Chinese People Tall: శాస్త్ర సాంకేతిక రంగాలలో చైనా ఇప్పటికే ప్రపంచ దేశాలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది చైనా. అయినప్పటికీ చైనా ఆగడం లేదు. మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.. జపాన్ నుంచి మొదలు పెడితే ఇండియా వరకు ప్రతి దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాలలో పోటీస్తోంది… ఇక తయారీ రంగంలో అయితే సరికొత్త బెంచ్ మార్కులు సృష్టిస్తోంది చైనా.. మౌలిక రంగం, తయారీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, లాజిస్టిక్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ చైనా అద్భుతాలు సృష్టిస్తోంది.
చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడానికి తహతహలాడుతోంది. ఇందులో భాగంగానే అనేక రకాలైన ప్రయోగాలు చేస్తోంది.. చివరికి సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అలా ఇప్పుడు చైనా చేసిన ఓ ప్రయోగం ప్రపంచ దేశాలను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అంతేకాదు అమెరికా లాంటి దేశాలు ఆశ్చర్యంగా చూసే పరిస్థితి కలిగిస్తోంది.
మారిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చైనా దేశస్తులు తమ ఎత్తును పెంచుకోవడంలో దూసుకుపోతున్నారు. గడిచిన 35 సంవత్సరాలలో చైనా పురుషులు సంఘటన 9 సెంటీమీటర్లు పెరిగారు. అదే భారతీయులు రెండు సెంటీమీటర్లు మాత్రమే పెరగడం విశేషం. పోషకాహార లోపం… నాణ్యమైన ఆహారం పెట్టడంలో నిర్లక్ష్యం వల్ల భారతీయులు ఆశించిన స్థాయిలో ఎత్తు పెరగలేకపోతున్నారు.. అందువల్లే దాదాపు 35 శాతం చిన్నారులు కురచబడిపోయినట్టు పోషకాహార నిపుణులు చెబుతున్నారు.. శరీర పెరుగుదల అనేది సామాజిక ఆర్థిక పురోగతికి అద్దం పడుతుందని పౌష్టికాహార నిపుణులు వివరిస్తున్నారు.
కరోనా వచ్చినప్పుడు చైనా దేశస్థులకు సంబంధించిన ఆహార పలవాట్లు విపరీతంగా ట్రోల్ అయ్యాయి.. పచ్చి మాంసాన్ని ఆరగిస్తారని.. అడ్డగోలుగా తింటారని.. ఆహారపు అలవాట్లు విచిత్రంగా ఉంటాయని అనేక వీడియోలు ద్వారా తెలిసింది. ఇప్పుడు చైనా దేశస్తుల ఆహారపు అలవాట్ల వల్ల వారు ఎత్తు పెరుగుతున్నారని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రకారం చూసుకుంటే చైనా దేశస్తుల ఆహారపు అలవాట్లు మంచివేనని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు. మనదేశంలో పిల్లలకు పెట్టే తిండి విధానంలో మార్పు రావాలని.. అప్పుడే వారు ఊహించిన ఎత్తు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.