Mumbai Beggar Assets: కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా కూడా జరుగుతుందా అనుకునేలా చేస్తుంది. అలాంటిదే ఇది కూడా. కాకపోతే ఇలా జరుగుతుందని.. ఆ వృత్తిని ఎంచుకోవడం వల్ల ఇలాంటి అద్భుతాలు చోటు చేసుకుంటాయని ఎవరూ అనుకోరు. ఇంతకీ ఏం జరిగిందంటే..
మన సమాజంలో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటారు. అందులో కొందరు ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించుకోవడానికి ఒళ్ళును కష్టపెడుతుంటారు. చెమటలు చిందించి రూపాయి, రూపాయి కూడా పెడుతుంటారు. మరికొందరేమో సులభ మార్గాలలో డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందిస్తుంటారు. అయితే ఇలాంటి వర్గాలు ఉన్న మన సమాజంలో మరో వర్గం కూడా ఉంటుంది. అవర్గం ఎదుటి వ్యక్తులను యాచించడానికి ఏమాత్రం వెనుకాడదు. పైగా యాచన ద్వారా వచ్చే డబ్బులను వేరే మార్గాలలో పెట్టుబడులు పెడుతుంది. అంతేకాదు అలా వచ్చిన డబ్బులతో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తుంది. ఇలాంటి విధానాన్ని అనుసరించిన ఓ వ్యక్తి ఏకంగా కోటీశ్వరుడు అయ్యాడు.
అతని పేరు భరత్ జైన్. ముంబైలో ఉంటాడు. కుటుంబ నేపథ్యం పెద్దగా తెలియదు. ముంబైలోని ఖరీదైన తానే ప్రాంతంలో ఇతడికి రెండు ప్లాట్లు, రెండు కమర్షియల్ సముదాయాలు ఉన్నాయి. ఇంతటి ఆస్తి ఉన్న ఇతడు శ్రీమంతుడు కాదు. నేపథ్యం బలంగా ఉన్న వ్యక్తి అంతకన్నా కాదు. అతడు యాచించుకుంటూ జీవిస్తాడు. ప్రతిరోజు అతనికి 75 వేల దాకా వస్తాయి. ఇలా వచ్చిన డబ్బును అతడు అత్యంత జాగ్రత్తగా దాచుకున్నాడు. గడచిన 40 ఏళ్ల కాలంలో అతడు ఏకంగా 7.5 కోట్లను సంపాదించాడు. ఇదంతా కూడా యాచన ద్వారానే సాధ్యమైంది. అందువల్లే అతడు తాను యాచించగా వచ్చిన డబ్బుతో ఈ స్థాయిలో ఎదిగాడు.
అంత డబ్బు ఉన్నప్పటికీ అతడు ఇప్పటికీ యాచించడాన్ని మానుకోలేదు. పైగా అతని కలెక్షన్ కూడా పెరిగిపోయింది. మొదట్లో భరత్ జైన్ కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అందువల్లే అతడు వృత్తి లోకి వచ్చాడు. ఆ తర్వాత ఇందులో నుంచి బయటికి వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. చివరికి తన వృత్తి ద్వారానే ఈ స్థాయిలో డబ్బులు సంపాదించి.. తిరుగులేని వ్యక్తిగా నిలబడ్డాడు.
వాస్తవానికి నేటి రోజుల్లో ఎంతో ఉన్నత ఉద్యోగాలు చేసినప్పటికీ డబ్బులు వెనకేయలేని పరిస్థితి. ఎందుకంటే ఖర్చులు ఆ స్థాయిలో ఉన్నాయి. కానీ జైన్ మాత్రం అలా కాదు.. ఖర్చులను పూర్తిగా తగ్గించుకున్నాడు. ప్రతి పైసాను కూడబెట్టాడు. అందువల్ల నేడు ఈ స్థాయిలో ఉన్నాడు. అన్నట్టు జైన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు బయటకు వెల్లడించలేదు. సోషల్ మీడియాలో కూడా వెల్లడి కాలేదు.