Cockroach: ఇండియా అనే కాకుండా చాలా దేశాలు కూడా పరిశుభ్రతను కోరుకుంటాయి. మన చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలని అనుకుంటాయి. తినే ఫుడ్ నుంచి చేసే పనులు అన్నింట్లో కూడా పరిశుభ్రతను పాటిస్తారు. నిజానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా, ఆఫ్రికా దేశాలు జంతువులు, పురుగులను కూడా తింటాయి. ఇండియా కోడి, మేక, చేప ఇలా వీటినే తింటాయి. పురుగులు అయినా బొద్దింక, చీమలు, కప్ప ఇలాంటి వాటిని ఎక్కువగా చైనా వాళ్లే తింటారు. మన సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం. ఏదైనా వంటకంలో పురుగు పడితే మనం ఆ పదార్థం తినకుండా పడేస్తాం. కానీ చైనా వాళ్లు అలా కాదు. వీటితో పాటు తినేస్తారు. పురుగులు, కీటకాలను తినడానికి వీరు చాలా ఇష్టపడతారు. అయితే మనలో చాలా మందికి బొద్దింక అంటే చాలా భయం. దీన్ని చూస్తే భయపడే వారితో పాటు అసహ్యించుకునే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇది కరిస్తే ఇన్ఫెక్షన్ కూడా అవుతుందని భావిస్తారు. ఇవి ఇంట్లోకి వస్తే కొందరు చంపేస్తే.. మరికొందరు బయటకు పంపేస్తారు. కానీ ఈ ప్రపంచంలో ఓ దేశం మాత్రం బొద్దింకలను (Cockroach ) పెంచుతుంది. నిజానికి వీటికి బంగారం కంటే ఎక్కువ విలువ ఇస్తుంది. అసలు ఏ దేశం బొద్దింకలను ఉత్పత్తి చేస్తుంది? దీనికి గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మనకి బొద్దింక ఎందుకు పనికి రాని పురుగు కావచ్చు. కానీ ప్రపంచ మార్కెట్‌లో బొద్దింకకి ఒక డిమాండ్ ఉంది. చైనా దేశం అయితే ఏకంగా ఓ కర్మాగారం పెట్టి వీటిని పెంచుతుంది. కేవలం చైనా అనే కాకుండా ఆఫ్రికా దేశాలు కూడా బొద్దింక సాగు చేస్తోంది. ఎందుకంటే బొద్దింకలు అన్ని కాలాల్లో కూడా జీవిస్తాయి. వీటికి దాదాపుగా 5 మిలియన్ సంవత్సరాలు జీవించే శక్తి ఉందట. అలాగే ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆఫ్రికా చైనా దేశాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల్లో ఆకలి సంక్షోభం ఉంది. దీంతో పోషకాల సమస్యతో బాధపడుతున్నారు. వీరందరికి కూడా ఈ బొద్దింకలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటి నుంచి పోషకాలు తీసుకుని ఎందరో పోషకాహార లోపంతో బాధపడకుండా చూస్తున్నారు. ఆఫ్రికాలో పందులు, చేపలు, మేకలతో ప్రొటీన్ అవసరాలు తీరుస్తున్నారు. వీటితో పాటు బొద్దింకలతో దాదాపుగా 14 శాతం వరకు ఈ సమస్యను తీర్చవచ్చట. ఆఫ్రికన్ ప్రజలు కొత్తగా అనే కాకుండా పురాతన కాలం నుంచి వీటిని తింటున్నారు. వీటిని ఔషధాలు, సౌందర్య సాధనాల కోసం కూడా ఉపయోగిస్తారట. ఈ దేశాల్లో బొద్దింకలకు మంచి డిమాండ్ ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బొద్దింకలు మంచి ధరకు పలుకుతాయట. ఉగాండా రైతులు 90 శాతం వరకు బొద్దింకలను చేపలకు ఆహారంగా ఉపయోగిస్తాయి. ఈ దేశమే కాకుండా టాంజానియా కూడా బొద్దింకలను పెంచుతుంది. ఈ దేశంలో వీరు విలువైన వస్తువులా భావిస్తారు. కిలో బొద్దింకలు కూడా భారీ ధరకు పలుకుతాయి. వీటి నుంచి నూనెను తయారు చేస్తారు. అలాగే ప్రొటీన్ ఎక్కువగా ఉండటంతో అన్ని రకాల ఔషధాలకు ఉపయోగిస్తారు. అయితే చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద బొద్దింక ఉత్పత్తి కర్మాగారం కూడా ఉంది. చైనాలోని జిచాంగ్‌లో ఉన్న ఈ కర్మగారాన్ని నుంచి ఏడాదికి దాదాపుగా 6 మిలియన్ బొద్దింకలను ఉత్పత్తి చేస్తారు. చైనా మార్కెట్‌లో బొద్దింకలను బంగారం కంటే విలువైనవిగా భావిస్తారట.