Bushi Dam In lonavala: మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం లోనావాలాలోని బుషీ డ్యామ్ వద్ద జరిగిన ఓ దారుణ ఘటన ఇంటర్నెట్‌ను కుదిపేసింది. ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు వచ్చిన సందర్శకుల మధ్య ఓ వ్యక్తి అసహ్య ప్రవర్తన తీవ్ర ఆగ్రహానికి గురైంది.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
ఇంటర్నెట్‌లో ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలో, ఓ వ్యక్తి డ్యామ్ నీటిలో ఆనందంగా ఈతకొడుతూ కనిపిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఫ్రేమ్‌లోకి మరొకరు వస్తారు. ఆశ్చర్యకరంగా ఆయన అదే నీటిలో మూత్ర విసర్జన చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి తక్షణమే ఈతకొడుతున్నవారిని హెచ్చరిస్తూ బయటకు రమ్మని కోరుతాడు.
ఈ వీడియోను ఒక వినియోగదారు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ “సున్నా సివిక్ సెన్స్! ఒక వ్యక్తి స్నానం చేస్తుంటే మరొకరు ఆ నీటిలో మూత్రం చేస్తున్నారు. అందుకే నేను ఈ మధ్యకాలంలో పూల్స్, స్ట్రీమ్స్‌కి వెళ్లడం మానేశాను” అంటూ షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే 6 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి నీచమైన ప్రవర్తన ఏకంగా శుభ్రతను మసకబారుస్తుందని, ఇతరుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పర్యాటక ప్రదేశాల్లో శుభ్రత – ఎవరి బాధ్యత?
ఇలాంటి ఘటనలు చూస్తే, పర్యాటక ప్రదేశాల్లో శుభ్రత కేవలం అధికారుల బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ ఇతరుల ఆరోగ్యాన్ని హానికరంగా మార్చే పనులు చేసే హక్కు ఎవరికీ లేదు.
ప్రకృతి అందాలు ఆనందించడానికి వెళ్లే ప్రదేశాలు మనం స్వచ్ఛంగా ఉంచుకోవడం, ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం మన పౌర బాధ్యత. బుషీ డ్యామ్ ఘటన మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Zero civ!c sense!
One guy is enjoying the bath while the other one is p!ssing in the stream.
This is the reason why I’ve stopped going in pools & such streams pic.twitter.com/p8uVwSsnvK
— Tarun Gautam (@TARUNspeakss) August 6, 2025