అనుగుణంగా , పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఇక ఆ టీం ద్వారానే జరగనుంది. ఉస్తాద్ ఫ్లాప్ అవ్వడం తో సురేందర్ రెడ్డి తో చెయ్యాల్సిన […]

Pawan Kalyan New Movie Title: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక కొత్త టీం ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. జెన్ జీ యూత్ ఆడియన్స్ కి అనుగుణంగా , పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఇక ఆ టీం ద్వారానే జరగనుంది. ఉస్తాద్ ఫ్లాప్ అవ్వడం తో సురేందర్ రెడ్డి తో చెయ్యాల్సిన మూవీ ని కూడా హోల్డ్ లో పెట్టాడు. పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే , ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయి అట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అమరావతి లోనే ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసి, స్క్రిప్ట్ వర్క్ ని , అదే విధంగా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నాడట. సమ్మర్ పూర్తి అయ్యాక ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇది కాసేపు పక్కన పెడితే సురేందర్ రెడ్డి చిత్రం కంటే ముందు పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ ని సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ని కూడా ఖరారు చేసినట్టు సమాచారం. అందుతున్న విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘ఓజాస్ గంభీర – ది ర్యాంపేజ్ బిగిన్స్’ అనే టైటిల్ ని లాక్ చేశారట. ఇప్పటికే ప్రీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేశారట. ప్రస్తుతం సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పై పని చేస్తున్నారట. ఈ ప్రీక్వెల్ , సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ని ఒకే సారి ప్లాం చేస్తారట. ‘ధురంధర్ ‘ , ‘ధురంధర్ 2’ చిత్రాలు ఎలా అయితే మూడు నెలల గ్యాప్ లో విడుదల అయ్యాయో, ‘ఓజీ 2’, ‘ఓజీ 3’ చిత్రాలు కూడా అలాగే విడుదల చేస్తారట.

అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ , ఈ ఏడాది డిసెంబర్ నుండే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. సుజిత్ ఈ చిత్రాన్ని ఇండియా లోనే మోస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఫిల్మ్ గా తీర్చి దిద్దాలని చూస్తున్నట్టు సమాచారం. 2028 సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రీక్వెల్ , సీక్వెల్ లలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , రెబల్ స్టార్ ప్రభాస్, నేచురల్ స్టార్ నాని వంటి వారు కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper