Power of the internet: మనం ఏదైనా పనిచేస్తే.. దానిద్వారా ఏదైనా ఉత్పత్తిని రూపొందిస్తే.. దానిమీద మన పేరు ఉంటుంది. దానిని అమ్ముతున్నప్పుడు మన పేరే వినిపిస్తుంది. జనాలలో బలమైన ముద్ర ఏర్పడుతుంది. అలా కాకుండా మనకు సంబంధం లేకుండా.. మన ప్రమేయం ఏమాత్రం లేకుండా దానిని అమ్మితే.. అలా అమ్మిన దానిమీద మనకు భారీగా డబ్బులు వస్తే.. ఇది ఎలా సాధ్యమని మీరు అనుకునేరు.. నేటి ఇంటర్నెట్ యుగంలో ఇది నూటికి కోటి శాతం సాధ్యం.
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి జీవితంలో రకరకాల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని అత్యంత సుఖవంతం చేశాయి. అయితే ఈ పరిణామం ఇక్కడితోనే ఆగిపోలేదు. అంతకుమించి అన్నట్టుగా సాగిపోతోంది. ఇంటర్నెట్ అనేది మరింత విస్తృతమైన తర్వాత.. కంప్యూటర్ నుంచి స్మార్ట్ ఫోన్ లోనే ఇంటర్నెట్ వాడుకునే అవకాశం వచ్చిన తర్వాత మంచి జీవితం లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అందువల్లే అడుగు బయట పెట్టకుండానే అన్ని జరిగిపోతున్నాయి. అంతేకాదు అంతకుమించి అన్నట్టుగా సౌలభ్యాలు ముందుకు వస్తున్నాయి.
ఇంటర్నెట్ అనేది విస్తృతమైన తర్వాత అనేక రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అంతకుమించి మనిషి జీవితాన్ని మరింత సుఖవంతం చేయడానికి అనేక సంస్థలు అప్లికేషన్లను తెరపైకి వచ్చాయి. అవన్నీ కూడా లక్షల కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాయి. అదే స్థాయిలో ఉపాధి కల్పిస్తున్నాయి. పాడే పాట నుంచి మొదలు పెడితే నివాసం ఉండే ఇల్లు వరకు అన్ని కూడా ఈ సంస్థలు సమకూర్చుతున్నాయి. అలాగని ఆ సంస్థల నేపథ్యం గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.
AIRBNB: ఈ సంస్థ గృహాలను విక్రయిస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పేరు పొందిన కంపెనీది. రియాల్టీ రంగంలో ఈ సంస్థ సంచలనాలు సృష్టించింది. ఈ సంస్థకు సొంత ఇల్లు లేకపోవడం విశేషం. కేవలం ఇంటర్నెట్ ఆధారంగానే ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుంది.
Flipkart: ఆన్లైన్లో గుండు పిన్ను నుంచి మొదలు పెడితే జీడిపప్పు వరకు విక్రయిస్తుంది ఈ సంస్థ. అయితే ఈ సంస్థకు తన సొంత బ్రాండ్ ఉత్పత్తి అంటూ లేదు. కేవలం వివిధ కంపెనీలు రూపొందించిన ఉత్పత్తులను ఈ సంస్థ ఆన్లైన్లో విక్రయించి.. వినియోగదారుల చెంతకు చేర్చుతుంది.
Swiggy: ఆన్లైన్లో ఈ సంస్థ ఫుడ్ డెలివరీ చేస్తుంది. పాయసం నుంచి మొదలు పెడితే బిర్యానీ వరకు అన్నిటిని వినియోగదారుల చెంతకు చేర్చుతుంది. అలాగని ఈ కంపెనీకి సొంతంగా రెస్టారెంట్లు లేవు. కనీసం చిన్న టీ స్టాల్ కూడా లేదు.
Uber: ఇంటర్నెట్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంటే చాలు.. ఉన్నచోటుకు పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. కోరిన చోటు వద్ద దించి వెళ్తుంది. అయితే ఈ సంస్థకు సొంత కారు లేదు. కనీసం డ్రైవర్ కూడా లేడు. కేవలం ఇంటర్నెట్ ఆధారంగానే వేలకోట్ల వ్యాపారం చేస్తుంది
Instagram: ఇంస్టాగ్రామ్ అనే యాప్ సృష్టిస్తున్న సంచలనం మామూలుది కాదు. ఫోటోలను పోస్ట్ చేయడం.. రీల్స్ రూపొందించడం.. వంటివి ఈ అప్లికేషన్లో ప్రధానమైనవి. అయితే ఈ యాప్ తను ఇంతవరకు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. తన గురించి ఒక రీల్ కూడా రూపొందించలేదు..
Chat GPT: ఈ అప్లికేషన్ కృత్రిమ మేధ ఆధారంగా నడుస్తుంది. ఇది ఏ ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెబుతుంది. ఏ విషయం గురించి అడిగినా సరే వెంటనే సమాచారం ఇస్తుంది. కానీ దీనికంటూ సొంత ఆలోచన ఉండదు.
Spotify: ఈ అప్లికేషన్లో లక్షల కొద్దిపాటలు ఉంటాయి. ఎంతసేపైనా వినొచ్చు. అయితే ఈ అప్లికేషన్ ఒక్క పాట కూడా సొంతంగా రూపొందించుకోలేదు.