National Animals: వెనకటికి ఒక రాజ్యంతో మరొక రాజ్యం సంబంధాలు నెరిపేందుకు రాయబారులను నియమించుకునేవి. వారి ద్వారానే వర్తకం, వాణిజ్యం వంటి వ్యవహారాల్లో ముందడుగు పడేది. యుద్ధం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు.. రాయబారులే రాజ్యాలతో సంప్రదింపులు జరిపేవారు. రాజ్యాల మధ్య ఉన్న సంక్లిష్టతలను నివారించేవారు. కాలక్రమేణా రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. రాజులు గతించి పోయారు. ప్రస్తుత వర్తమాన కాలంలో రాజ్యాల స్థానంలో దేశాలు ఏర్పడ్డాయి. ఈ దేశాలకు రాయబారులుగా వివిధ రకాల జంతువులను ఏర్పాటు చేసుకున్నాయి. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికీ నిజం. ఆయాదేశాలు తమ సాంస్కృతిక, సామాజిక ఉన్నతిని ప్రతిబింబించేలా జంతువులను చిహ్నాలుగా ఏర్పరచుకున్నాయి. సహజ వారసత్వానికి ప్రతీకలుగా నిలుపుకున్నాయి. ఇంతకీ ఆ దేశాలు ఏవంటే..
భారత్, బెంగాల్ టైగర్
పశ్చిమ బెంగాల్లోని సుందర్ బన్ ప్రాంతాల పరిధిలో విస్తరించి ఉన్న అడవుల్లో రాయల్ బెంగాల్ పులులు అధికంగా ఉంటాయి. ఇవి చూడ్డానికి అందంగా, బలంగా కనిపిస్తాయి. జీవవైవిధ్యాన్ని ప్రదర్శించడంలో ఈ పులి ప్రత్యేకత వేరు. అందుకే భారత్ ఈ పులిని తన జంతు రాయబారిగా ప్రకటించుకుంది.
అమెరికా, రాయల్ డేగ
అమెరికా అధికారిక చిహ్నంలో రాయల్ డేగ కనిపిస్తుంది. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించడం, ఇతర జంతువులను వేటాడడం రాయల్ డేగ ప్రత్యేక లక్షణాలు. అమెరికా కూడా ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఉంది.. అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించింది. తన శక్తి యుక్తులను ప్రపంచ దేశాల ఎదుట ప్రదర్శించేందుకు అమెరికా ఈ రాయల్ డేగను తన అధికారిక చిహ్నంగా వాడుతోంది.
ఆస్ట్రేలియన్, కంగారు
క్షీరద జాతికి చెందిన కంగారులు ఆస్ట్రేలియా ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. ఆస్ట్రేలియాను కంగారుల భూమి అని పిలుస్తుంటారు. అందుకే ఆ దేశం కంగారులను తమ సాంస్కృతిక, సామాజిక వారసత్వ సంపదగా ప్రకటించుకుంది. ఆస్ట్రేలియాను సందర్శించే పర్యాటకులలో 25 శాతం మంది కంగారులను చూసేందుకే వెళ్తారట.
చైనా, ఇంపీరియల్ డ్రాగన్
చైనా తన అధికారిక జంతువుగా డ్రాగన్ ను ప్రకటించింది.. ఇది మన దగ్గర కనిపించే జెర్రీ ఆకారాన్ని పోలి ఉంటుంది. దీనిని చైనా తమ సాంస్కృతిక చిహ్నంగా ఎప్పుడో ప్రకటించింది.
సింగపూర్, నమ్మకమైన సింహం
సింగపూర్ తన అధికారిక జంతువుగా నమ్మకమైన సింహాన్ని ప్రకటించింది. శ్రేష్టత, బలం, శక్తి, యుక్తిని బలమైన సింహం ప్రతిబింబిస్తుందని సింగపూర్ నమ్ముతుంది. పైగా తన దేశం పేరులో సింగ అనే పదం సింహం బలాన్ని ప్రతిబింబిస్తుందని.. ఆ దేశ పాలకులు నమ్ముతుంటారు.
స్కాట్లాండ్, గాలంట్ యూనికార్న్
స్కాట్లాండ్ దేశంలో ఎగిరే గుర్రం విగ్రహాలు కనిపిస్తుంటాయి. దీనిని గాలంట్ యూనికార్న్ అని పిలుస్తుంటారు. ఇది పరాక్రమానికి ప్రతీకని స్కాట్లాండ్ భావిస్తుంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే గాలంట్ యూనికార్న్ ను స్కాట్లాండ్ తన అధికారిక జంతు చిహ్నంగా ప్రకటించింది.
నార్వే, యురేషన్ లింక్స్
తల్లి, పులి పిల్లను నార్వే దేశం తన అధికారిక జంతు చిహ్నంగా ప్రకటించింది. ఆ దేశంలోని ఉత్తర అరణ్య పరిధిలో పులులు విస్తారంగా ఉంటాయి. అక్కడి భౌగోళిక వాతావరణానికి అనుగుణంగా అవి విభిన్నమైన రంగును కలిగి ఉంటాయి. ఆ పులులు తమ దేశ జీవ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయని.. అందుకే అధికారిక జంతు చిహ్నాలుగా ప్రకటించామని నార్వే పేర్కొన్నది.
బ్రెజిల్, నోబుల్ జాగ్వర్
పులల్లో జాగ్వర్ ప్రత్యేకమైనది. అమెజాన్ అడవుల్లో ఇది జీవిస్తుంది. ప్రత్యేకమైన ఆహార్యాన్ని ప్రదర్శించే ఈ పులిని బ్రెజిల్ తన అధికారిక జంతు చిహ్నంగా జాగ్వార్ ను ప్రకటించింది.
ఇంగ్లాండ్, రీగల్ సింహం
ఇది ఇంగ్లాండ్ దేశం అధికారిక జంతు చిహ్నం. పరాక్రమానికి , తిరుగులేని బలానికి, అత్యద్భుతమైన వేటాడే తీరుకు ఈ సింహం ప్రతీక. అందుకే ఇంగ్లాండ్ దీనిని జంతు చిహ్నంగా ప్రకటించింది.
పోర్చుగల్, స్పిరిటెడ్ గాలో
దీనిని పోర్చుగల్ దేశం తన అదృష్ట జంతువుగా భావిస్తుంటుంది. అందుకే దీనిని తన జాతీయ జంతువుగా ప్రకటించింది. స్పష్టమైన చూపుతో, బలమైన కాళ్లు కలిగి ఉండి, దృఢమైన శరీర నిర్మాణంతో ఉండే ఈ కోడిపుంజు.. పోర్చుగల్ వాసులకు ఎంతో ఇష్టం. దీనిని వారు రూస్టర్ అని పిలుస్తుంటారు. పోర్చుగల్ పరిభాషలో స్పిరిటెడ్ గాలో అని అంటుంటారు.