Tommy Fleetwood: వానకాలం రాగానే ఈగలు ఉద్యోగం ఇస్తాయి. ఈగలు ఆహార పదార్థాలపై వాడడం వల్ల అనేక అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. అయితే ఈగ పై ప్రతీకారం తీర్చుకోవాలంటే సాధ్యం కాదు. అదే విషయాన్ని సినీ దర్శకుడు రాజమౌళి ‘ ఈగ ‘ అనే సినిమా ద్వారా వివరించాడు. అయితే ఈ ఈగ వల్ల ఒక ఆటగాడికి రూ. 16 కోట్లు తెప్పించింది. ఇంతకీ ఆ ఆటగాడికి ఈగ చేసిన సహాయం ఏంటి? ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం..
గోల్ఫ్ కీపర్ ఆట గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అమెరికాలో దీనిని ఎక్కువగా ఆడుతారు. అయితే ఒక్కోసారి దీనిని టోర్నమెంట్ కూడా నిర్వహిస్తారు.Tommy Fleetwood అనే ఆటగాడు ఇటీవల జరిగిన గోల్ఫ్ టోర్నమెంట్లో బంతిని విసిరాడు. అయితే ఆ బంతి హోల్ లో పడకుండా దాని దగ్గరికి వెళ్లి ఆగిపోయింది. అయితే ఇదే సమయంలో ఒక ఈగ ఆ బాలు పై వాలి ముందుకు జరిపింది. దీంతో ఆ బాలు అందులో పడింది. ఆ బాలు అందులో పడడంతో టామీ ప్లేట్ ఫుడ్ ఈ టోర్నమెంట్లో 7 వ స్థానం నుంచి 5 వ స్థానం వరకు వచ్చాడు. దీంతో అతడు ఏడు లక్షల డాలర్లను గెలుచుకున్నాడు. అంతేకాకుండా FedEx Cup ర్యాంకింగ్ వల్ల 1.5 మిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. ఇలా మొత్తం 2.2 మిలియన్లను సొంతం చేసుకున్నాడు. అంటే దాదాపు రూ. 16 కోట్లు అన్నమాట.
అతడు గెలవడానికి ఎంతో పట్టుదల.. ఆరాటం ఉన్నా.. చివరికి ఒక ఈగ సహాయం వల్ల గెలుపొందాడు. అంటే మనుషుల్లో కూడా ఎంతో పట్టుదల ఉన్నా.. కాసింత అదృష్టం కూడా ఉండాలని చెబుతారు. అయితే ఈ అదృష్టం రావాలంటే ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏ అవకాశం లో ఎలాంటి అదృష్టం ఉంటుందో చెప్పలేం. జీవిత లక్ష్యాన్ని చేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరు చేత ఎక్కించుకోవాల్సిన అవకాశాలను జారవిడుచుకుంటారు. ఇలా విడిచిపెట్టి ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు.
ఉద్యోగులైనా.. వ్యాపారులైనా.. గమ్యాన్ని చేరడానికి ఎన్నో అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి. ఇవి ఒక్కోసారి నచ్చకపోవచ్చు. మరికొన్ని అనుకూలంగా ఉండకపోవచ్చు. అయినా సరే వాటిని వినియోగించుకొని అందులోని వాస్తవాన్ని గ్రహించుకోవాలి. అలా ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్న వారే.. చివరికి విజేతలుగా మారుతారు. ఈ ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయినా సరే వాటిని తట్టుకొని నిలబడాలి. ఎవరికీ జీవితం పూల పాన్పు కాదు.. కానీ గమ్యం చేరడానికి కష్టపడక తప్పదు.