Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన భాస్కర్ (పేరు మార్చాం), రాధిక (పేరు మార్చాం) వివాహం జరిగింది. వీరిద్దరూ సమీప బంధువుల పిల్లలే.. ఎప్పటినుంచో వీరి కుటుంబాల మధ్య అనుబంధం కొనసాగుతోంది. అందువల్లే ఇరు కుటుంబాల సభ్యులు వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత పెళ్లికి ఓకే చెప్పారు. దీంతో ఇరుకుటుంబాల వారు వివాహాన్ని ఘనంగా జరిపించారు. వచ్చిన బంధువులకు అద్భుతమైన విందు భోజనం పెట్టారు.. ఇంకా పెళ్లికి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెళ్లి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ పెళ్లి కార్యక్రమాలు మూడు రోజులపాటు జరుగుతూ ఉంటాయి. వివాహ తర్వాత ఇంకా కొన్ని క్రతువులు జరగాల్సి ఉన్నది.
Also Read : ఊళ్లల్లో పనికిరాదు అనుకున్న ఈ పంట లక్షల్లో ఆదాయం ఇస్తుంది.. దీనిని ఎలా చేయాలంటే?
వధువుకు కడుపు నొప్పి రావడంతో..
వివాహం తర్వాత మిగతా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నప్పటికీ.. వివాహం జరిగిన రాత్రి వధువుకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో వరుడు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను వైద్యులు పరీక్షించారు. ఆ తర్వాత ఆమె 9 గర్భవతి అని తేల్చారు. దీంతో వరుడు ఒకసారిగా షాక్ కు గురయ్యాడు. మరొకసారి పరీక్షలు నిర్వహించాలని వైద్యులను కోరాడు. అప్పటికి పరీక్షలు నిర్వహించిన వారు గర్భవతి అని తేల్చారు. దీంతో వరుడు ఒకసారిగా నిర్గాంత పోయాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆ వధువు పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆ వరుడు జరిగిన విషయాన్ని వధువు కుటుంబ సభ్యులతో చెప్పి.. అనంతరం తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్టు సమాచారం..” పెళ్లయిన ఒక రోజులోనే వధువుకు గర్భం రావడం ఏంటి.. అది కూడా 9 నెలల వయసు ఉండడం ఏంటి” అని స్థానికంగా చర్చ జరుగుతున్నది. “అమ్మాయి గర్భవతి అని తెలియదా? 9 నెలల గర్భం దాల్చిన అమ్మాయి కడుపు లావుగా ఉంటుంది కదా? ఆ విషయాన్ని పరిశీలించలేదా? ” అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ” అమ్మాయి గర్భం గురించి తెలుసు. కాకపోతే ఎక్కువ కట్నం ఇస్తామని చెప్పి ఉంటారు. అందువల్లే పెళ్లి కొడుకు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ చివరికి ఆమె కడుపులో నొప్పి రావడం.. విషయం బయటపడటంతో పరువు పోతుందని భావించి ఆ అమ్మాయిని వారి ఇంట్లో వదిలిపెట్టి ఉంటాడని” నెటిజన్లు పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Also Read : ఈ కోడికి అగ్గితగలా.. ఇదేందయ్యా.. తట్టుకోలేక ఆర్డీవో కు ఫిర్యాదు