Truth About Mortality: ఆగు ఒక నిమిషం ఆగు.. దేనికి దేనికి పరుగెడుతున్నవ్, ఎందుకు ఇంత ఆరాటపడుతున్నవ్. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అయినా అర్థం అవుతుందా? అసలు లైఫ్ అంటే ఏంటో, ఈ ప్రయాణం ఎందుకో? ఎలాంటిదో తెలుసుకున్నావా? ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? తెలియకపోతే ఒకసారి ఇది చదవండి. మీకే అర్థం అవుతుంది ప్రస్తుత పరిస్థితి ఏంటో?
చనిపోయిన చాలా సేపటి వరకు బంధువులు, అయినవారు, కాని వారు ఏడుస్తుంటారు. ఈ ఏడుపులు అంత్యక్రియల వరకు ఉంటాయి. ఆ తర్వాత కాస్త రక్తసంబంధీకులు, చాలా దగ్గరి వారు ఏడుస్తారు. కాలం మారుతున్న కొద్ది వాళ్లు కూడా నిన్ను మర్చిపోతారు. అంత్యక్రియల తర్వాత అందరూ మీ గురించి మాట్లాడటం మానేస్తారు. భోజనాల హడావిడిలో పడిపోతారు. చిన్నపిల్లలు అయితే ఆడుకోవడం, కాస్త పెద్ద వారు అయితే వారి స్నేహితులతో మాటలు, చాటింగ్ లో పడిపోతారు. కొందరు టీ కోసం భయటకు వెళ్తారు. కొందరు ఎప్పుడు వెళ్లాలి అనేవి చర్చించుకుంటారు.
కొందరు భోజనాలలో ఉప్పు, కారం ఏమైనా ఎక్కువ అయ్యాయా? వాల్లు రాలేదు? వీళ్లు రాలేదు? అంటూ చర్చిస్తారు. ఆ చర్చలో నువ్వు ఉండవు. కొందరేమో మీరు చేసిన ఖర్చు నచ్చక మొహం మాడ్చుకుంటారు కానీ చెప్పరు. మీ ఆఫీస్ వాళ్లు మీ మరణ వార్త తెలియక ఎక్కడ అని మెసేజ్ చేస్తారు. మీ ప్లేస్ లో వేరే వాళ్లను పనిలో పెట్టుకుంటారు. మీరు చేసే పని ఇతరులు చేస్తుంటారు. మీ ఫేస్ బుక్ ఫ్రెండ్స్ మీ చివరి పోస్ట్ ను చివరి సారిగా చూస్తారు. ఇక మీ పిల్లలు వారి హాలీడేస్ తర్వాత నెక్ట్స్ ఏంటి అనే ప్లాన్ లో ఉంటారు.
Also Read: ఇదేం కేసురా నాయనా.. కోడిని కొట్టాడు.. శిక్ష పడాల్సిందే.. పోలీసులకు ఫిర్యాదు
మీ జీవిత భాగస్వామి తన మిగిలిన జీవితం ఎలా గడపాలి అంటూ ఆలోచనలో ఉంటుంది. పండగలు, సినిమాలు, క్రికెట్ మ్యాచ్ లు, పార్టీలు అన్ని కూడా జరుగుతూనే ఉంటాయి. అవుతూనే ఉంటాయి. పువ్వులు వికసిస్తూ ఉంటాయి. వాడిపోతూ ఉంటాయి. కాలం మారుతూ ఉంటుంది. ఈ ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతుంది. చాలా వేగంగా మిమ్మల్ని మర్చిపోతుంది. ఎక్కడో మీ ఫోటో కనిపిస్తే అప్పుడు గుర్తు వస్తావు నువ్వు. చాలా దగ్గరి వాళ్లు మాత్రమే చాలా ఆలస్యంగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. చివరకు మీ పేరును కూడా ఎవరు గుర్తు పెట్టుకోని రోజు కూడా ఒకటి వస్తుంది. కాలంతో నువ్వు కరిగిపోతావు.
ఎంత మంది కోసం మీ జీవితం త్యాగం చేశారో? ఎవరి కోసం మీరు నిద్ర లేని రాత్రులను గడిపారో? ఎంత మంది కోసం మీ బతుకును మీరు బతకలేదో? అదంతా కూడా వారు మర్చిపోతారు. జస్ట్ వారికి తాత్కాలికమే. ఇంతకీ మీరు ఎవరి కోసం పరుగెడుతున్నారు? ఎందుకు పరుగెడుతున్నారు? మీ జీవితం మీరు జీవిస్తున్నారా లేదా? అందుకే ఇవన్నీ పక్కన పెట్టి మీ లైఫ్ ను మీరు హ్యాపీగా లీడ్ చేస్తూ మీ వాల్లకు, మీతో ఉండే వాళ్లకు మీ వల్ల ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటూ సంతోషంగా బతకండీ. సంతోషంగా మీతో ఉన్నవారిని బతికేలా చేయండి చాలు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.