Mahesh Babu Favorite Heroine: ‘రాజకుమారుడు’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు (Mahesh Babu)… సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన ఎప్పుడైతే ఈ సినిమా చేశాడో అప్పటి నుంచి ప్రిన్స్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…ఇక ఇలాంటి మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా వరకు ఆయన కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పాన్ ఇండియాను దాటి తాను వరల్డ్ లోకి కూడా అడుగుపెడుతుండటం విశేషం… ఒకరకంగా రాజమౌళి వల్లే ఇది సాధ్యమైందని చెప్పాలి. అయినప్పటికి మహేష్ బాబు అభిమానులు సైతం రాజమౌళిని పొగుడుతూ పండగలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన రాజమౌళి దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ని కూడా ప్రేక్షకులకు తెలియజేయడం లేదు.
Also Read: ‘మయసభ’ ఫుల్ సిరీస్ రివ్యూ…
కారణం ఏంటి అంటే ఆయన ఒకేసారి మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా థ్రిల్ కి గురిచేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఎలాంటి అప్డేట్ ను ఇవ్వకుండా దాచి పెడుతున్నాడు. అందించడానికి రాజమౌళి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.
మరి తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు పాన్ వరల్డ్ లో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అతనికి బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న అతని అభిమానుల్లో కలుగుతూ ఉంటుంది.
Also Read: రజినీకాంత్ vs నాగార్జున… కూలీ మూవీ లో ఎవరి డామినేషన్ ఉండబోతుంది..?
నిజానికి మహేష్ బాబుతో నటించిన హీరోయిన్స్ అందరు తనకి చాలా ఇష్టమని ఒక సందర్భంలో తెలియజేశారు. కానీ ఒకానొక టైమ్ లో ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అతనికి కాజల్, సమంత అంటే ఇష్టమని వాళ్ళతో నటించడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ ఇద్దరు హీరోయిన్లతో రెండు మూడు సినిమాలు చేయడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఇండియాలో చాలా మంచి క్రేజ్ అయితే ఉంది…