Highest Unemployment Rate Country: తల్లిదండ్రుల కష్టంతో.. రాత్రనక, పగలనక కష్టపడి చదివి డిగ్రీలు తెచ్చుకున్న తర్వాత ఉద్యోగం లేకపోతే ఆ బాధ ఏంటో ప్రతి నిరుద్యోగికి తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరూ తనకు నచ్చిన రంగంలో ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని ఆరాటపడుతూ ఉంటారు. అందుకోసం స్కూల్ స్థాయి నుంచే కష్టపడతారు. అయితే చదువు పూర్తయిన తర్వాత అనుకున్నా రంగంలో ఉద్యోగం రాకపోయేసరికి ఆవేదన చెందుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నచ్చని ఉద్యోగం అయినా సరే చేయడానికి ముందుకు వస్తారు. అయితే యువత చదువుకు అనుగుణంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో సరైన ఉద్యోగాలు లేవు. దీంతో ఆయా దేశాల్లో నిరుద్యోగశాతం పెరిగిపోతుంది. మరి ప్రస్తుతం ఏ దేశంలో ఎంత నిరుద్యోగశాతం ఉంది? భారతదేశం ఏ స్థానంలో ఉంది?
చదువు ప్రతి ఒక్కరి జీవితాన్ని నిలబెడుతుంది. కానీ కొన్ని దేశాల్లో చదువును అస్సలు పట్టించుకోరు. అలా పట్టించుకోకపోవడంతో ఆ దేశంలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగశాతం పెరిగిపోతుంది. ఇలా అత్యధిక నిరుద్యోగ శాతం ఉన్న దేశంలో సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇక్కడ 33.3 శాతం నిరుద్యోగం ఉంది. అంటే ప్రతి వందమందిలో 33 మంది ఉద్యోగం లేకుండా ఉన్నారు. అయితే అత్యల్ప నిరుద్యోగ శాతం ఉన్న దేశం సింగపూర్ నిలుస్తుంది. ఇక్కడ కేవలం రెండు శాతం మాత్రమే నిరుద్యోగులు ఉన్నారు.
భారతదేశంలోనూ ఎంతోమంది చదువుకుని ఉద్యోగం కోసం వేరు చూసేవారు ఉన్నారు. ఈ ఈ లెక్కన భారతదేశంలో 5.1 శాతం నిరుద్యోగం ఉంది. అంటే ప్రతి 100 మందిలో ఐదుగురు పనిలేకుండా ఉన్నారు. మిగతా దేశాలతో పాటు భారతదేశ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. నిరుద్యోగ శాతం మాత్రం తగ్గడం లేదు. కానీ భారతదేశం కంటే మరి ఎక్కువగా నిరుద్యోగ శాతం ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. వాటిలో భారత్ తర్వాత చైనా గురించి చెప్పుకోవచ్చు. సాంకేతికంగా చైనా అభివృద్ధి సాధించినప్పటికీ ఇక్కడ నిరుద్యోగశాతం 5.3. అంటే భారత్ తర్వాత ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఇక భారత్ కంటే తక్కువ నిరుద్యోగ శాతం ఇండోనేషియా నిలుస్తోంది. ఇక్కడ 4.76 శాతం నిరుద్యోగులు ఉన్నారు.
భారతదేశంలో ఉన్నత చదువులు చదివి కొందరు ఉద్యోగాల కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరికొందరు విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే చాలామంది తమ చదువుకు అనుగుణంగా ఉద్యోగం రావాలని ఎదురుచూస్తున్నారు. కొందరు మాత్రం తమ చదువుకు సంబంధం లేని ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. అయితే మిగతా రంగాలతో పాటు నిరుద్యోగులపై కూడా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కొందరు కోరుతున్నారు.