https://oktelugu.com/

Srileela : అన్నదమ్ములతో రొమాన్స్ చేయబోతున్న శ్రీలీల..ఎవరా అన్నదమ్ములు?

డ్యాన్స్, క్యూట్ నెస్ తో ఆడియన్స్ ఫిదా అయ్యారనే చెప్పాలి. ఎలాంటి తడబాటు లేకుండా అందంగా డ్యాన్స్ చేసింది కూడా శ్రీలీల. ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 16, 2024 / 01:12 AM IST

    Srileela

    Follow us on

    Srileela : పెళ్ళిసందD సినిమాతో టీలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. ఈ సినిమాతో ఆమె ఫేత్ మారిపోయిందనే చెప్పాలి. ఆ తర్వాత ధమాకా చిత్రంతో మరోసారి తన సత్తా చాటింది శ్రీలీల. ఈ సినిమా తర్వాత ఆమె పేరు మారుమోగింది. అమ్మడు డ్యాన్స్, క్యూట్ నెస్ తో ఆడియన్స్ ఫిదా అయ్యారనే చెప్పాలి. ఎలాంటి తడబాటు లేకుండా అందంగా డ్యాన్స్ చేసింది కూడా శ్రీలీల. ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.

    ధమాకా సినిమా తర్వాత శ్రీలీలకు కాస్త ఫ్లాప్ లు రుచి చూపించాయి . అయినప్పటికీ మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటించ అవకాశం కూడా దక్కింది. శ్రీలీలకి అది బిగ్గెస్ట్ ఆఫర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఫేమ్ ను సంపాదించి పెట్టలేదు. దీనితో శ్రీలీల కెరీర్ జోరు తగ్గుతోంది అనుకున్నారు అంతే. అదే సమయంలో ఏకంగా పుష్ప 2 సినిమాలో తన డ్యాన్స్ తో ప్రతి ఒక్కరిని మరోసారి మెస్మరైజ్ చేసింది.

    ఈ ఐటెం సాంగ్ శ్రీలీల కెరీర్ కి బూస్టప్ ఇచ్చిందని చెప్పవచ్చు. నేషనల్ వైడ్ గా శ్రీలీలకి పాపులారిటీ వచ్చేసింది. పుష్ప సినిమాలో సమంత తన డ్యాన్స్ తో, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా శ్రీలీల ఆ ఆఫర్ ను కొట్టేసి తన రేంజ్ ను పెంచుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీ లీల తదుపరి చిత్రాల గురించి క్రేజీ న్యూస్ బయటకి వస్తుంది.అఖిక్ అక్కినేని కెరీర్ ఆరంభం నుంచి ఒక్క హిట్ కూడా లేదనే చెప్పాలి. చివరగా ఈయన నటించిన ఏజెంట్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భోల్తా కొట్టింది.

    దీనితో అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వినరో భాగ్యము విష్ణుకథ సినిమా దర్శకుడు మురళి కిషోర్ దర్శకత్వంలో ఈ హీరో తన తదుపరి సినిమా ఉండబోతుందని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను కలిసి నిర్మిస్తున్నాయట. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైందని టాక్. త్వరలో అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటిస్తారట.

    అఖిల్ సినిమాలో మాత్రమే కాదు నాగచైతన్య సినిమాలో కూడా శ్రీలీలనే ఫిక్స్ అయిందని టాక్. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమాకు సిద్దం అవుతున్నారు. సూపర్ నేచురల్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని అనుకున్నారు. ఆ తర్వాత మరికొందరి పేర్లు వినిపించాయి. కానీ చివరికి శ్రీలీల ఫిక్స్ అయిందని టాక్. మొత్తంగా ఒకేసారి శ్రీలీల అన్నదమ్ములు చైతు, అఖిల్ లతో రొమాన్స్ చేయడానికి సిద్దం అవుతుంది ఈ బ్యూటీ.