Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం గురించి సోషల్ మీడియా లో రోజుకో అప్డేట్ లీక్ అవుతూ ఉంది. ఈ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని, ఆ సీక్వెన్స్ ఈ చిత్రం లో ఒక 30 నిమిషాల వరకు ఉంటుందని, దీనికోసం దాదాపుగా రెండు నెలల పాటు షూటింగ్ చేశామని రాజమౌళి & టీం #Globetrotter ఈవెంట్ లో స్వయంగా తెలిపారు. అంతే కాకుండా ఆరోజు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో లో రామాయణం లోని ఒక షాట్ ని కూడా చూపిస్తాడు. హనుమంతుడు, వానరసైన్యం, ఆ వానరసైన్యం పైన శ్రీ రాముడు నిల్చొని, వాలి పై బాణం ఎక్కుపెట్టడం వంటి షాట్స్ ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. అయితే ఈ సినిమాలో హనుమంతుడి క్యారక్టర్ ఎవరు చేయబోతున్నారు అనే దానిపై సోషల్ మీడియా లో చాలా చర్చలే నడిచాయి.
నిన్న మొన్నటి వరకు ఈ క్యారక్టర్ ని కన్నడ హీరో సుదీప్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. రీసెంట్ గానే మూవీ టీం తమిళ స్టార్ హీరో రంగనాథన్ మాధవన్ ని సంప్రదించారట. ఆయన ఇందులో మహేష్ తండ్రి క్యారక్టర్ చేస్తున్నాడని ఇంత కాలం సోషల్ మీడియా లో రూమర్ వినిపించింది. కానీ ఆయన హనుమంతుడు క్యారక్టర్ లో కనిపించబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారట మేకర్స్. హనుమాన్ క్యారక్టర్ కి రాజమౌళి ఛాయస్ చాలా పర్ఫెక్ట్ గా ఉందని, ఆ పాత్రకు జీవం పోయాలంటే మాధవన్ వల్లే సాధ్యం అవుతుందని అంటున్నారు. త్వరలోనే హైదరాబాద్ కి రానున్న మాధవన్ కి రాజమౌళి లుక్ టెస్ట్ చేయబోతున్నాడట. చూడాలి మరి ఈ క్యారక్టర్ లో మాధవన్ ఎలా జీవించబోతున్నాడు అనేది.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రం టాకీ పార్ట్ ని వచ్చే ఏడాది మే నెలలోపు పూర్తి చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారట. షూటింగ్ చకచకా జరిగిపోతోంది, కానీ VFX వర్క్ చాలా ఉంటుంది కాబట్టి అందుకోసం కనీసం ఏడాది సమయం అయినా తీసుకోవాలని రాజమౌళి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎప్పుడూ చూడని విజువల్స్, హాలీవుడ్ మేకర్స్ కూడా కంగుతినే రేంజ్ విజువల్స్ ని రాజమౌళి ఈ చిత్రం లో చూపించబోతున్నాడట. శ్రీ రాముడిని, హనుమంతుడు ని, రాజమౌళి కాకుండా, ప్రపంచం లో ఏ డైరెక్టర్ కూడా ఇంత గొప్పగా చూపించలేరు అనే విధంగా చూపించబోతున్నాడట రాజమౌళి. మరి రాజమౌళి విశ్వరూపం చూడాలంటే 2027 వరకు ఆగాల్సిందే.