This is the power of Nature: మనిషి అభివృద్ధి మోజులో పడి ప్రకృతిపై పెత్తనం సాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే పచ్చని చెట్లను నరికేస్తున్నాడు. ఎత్తైన గుట్టలను పిండి చేస్తున్నాడు. నది ఒంపులను మార్చేస్తున్నాడు. ఇసుకను తవ్వుతూ భూగర్భ జలాలను తొక్కిపడేస్తున్నాడు. మనిషి చర్యల ఫలితంగా రుతువుల గమనం మారిపోతోంది. వర్షాకాలంలో వర్షాలు కురవడం లేదు. మాడుపగిలే విధంగా ఎండలు మండుతున్నాయి. చలికాలంలో చలిగాలులు వీయడం లేదు. అకాలమైన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ దంచి కొడుతోంది. రాత్రిపూట విస్తారమైన గాలులతో పిడుగుపాటుతో కూడిన వర్షం కురుస్తోంది. కొంతకాలంగా ఇటువంటి విభిన్నమైన వాతావరణం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నది. ఒక అంచనా ప్రకారం అకస్మాత్తుగా సంభవించే వరదల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది వేలాదికోట్ల ఆస్తి నష్టం.. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ప్రకృతి ప్రకృపం వల్ల జరుగుతున్న నష్టం మామూలుగా ఉండడం లేదు. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. చెట్లు మొత్తం కూకటి వేళ్ళతో కూలిపోతున్నాయి. రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. నివాస ప్రాంతాలు నీటమునుగుతున్నాయి.
ప్రకృతి హెచ్చరిక ఇది
గత ఏడాది దేవభూమి వయనాడ్ ప్రాంతంలో చోటు చేసుకున్న విలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా కేరళ చరిత్రలోనే అత్యంత ప్రకృతి విపత్తు అది. వందలాది మంది చనిపోయారు. గ్రామాలకు గ్రామాలు నీట మునిగాయి. ఇప్పటికీ చాలామంది గృహాలను నిర్మించుకోలేకపోయారు.. ఇక ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల వల్ల జరుగుతున్న నష్టం ప్రతి ఏటా అంచనాలకు అందడం లేదు. ఇక కొన్ని ప్రాంతాలలో అయితే వర్షాలు కురువక తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడుతోంది. కనీసం పంటలు పండే అవకాశం కూడా లేకపోవడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ప్రకృతిలో వచ్చిన మార్పు వల్ల.. ప్రకృతికి మనిషి తలపెట్టిన ద్రోహం వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
Also Read: Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమానం అందుకే క్రాష్ అయిందా.. విచారణలో కొత్త ఆధారం
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతమైన ట్రెండింగ్లో ఉంది. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం విపరీతంగా కురిసిన వర్షాల వల్ల ఒక వాగు ప్రవాహం ఉదృతంగా ఉంది. ఆ ప్రవాహానికి భారీ భారీ వృక్షాలు కొట్టుకొస్తున్నాయి. అందులో ఒక వృక్షం కొట్టుకొచ్చి సమీపంలో ఉన్న వంతెనకు అడ్డంగా పడిపోయింది. ఆ తర్వాత రెండు ముక్కలుగా విడిపోయి రోడ్డుకు అడ్డంగా పడింది. ఇది ఎక్కడ చోటుచేసుకుందో తెలియదు.. కాకపోతే ఈ దృశ్యం ప్రకృతి ప్రకోపాన్ని కళ్ళ ముందు ఉంచుతోంది. ప్రకృతి భీకరంగా మారితే ఎలాంటి దారుణం చోటు చేసుకుంటుందో ప్రత్యక్ష ఉదాహరణ రూపంలో చూపుతోంది.
Nature power pic.twitter.com/l57tTadyBd
— Nature Beauty (@naturebeautyxx) June 15, 2025