https://oktelugu.com/

Heroine Adasharma  : దివంగత హీరో సుశాంత్ ఇంటి రూపురేఖలు మార్చేసిన హీరోయిన్ ఆదా శర్మ..ఆయన ఉరి వేసుకున్న రూమ్ ని ఏమి చేసిందంటే!

ప్రముఖ యంగ్ హీరోయిన్ ఆదా శర్మ కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఆమె తన తల్లితో కలిసి ఆ ఫ్లాట్ లోకి గృహ ప్రవేశం చేసింది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ప్రతీ అంశంపై నెగటివ్ కామెంట్స్ చేసే నెటిజెన్స్ ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. అలా ఆదా శర్మ ఈ ఇంటిని కొనుగోలు చేయడం పై కూడా పలు నెగటివ్ కామెంట్స్ వినిపించాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 15, 2024 / 02:27 PM IST

    Adasharma-Sushanth

    Follow us on

    Heroine Adasharma  :  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, టీవీ సీరియల్ హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా, హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకొని ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన అప్పట్లో యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈయన మన టాలీవుడ్ ఆడియన్స్ కి ‘ఏం ఎస్ ధోని’ చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు. వరుసగా సూపర్ హిట్స్ ని కొడుతూ బాలీవుడ్ రైజింగ్ స్టార్ గా దూసుకుపోతున్న సమయంలో అనుమానాస్పద స్థితిలో ఆయన తన ఫ్లాట్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోవడం ఇప్పటికీ ఆయన అభిమానులు నమ్మలేకపొతున్నారు.

    ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ ఫ్లాట్ ని ప్రముఖ యంగ్ హీరోయిన్ ఆదా శర్మ కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఆమె తన తల్లితో కలిసి ఆ ఫ్లాట్ లోకి గృహ ప్రవేశం చేసింది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ప్రతీ అంశంపై నెగటివ్ కామెంట్స్ చేసే నెటిజెన్స్ ఉంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. అలా ఆదా శర్మ ఈ ఇంటిని కొనుగోలు చేయడం పై కూడా పలు నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. పబ్లిసిటీ కోసమే ఆదా శర్మ ఇలా చేసిందని, సమీపంలో ఇంతకంటే ఎంతో అందమైన ఫ్లాట్స్ తక్కువ ధరకే దొరుకుతున్నప్పటికీ ఆమె ఫ్లాట్ కొనిందంటే కచ్చితంగా వార్తల్లో నిలవడం కోసమే అని కామెంట్స్ చేసారు.

    రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆదా శర్మ ఈ కామెంట్స్ పై స్పందించింది ‘సోషల్ మీడియా లో నలుగురు నాలుగు రకాలు గా అనుకుంటారు. వాళ్ళ ఇష్టం ఎలా అయినా అనుకోనివ్వండి. నాకు ఆ ఇల్లు చూడగానే నచ్చింది, కొనాలి అనిపించింది, కొనేసాను. ఇప్పుడు మా అమ్మతో కలిసి ఆ ఇంట్లోనే ఉంటున్నాను. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఇల్లుని నా అభిరుచికి తగ్గట్టుగా మార్చుకున్నాను. మొదటి ఫ్లోర్ ని గుడిగా తీర్చి దిద్దాను. అలాగే ఒక రూమ్ ని డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం, మరో రూమ్ ని మ్యూజిక్ కోసం స్టూడియో గా మార్చేసాను’ అని చెప్పుకొచ్చింది ఆదా శర్మ. అయితే ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం తయారు చేసుకున్న రూమ్ లోనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉరి వేసుకొని అప్పట్లో చనిపోయినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఆదా శర్మ తెలుగు లో హార్ట్ అటాక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమెకి టాలీవుడ్ లో ఎందుకో సెకండ్ హీరోయిన్స్ రోల్స్ మాత్రమే వచ్చాయి, కానీ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఈమెకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది, ఈ హీరోయిన్ గా నటించిన ‘ది కేరళ స్టోరీ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.