https://oktelugu.com/

Whales : వామ్మో మనుషులే కాదు తిమింగలాలు కూడా ప్రేమిస్తాయి. ఆడ తోడ కోసం వేల కిలోమీటర్ల దూరం వెళ్లిన తిమింగలం..

మనుషులతో తిమింగలాలు కలిసి ఉంటాయి. అన్ని తిమింగలాలు ఈ కోవకు చెందవు. కానీ కొన్ని మాత్రం మనుషులతో కలిసి ఉంటాయి. వాటి తీరుకు మనం కచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే అవి మనుషులతో ఎంతో ప్రేమగా కనిపిస్తుంటాయి. కొన్ని మనుషులతో మాట్లాడుతాయి కూడా. కొన్ని సార్లు అవి బాధపడతాయి కూడా.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 16, 2024 / 02:12 AM IST

    Whales love each Other

    Follow us on

    Whales :  తిమింగలం. అనే పేరు వింటే వెంటనే అందరికీ టక్కున గుర్తొచ్చేది భారీ ఆకారం. నిజంగా వాటి ఆకారం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒళ్లు గగుర్పొడుస్తుంది. టీవీలో చూసినా సరే ఓ రకమైన భయం కలుగుతుంది కదా. కానీ, తిమింగలాలకు సంబంధించి వచ్చే ఫోటోలు, వీడియోలు కొన్ని పన్నీగా కూడా ఉంటాయి. అందులో వాటిని చూస్తే వాటి ఆకారం, వాటి చేష్టలు, ఎగిరి పడటం వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇలా తిమింగలాలు చేసిన విన్యాసాల వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి కూడా.

    ఇదిలా ఉంటే మనుషులతో తిమింగలాలు కలిసి ఉంటాయి. అన్ని తిమింగలాలు ఈ కోవకు చెందవు. కానీ కొన్ని మాత్రం మనుషులతో కలిసి ఉంటాయి. వాటి తీరుకు మనం కచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే అవి మనుషులతో ఎంతో ప్రేమగా కనిపిస్తుంటాయి. కొన్ని మనుషులతో మాట్లాడుతాయి కూడా. కొన్ని సార్లు అవి బాధపడతాయి కూడా. ఇవి కూడా వాటి పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. అచ్చం మనుషుల్లానే ప్రేమకోసం వెతికుతుంటాయి తిమింగలాలు. ఇలాంటి ఓ తిమింగలం తన ఆడ తోడు కోసం ఏకంగా మూడు సముద్రాలు దాటి ప్రయాణం చేసింది. అవును మీరు విన్నది నిజమే నండి. తన ప్రేమను వెతుక్కుంటూ మూడు సముద్రాలు దాటింది ఓ తిమింగలం. ఇలా దాని వలస ప్రయాణాన్ని బజారుటో సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ స్డడీస్‌ అధ్యయనం చేయడగా ఈ విషయం వెల్లడైంది.

    ఈ అధ్యయనం వివరాలు రాయల్‌ సొసైటీ ఓపెన్‌ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. ఈ తిమింగలం చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని ఏఐ అల్గారిథం సాయంతో ఫొటో రికార్డింగ్‌ చేసి వివరాలు తెలిపారు. ఇక్కడ మగ తిమింగలం తగిన తోడు కోసం వెతుక్కుంటూ మూడు సముద్రాలు దాటింది. దీని కోసం ఏకంగా 19 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. కొలంబియాలోని గల్ఫ్‌ ఆఫ్‌ ట్రిబుగా నుంచి ఈ తిమింగలం వలస ప్రయాణం మొదలు పెట్టింది. ఆ తర్వాత దీన్ని టాంజానియాలోని జాంజిబార్‌ తీరంలో గుర్తించారు పరిశోధకులు. అలా సాగిన తిమింగలం ప్రయాణం కనీసం 13,046 కి.మీ ప్రయాణించిందట. దానికి 19 వేల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉందంటున్నారు పరిశోధక బృందం.

    ఈ తిమింగలం వలస ప్రయాణం చేయడానికి గల నిర్దిష్ట కారణాలను కూడా శాస్త్రవేత్తలు పరిశోధన సాగిస్తున్నారు. పర్యావరణ మార్పులు, తోడు కోసం అనుసరించే వ్యూహాల్లో మార్పులు లేదా వనరుల మీద ఆధిపత్యం కోసం ఈ తిమింగలం సుదూర ప్రయాణం సాగి ఉండొచ్చని కూడా అంచనావేస్తున్నారు నిపుణులు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పుడు తెలుస్తాయో అని వేచి చూడాల్సిందే.