Homeవింతలు-విశేషాలుThis photo is extremely rare: ఈ ఫోటో అత్యంత అరుదైనది..కోటి లో ఒక షాట్...

This photo is extremely rare: ఈ ఫోటో అత్యంత అరుదైనది..కోటి లో ఒక షాట్ ఇలా వస్తుందట! దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

This photo is extremely rare: మనం ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు. ఎన్ని రాతలైనా రాయవచ్చు. ఒక దృశ్యం ద్వారా మాటలను, రాతలను మించి మనం చెప్పవచ్చు. అందువల్లే 100 వాక్యాలు చెప్పలేనిది.. 100 రాతలు వివరించలనేది.. ఒక్క దృశ్యం చెబుతుందని పెద్దలు అంటుంటారు.

అందువల్లే రాతలకు మించిన విలువ ఒక దృశ్యానికి ఉంటుంది. దృశ్యం అనేది సజీవ చరిత్రకు సాక్ష్యం లాంటిది. అందువల్లే దృశ్యాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఉదాహరణకు మోనాలిసా చిత్రాన్ని తీసుకుంటే.. అది ఒక దృశ్యరూపకం. అందుకే ప్రపంచంలో ఒక వింతగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడో శతాబ్దాల క్రితం రూపొందించిన ఆ దృశ్యం నేటికీ ఆకట్టుకుంటున్నది. ఇక ఒకప్పుడు దృశ్యాలను బంధించడానికి అంతగా వీలు ఉండేది కాదు. పైగా నాటి రోజుల్లో అత్యంత అధునాతనమైన కెమెరాలు అందుబాటులో ఉండేవి కావు. కొంతమంది వద్ద మాత్రమే కెమెరాలు ఉండేవి. ఆ కెమెరాలలో కూడా ఫోటోలు తీయాలంటే అనేక ప్రయాసలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ నేటి డిజిటల్ యుగంలో ఫోటో తీయడం.. దానిని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం పరిపాటిగా మారిపోయింది. పైగా స్మార్ట్ ఫోన్ లలోనే అత్యంత హై ఎండ్ టెక్నాలజీతో కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ అనితర సాధ్యమైన ఫీచర్లు ఉన్నాయి. దీంతో అత్యంత నాణ్యతతో ఫోటోలు తీయడానికి వీలవుతున్నది. ఆ ఫోటోలు కూడా మన చూపును మాయ చేసే విధంగా ఉంటున్నాయి.

Read Also: ఇప్పుడంటే ఆర్డర్ పెట్టిన వెంటనే ఫుడ్ వస్తోంది కాని .. 90 ఏళ్ల క్రితమే డెలివరీ బాయ్స్ ఉన్నారట! ఇంతకీ ఎక్కడో తెలుసా?

ఇక ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్లు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఫర్ఫెక్షన్ కోసం ఎంతగానో తాపత్ర పడుతుంటారు. ఇలా తీసిన ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతూ ఉంటాయి. ప్రపంచ వేదికలలో నిర్వహించే పోటీలలో బహుమతులను గెలుచుకుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి ఒక ఫోటో కనిపించతోంది.. 100 మాటలలో చెప్పలేనిది.. ఒక ఫోటో ద్వారా వివరించవచ్చనే తీరుగా ఈ ఫోటో కనిపిస్తోంది. శ్వేత దేశానికి చెందిన డానీ డానియా అనే ఫోటోగ్రాఫర్ ఒక అరుదైన ఫోటోను తీశాడు. వర్షం కురుస్తుండగా.. ఆకాశంలో దట్టమైన మేఘాలు ఏర్పడగా.. పిడుగుపాటు నమోదయింది. అంతేకాదు ఆ పిడుగు ఒక చెట్టును తాగుతున్న లక్షణాన్ని ఆమె తన కెమెరాలో అత్యంత స్పష్టంగా స్పందించారు. ఇక దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇటువంటి దృశ్యాలు కెమెరాకు అరుదుగా చిక్కుతాయి. పిడుగుపాటు నమోదైన సమయంలో అధికంగా ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. సమీప ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా విపరీతమైన ఉష్ణం వల్ల దగ్గరికి వెళ్లడానికి వీలుకాదు. అలాంటి విపత్కర పరిస్థితి ఉన్నప్పటికీ కూడా డానియా ఆ ఫోటో తీయడం విశేషం..”ఇది అద్భుతం. ఆశ్చర్యానికి గురి చేసే విషయం. ఇలాంటి ఫోటో తీయాలంటే ఫోటోగ్రఫీ మీద విపరీతమైన ఇష్టం ఉండాలి. అందువల్లే డానియా ఈ ఫోటో తీశారు. అది చాలా బాగుంది అనడం కంటే అత్యద్భుతంగా ఉంది అనడం సబబు. ఈ ఫోటో ద్వారా డానియా అద్భుతమైన ఖ్యాతిని సంపాదించుకున్నారని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular