Homeవింతలు-విశేషాలుHeteropaternal Superfecundation Case: ఆమెకు కవలలు పుట్టారు.. కానీ డిఎన్ఏ టెస్టులు తేడా వచ్చాయి.. ఆరా...

Heteropaternal Superfecundation Case: ఆమెకు కవలలు పుట్టారు.. కానీ డిఎన్ఏ టెస్టులు తేడా వచ్చాయి.. ఆరా తీస్తే.. అసలు విషయం ఇదీ

Heteropaternal Superfecundation Case: సంసారం అన్నాక భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి. అంతర్గత బంధం నుంచి మొదలు పెడితే బహిర్గత బంధం వరకు అవి బలంగా సాగుతూ ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం కచ్చితంగా ఉండాలి. ఒకరి నమ్మకాన్ని మరొకరు వమ్ము చేయకూడదు. ముఖ్యంగా పతి పత్ని ఔర్ వో అనే దారుణానికి ఎట్టి పరిస్థితుల్లో పాల్పడకూడదు. ఎందుకంటే మోసం అనేది ఒక్కసారి ఇద్దరి మధ్య ప్రవేశిస్తే ఆ తర్వాత ఎంతటి దారుణానికైనా దారితీస్తుంది. ఇటువంటి సంఘటన కొలంబియాలో జరిగింది. అది కాస్త ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

2018లో కొలంబియా ప్రాంతంలో ఓ మహిళకు కవలలు పుట్టారు. పిల్లలు అద్భుతంగా ఉన్నారు. ఇద్దరు కూడా మూడు కిలోలకు పైచిలుకు బరువుతో పుట్టారు. సాధారణంగా కవలలు ఒకే విధంగా ఉంటారు. రంగు నుంచి మొదలు పెడితే రూపం వరకు అచ్చు గుద్దినట్టు ఉంటారు. కానీ ఆ ఇద్దరు పిల్లల్లో కొన్ని తేడాలు కనిపించాయి. తల్లికి ఏమాత్రం అనుమానం కలగకపోయినప్పటికీ.. తండ్రికి మాత్రం అనుమానం వచ్చింది. దీంతో అతడు ఈ విషయాన్ని ముందుగా కుటుంబ సభ్యులతో చెప్పాడు. వారు అతడిని పట్టించుకోలేదు. దీంతో స్నేహితులతో చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే వారు కూడా లోతుగా పరిశీలించారు. ఏదో తేడాగా ఉందని అనుకున్నారు. ఆ తర్వాత వైద్యులను సంప్రదించారు. దీంతో వారు డిఎన్ఏ పరీక్షలు చేశారు.

వైద్యులు చేసిన డిఎన్ఏ పరీక్షలలో ఆ ఇద్దరు పిల్లల ది వేరువేరని తేలింది. తల్లి ఒకరేనని.. తండ్రులు మాత్రం వేరని తేలింది.. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని హేటిలో పెటర్నల్ సూపర్ ఫెంక్యుడేషన్ అని అంటారు.. ” ఒక మహిళ తక్కువ వ్యవధిలో ఇద్దరితో శృంగారం లో పాల్గొనడం వల్ల ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అదే సమయంలో ఆమెకు ఒకటికంటే ఎక్కువ అండాలు విడుదలవుతుంటాయి. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇటువంటివి 20 కేసులు నమోదయ్యాయని” వైద్యులు చెబుతున్నారు.

ఈ ఫలితం తర్వాత ఆ భర్త తన భార్యను నిలదీశాడు.. ఏం జరిగిందని ప్రశ్నించాడు.. దానికి ఆమె సమాధానం చెప్పలేకపోయింది. తలవంచుకుంది. కన్నీళ్లు పెట్టుకుంది. క్షమించమని వేడుకుంది. అయినప్పటికీ అతడు కరిగిపోలేదు. ఆమెను మన్నించలేదు.. అయితే ఇప్పటికీ వారిద్దరూ దూరంగానే ఉంటున్నారు. విడాకులు అయితే తీసుకోలేదు. కాకపోతే ఆ పిల్లలు ఆ తల్లి సంరక్షణలో ఉన్నారు.. 2018లో జరిగినప్పటికీ.. ఇటీవల ఓ సదస్సులో ఓ వైద్యుడు ఈ విషయాన్ని బయట పెట్టడంతో వెలుగులోకి వచ్చింది. అది కాస్త సంచలనంగా మారింది. అనైతికమైన సంబంధాలు కొనసాగించే వారికి ఈ సంఘటన గుణపాఠం లాగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular