https://oktelugu.com/

Game Changer Song : త్వరలో విడుదలయ్యే పాట కోసం 20 కోట్లు..’గేమ్ చేంజర్’ లో మొత్తం 6 పాటలకు శంకర్ ఎంత ఖర్చు చేయించాడో తెలుసా?

ఇప్పటికే 'గేమ్ చేంజర్' చిత్రం నుండి రెండు పాటలు విడుదల అయ్యాయి. ఈ రెండు పాటలకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెలాఖరున టీజర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ నెలలో ఈ సినిమాలోని మెలోడీ పాటను విడుదల చేయబోతున్నారు. ఈ పాట సినిమాకి పెద్ద హైలైట్ గా నిలవబోతుంది అట. కేవలం ఈ ఒక్క పాట కోసం డైరెక్టర్ శంకర్ 20 కోట్ల రూపాయిలను నిర్మాత దిల్ రాజు చేత ఖర్చు చేయించాడట.

Written By:
  • Vicky
  • , Updated On : October 18, 2024 / 04:34 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer Song :  ఈ ఏడాది కల్కి, దేవర వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాన్ ఇండియన్ సినిమాలలో ప్రస్తుతం రెండు మూడు సరైన సన్నివేశాలు ఉంటే కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆకాశమే హద్దు అనే స్థాయిలో ఉంటాయని ఈ రెండు సినిమాలు రుజువు చేసాయి. ఇప్పుడు అందరి చూపు ‘పుష్ప 2’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేంత స్టామినా ఉంది. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈ రెండు సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతుండగా, గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10వ తారీఖున విడుదల కాబోతుంది.

    ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ చిత్రం నుండి రెండు పాటలు విడుదల అయ్యాయి. ఈ రెండు పాటలకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెలాఖరున టీజర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ నెలలో ఈ సినిమాలోని మెలోడీ పాటను విడుదల చేయబోతున్నారు. ఈ పాట సినిమాకి పెద్ద హైలైట్ గా నిలవబోతుంది అట. కేవలం ఈ ఒక్క పాట కోసం డైరెక్టర్ శంకర్ 20 కోట్ల రూపాయిలను నిర్మాత దిల్ రాజు చేత ఖర్చు చేయించాడట. వింటేజ్ శంకర్ మార్క్ కనిపించేలా ఆ పాట ఉండబోతున్నట్టు తెలుస్తుంది. శంకర్ పాత సినిమాల్లోని పాటలు ఎంత రిచ్ గా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలం లో ఆ మార్క్ మిస్ అయ్యింది. రోబో 2.0 లో ప్లాన్ చేసాడు కానీ, అంత గొప్పగా అనిపించలేదు. అయితే గేమ్ చేంజర్ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్స్ లో సెట్టింగ్స్ ఎంత రిచ్ గా ఉన్నాయో మనమంతా చూసాము. సౌండింగ్ కూడా శంకర్ మార్క్ కనిపించింది.

    ఇప్పుడు మూడవ పాట అంతకు మించిన రిచ్ గా, క్వాలిటీ తో ఉంటుందని, ఆడియన్స్ కి థియేటర్స్ లో ఈ పాట ఒక విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుందని అంటున్నారు. త్వరలోనే ఈ పాట విడుదల తేదీని ప్రకటించబోతున్నారు మేకర్స్. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం లోని మొత్తం ఆరు పాటలకు గానూ నిర్మాత దిల్ రాజు 100 కోట్ల రూపాయిలు ఖర్చు చేయించినట్టు తెలుస్తుంది. ఒక సినిమాకి పెట్టాల్సిన బడ్జెట్ ని శంకర్ కేవలం పాటల చిత్రీకరణ కోసం ఖర్చు పెట్టించాడు. ఇక సినిమా మొత్తం పూర్తి చేయడానికి ఏ రేంజ్ బడ్జెట్ పెట్టించి ఉంటాడో ఊహించుకోవచ్చు. ‘ఇండియన్ 2’ తో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్న శంకర్, ‘గేమ్ చేంజర్’ చిత్రంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.