Gottamgotta: పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చేశాయ్. పిల్లలతో టూర్స్‌కు చాలా మంది ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. అయితే కొందరికి ఉద్యోగం, పని ఒత్తిడి కారణంగా సెలవులు దొరకవు. టూర్స్‌కు వెళ్లడం కుదరదు. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు టూర్స్ ఎలా అని ఆందోళన చెందుతున్నాయి. అయినా కొందరు ఫ్యామిటీ ట్రిప్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. అలా వెళ్లాలంటే మూడు నాలుగు రోజులు ప్లాన్‌తోపాటు బడ్జెట్ చూసుకుని వెళ్లాలి. కానీ, సమ్మర్‌లో ఒక్క రోజు ఫ్యామిలీతో తెలంగాణ ఊటీలో ఎంజాయ్ చేయవచ్చు. అవును తెలంగాణలో కూడా ఊటీని తలపించే టూరిస్టు ప్లేస్ ఉంది. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ సెలవులతో అక్కడ ఎంజాయ్ చేయవచ్చు. అదెక్కడుందో తెలుసుకుందాం.
గొట్టం గుట్ట..
హైదరాబాద్ చుట్టు పక్కలనే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో గొట్టం గుట్ట ఒకటి. తెలంగాణ ఊటీగా ప్రసిద్ధికెక్కింది. ఈ చల్లని ప్రదేశంలో నిండుగా చెట్లు, పారే జలపాతం కంటికి ఇంపుగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. జహీరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గొట్టం గుట్ట చాలా అందంగా ఉంటుంది. జహీరాబాద్‌లోని హోటల్‌లో వసతి బుక్ చేసుకుని ఈ గుట్ట ప్రాంతానికి వెళ్లి రావొచ్చు. ఉదయం వెళ్లి సాయంత్రానికి రావాలనుకుంటే సొంత వాహనంలో వెళ్లాలి.
ప్రశాంత వాతావరణం..
ఈ గొట్టం గుట్టలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అక్కడికి వెలితే ప్రకృతి ఓడిలో సేదితీరున్ను ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ గుట్టపై ఎటు చూసినా పచ్చని అందాలు స్వాగతం పలుకుతాయి. అడవి మధ్యలో సాగే ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. చించోలి అభయారణ్యం ఇక్కడే ఉంది. శివాయం, విఘ్నేశ్వరాలయం, భవానీమాత ఆలయం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. శ్రీగురు గంగాధరభక్త ప్రభూదేవస్థానం ఇక్కడే ఉంది.
ఆకట్టుకునే జలపాతం..
గొట్టం గుట్ట నుంచి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మల్కాపూర్ జలపాతం వస్తుంది. ఈ జలపాతాన్ని ఎంత చసినా తనివి తీరదు. లోతైన లోయలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. చుట్టూ ఎత్తయిన కొండలు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడికి దగ్గరలో చంద్రగిరి అని పిలిచే డ్యాం కూడా ఉంది. గొట్టం గుట్టకు వెళ్లేవారు ఈ డ్యాం చూడొచ్చు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతాయి. తెలంగాణ ఊటీ ట్రిప్ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది.