Pumpkin: అమెరికా దేశంలో సారవంతమైన నేలలు విస్తారంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో గుమ్మడికాయలను రకరకాల వంటకాలలో ఉపయోగిస్తారు. పాస్తా, నూడిల్స్, బర్గర్, ఫిజ్జా, చీజ్ వంటి వంటకాల తయారీలో వినియోగిస్తారు. అందువల్లే అమెరికా దేశంలో గుమ్మడికాయలను విస్తారంగా సాగు చేస్తారు. కొందరు రైతులు భారీ పరిమాణంలో గుమ్మడికాయలను పండిస్తారు. ఔత్సాహిక రైతులు వివిధ రూపాలలో గుమ్మడికాయలను తీర్చి దిద్దుతుంటారు. అయితే గుమ్మడికాయలను ప్రదర్శించడానికి అక్కడ ప్రతి ఏడాది పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఈసారి దక్షిణాఫ్రికాలోని షాన్ ఫ్రాన్సిస్కోలో హాఫ్ మూన్ బే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పంప్ కిన్ వే ఆఫ్(51st World championship pumpkin weigh off) అనే పేరు పెట్టారు. ఈ పోటీలకు అమెరికా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు హాజరయ్యారు. అయితే ఈ పోటీలలో మిన్నె సోటా లోని అనోకా ప్రాంతానికి చెందిన ట్రావెల్ జింజర్ అనే ఉద్యానవన టీచర్ పండించిన అత్యంత భారీ గుమ్మడికాయ విజేతగా నిలిచింది. ఆయన పండించిన గుమ్మడికాయ బరువు ఏకంగా 1,121 కిలోలు ఉంటుంది. ఇంతటి ఆకారంలో ఉన్న భారీ గుమ్మడికాయ అక్కడివారిని విశేషంగా ఆకర్షించింది.. అయితే ఈ గుమ్మడికాయను ఆయన పూర్తిగా సేంద్రియ విధానంలో పండించారు. ఈ గుమ్మడి పంటను పండించడానికి ఆయన ముందుగా నేలను నాలుగైదు సార్లు దున్నారు.. ఆ తర్వాత జీవ ఎరువులను వేశారు. ఆ తర్వాత మళ్లీ దున్నారు.. అనంతరం గుమ్మడి విత్తులను నాటారు. గుమ్మడి పాదుల వద్ద డ్రిప్పు పైపులను ఏర్పాటు చేశారు. వాటికి నత్రజని, భాస్వరం, ఇతర ఎరువులు సరఫరా అయ్యేవిధంగా నీటిలో కలిపారు. ఆ నీటిని డ్రిప్ విధానంలో పాదుల వద్ద పడే ఏర్పాట్లు చేశారు. ఫలితంగా మొక్కలు ఏపుగా పెరిగాయి. చీడపీడలు ఆశించకుండా విస్తారంగా బరువు పెరిగాయి. అందులో ఓ గుమ్మడికాయ 1,121 కిలోలు పెరిగింది.
అమెరికా అంటేనే..
అమెరికా అంటేనే రకరకాల సంప్రదాయాలకు నిలయం. అక్కడ విభిన్న రకాల వేడుకలు జరుగుతుంటాయి. చిత్ర విచిత్రమైన వేడుకలు జరుగుతుంటాయి. అలాంటిదే గుమ్మడికాయల మహోత్సవం కూడా. ఇక్కడ ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో గుమ్మడికాయల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. నాలుగు రోజులపాటు ఈ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల కోసం అమెరికా ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఈ వేడుకను తిలకిస్తారు. ఈ పోటీలలో విజయం సాధించిన గుమ్మడికాయ కు మిస్ పంప్ కిన్ పురస్కారం అందిస్తారు. అతి బరువైన గుమ్మడికాయకు ప్రత్యేక బహుమతి ఇస్తారు. అయితే ఆ టీచర్ పండించిన గుమ్మడికాయను కొనుగోలు చేయడానికి అమెరికా ప్రజలు ఆసక్తి చూపించారు. కొందరైతే ఎంత మొత్తమైనా ఇచ్చి కొనుగోలు చేస్తామని అన్నారు. అయితే ఆ గుమ్మడికాయను విక్రయించడానికి అతడు ఒప్పుకోలేదు. పైగా ఆ గుమ్మడికాయను ముక్కలుగా కోసి.. తమ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉచితంగా ఇస్తానని ఆ టీచర్ పేర్కొన్నాడు. దీంతో అతడి ఉదార స్వభావాన్ని చూసి చాలామంది మెచ్చుకున్నారు..” అతడు గొప్ప టీచర్. ఎంత డబ్బు ఇస్తానన్నప్పటికీ గుమ్మడికాయను విక్రయించడానికి ఒప్పుకోలేదని” పేరు రాయడానికి ఇష్టపడని ఓ అమెరికన్ వ్యక్తి వ్యాఖ్యానించాడు.
Join us in Downtown Half Moon Bay for the 51st annual Safeway World Championship Pumpkin Weigh-Off. Growers from across the country will try to top the World Record (set last year in Half Moon Bay) and lay claim to the $30,000 mega-prize! It’s happening on Monday, October 14th… pic.twitter.com/tLlgkIc8Ia
— Visit Half Moon Bay (@VisitHMB) September 30, 2024