Homeవింతలు-విశేషాలుTiger vs Crocodile: నీటి ఒడ్డున మొసలి.. అదే సమయంలో పులి అక్కడికి వచ్చింది.. ఆ...

Tiger vs Crocodile: నీటి ఒడ్డున మొసలి.. అదే సమయంలో పులి అక్కడికి వచ్చింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Tiger vs Crocodile: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు అద్భుతంగా ఉంటాయి.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇంకొన్ని వీడియోలు భయంతో పాటు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. అలాంటి వీడియోనే ఇది కూడా.

Also Read: Inspirational story : జీవితాన్ని మార్చేసే గాడిద కథ. చదివిన తర్వాత కచ్చితంగా మారుతారు

సోషల్ మీడియాలో లక్షలలో వ్యూస్ సొంతం చేసుకుంది ఈ వీడియో.. సోషల్ మీడియాలో ప్రత్యేక కనిపిస్తున్న ఆ వీడియోలో ఒక బలమైన మొసలి.. అదే స్థాయిలో ఉన్న పులి కనిపించాయి. ఆ ప్రాంతం ఎక్కడో తెలియదు కానీ.. నిండైన ప్రవాహంతో ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున ఒక మొసలి ఉంది. బహుశా కాసేపు సేద తీరడానికి ఒడ్డుకు వచ్చిందనుకుంటా. ఈలోగా నీటిని తాగడానికి ఒక పులి అటువైపు వచ్చింది. పులిని చూసిన మొసలి ముందుగా నీటిలోకి కొంతమేర జారుకుంది. పులి రాగానే ఒక్క ఉదుటున దానిని పట్టేసుకుంది. నీటిలోకి పులిని లాక్కుపోవడానికి ప్రయత్నించింది. అందులో విజయవంతమైనది కూడా. కానీ పులి ఏమాత్రం భయపడకుండా.. మొసలికి అవకాశం ఇవ్వకుండా తన పంటి బిగువన పట్టేసుకుంది. తన బలం మొత్తాన్ని ఉపయోగించి మొసలిని అమాంతం బయటకు లాక్కు వచ్చింది.

వాస్తవానికి నీటిలో ఉన్నప్పుడు బలమైన ఏనుగు నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద చేపల వరకు మొసళ్ళు అమాంతం దాడి చేస్తాయి.. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నీటిలోకి లాక్కెళ్ళి తినేస్తాయి. కానీ పులి మాత్రం ఆ మొసలికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. పైగా రెట్టించిన స్థాయిలో దాడి చేసింది. మొసలి ఊహించని స్థాయిలో రెచ్చిపోయింది. పదునైన దంతాలతో దాడి చేసి బయటకి లాక్కుపోయింది. ఆ తర్వాత తన తన కాళ్ల బలంతో మొసలిని అదిమి పట్టుకుంది. ఆ తర్వాత చీల్చి చీల్చి తినింది. వాస్తవానికి నీటిలో ఉన్నప్పుడు పులి కంటే మొసలికే బలం అధికంగా ఉంటుంది. కానీ పులి బలం ముందు దాని బలం తేలిపోయింది. దీనికి కూడా కొరకాకుండా అయిపోయింది.. పైగాపులి ఈడ్చుకొని వస్తుంటే మొసలి కూడా ఏం చేయలేకపోయింది.. అలానే చూస్తూ ఉండిపోయింది.. చివరికి పులికి ఆహారంగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. ఇప్పటికే లక్షలలో వ్యూస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతున్నది.

Also Read: Baby Elephant Latest Viral Video: మావటి పడుకుంటే.. పిల్ల ఏనుగు వచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందంటే.. చూడాల్సిన వీడియో!

” బలం అనేది ఆకారాన్ని బట్టి రాదు. ఉన్న స్థానాన్ని బట్టి రాదు. మన ఒంట్లో తెగువ ఉంటే కచ్చితంగా ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎటువంటి ఆపద ఎదురైనా సరే దానిని తట్టుకునే శక్తి అది ఇస్తుంది. ఈ వీడియో ద్వారా సమాజానికి తెలియాల్సింది అదే. ఎంతటి కష్ట కాలంలోనైనా ఆత్మ స్థైర్యాన్ని వదిలిపెట్టకూడదు. గుండె ధైర్యాన్ని పక్కన పెట్టకూడదు. నమ్మకాన్ని కోల్పోకూడదు. పటుత్వాన్ని వదిలిపెట్టకూడదని ” ఈసందర్భంగా సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version