Dried basil plant: తులసి మొక్క ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఉండాల్సిన మొక్క కూడా. ఈ మొక్కను సంప్రదాయమైన మొక్కగా భావిస్తుంటారు. తులసిలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ఆయుర్వేద పరంగా కూడా తులసిని ఉపయోగిస్తారు. తులసి మొక్క నుంచి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. తులసిని ఎలా తీసుకున్నా కూడా శరీరానికి పోషకాలు అందుతాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒక్కోసారి ఇంట్లో ఒక్కోవైపు తులిసి మొక్క ఎండిపోవడం కామన్ గా చూస్తుంటాం. అయితే ఇలా జరగడంతో చాలా మంది వీటిని తీసి పారేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఎండిపోయిన తులసి మొక్కను కూడా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగించవ్చు. ఇంతకీ ఎలా అంటారా? అయితే ఈ ఆర్టికల్ చదివేసేయండి.
తులసి ఆకులు:
ఎండిపోయిన తులసి ఆకుల్ని పడేయకుండా వాటిని చాలా రకాలుగా వినియోగించవచ్చు. ఎండిన తులసి ఆకుల్ని శుభ్రంగా కడిగాలి. ఎండలో ఎండే దాకా మళ్లీ ఆరబెట్టాలి. లేదంటే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఆరిన తర్వాత వీటిని మిక్సీలో వేసి పౌడర్‌లా చేయాలి. ఈ పొడితో హెర్బల్ టీలు తయారు చేసుకోని తీసుకోవచ్చు. మరుగుతున్న నీటిలో ఈ పొడి వేసి మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. తేనె కూడా మిక్స్ చేసి సేవించవచ్చు. ఈ టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎటాక్ కావు.
ఎరువుగా:
తులసి మొక్క ఎండిపోతే పారేయకండి. ఈ ఎండిన మొక్కను ఇతర వాటికి ఎరువుగా ఉపయోగించవచ్చు. తులసి ఆకుల్ని వేరు చేసి చేతులతో బాగా నలిపి ఈ పొడిని మీ ఇంట్లో పెంచుకునే మొక్కల మొదట్లో వేయాలి. ఇలా వేయడం వల్ల భూమికి సారం అంది.. మొక్కలు బాగా గ్రోత్ అవుతుంటాయి.
కొత్త మొక్క:
ఎండిన తులసి మొక్కల్లో విత్తనాలు వస్తాయి. వీటిని సేకరించి కొత్త మొక్క తయారు చేసుకోవచ్చు. ఎండిన మొక్క నుంచి తులసి విత్తనాలను వేరు చేయాలి. వాటిని తీసుకొని అదే కుండీలో, లేదా ఇతర కుండీలో చల్లండి. నీరు పోస్తూ ఉంటే కొత్త తులసి మొక్కలు వస్తాయి. అదే విధంగా తులసి మొక్క కాండాలను పారేయవద్దు. వీటిని ఎండలో చక్కగా ఆరబెట్టండి. అవి బాగా ఎండిన తర్వాత వాటిని ఓ కవర్‌లో పెట్టి.. హోమాలు, పూజలకు వినియోగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
ఆకులతో ప్రయోజనాలు: తులసి ఆకుల కషాయంతో దగ్గు, జలుబు పోతాయి. ఎందుకంటే తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను నయం చేస్తాయి. శ్వాస నాలాల్లో పేరుకుపోయి శ్లేష్మాన్ని వదిలించి, శ్వాస ప్రక్రియను సులభతరం చేయడానికి ఉపయోగపడుతుంది తులసి కషాయం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.