Venkatesh Trivikram New Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన వెంకటేష్ (Venkatesh) తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఆయన సినిమాలో హీరోయిన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అందువల్లే వాళ్లతోనే కామెడీ చేయిస్తూ వాళ్ళతో సినిమా మొత్తాన్ని నడిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు…
Also Read: ‘డ్యాన్స్ వేద్దాం పదా’ అంటూ అల్లు అర్జున్ తో బాలయ్య సరదా సంభాషణ!
ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే భారీ ఎత్తున ఈ సినిమాని చేసి మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఈ ముగ్గురు హీరోయిన్లు ఎవరు అనేదానిమీద ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మెయిన్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి (Meeenakshi Choudary) చేయబోతుండగా మిగిలిన ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనేదానిమీదనే సస్పెన్స్ అయితే వీడటం లేదు.
మరి తొందరలోనే త్రివిక్రమ్ ఈ సస్పెన్స్ కి తెర దించబోతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి త్రివిక్రమ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి పాన్ ఇండియాలో చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాతో పెను రికార్డులను క్రియేట్ చేస్తాడా లేదా అనేది…ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన త్రివిక్రమ్ పాన్ ఇండియా మార్కెట్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు…