Millionaires in India by state: డబ్బున్నవాడు అంతకంతకూ ఎదిగిపోతున్నాడు. పేదవాడు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నాడు. అప్పట్లో విడుదలైన ఓ తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్ అది. అదంటే సినిమా కాబట్టి ఏదో లిబర్టీ కోసం రాసి ఉంటారు. కానీ వాస్తవంలో అలా జరుగుతుందా.. అలా సాధ్యమవుతుందా.. ఈ ప్రశ్నకు అవును అనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే దేశంలో కోటీశ్వరులు పెరిగిపోతున్నారు. కొంతకాలంగా కోటీశ్వరుల సంఖ్య రెట్టింపు అవుతున్నది.
గడచిన సంవత్సరం పన్ను చెల్లింపులు చేసిన వారి వివరాల ప్రకారం కోటి లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి వివరాలు పెరిగిపోయాయి. మహారాష్ట్రలో 1,24,800 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 24 వేల 50 మంది ఉన్నారు.. మధ్యప్రదేశ్ లో 8, 666 మంది, తమిళనాడులో 6,288 మంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,340, తెలంగాణలో 1,260 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఇక లడక్ లో ముగ్గురు, లక్షద్వీప్ లో ఒకరు ఉన్నారు.
కొంతకాలంగా మనుషుల ఆర్థికముఖ చిత్రం మారిపోయింది. ఈ తరంలో చాలామంది విభిన్నమైన వ్యాపారాలు చేస్తూ ఉండడం.. ఐటి, ఫార్మా, స్థిరాస్తి వ్యాపారాలు చేస్తుండడం వల్ల ఆదాయాలు పెరిగిపోయాయి. దీంతో చాలామంది ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోయారు. డబ్బు సంపాదించడమే కాదు.. వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా వెనకేసుకుంటున్నారు. తద్వారా సరికొత్త మిలియనీర్ల అవతారం ఎత్తుతున్నారు. వారు సంపాదించడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి చూపిస్తూ ఉండడంతో.. తమ వ్యాపారాన్ని మరింత పెంచుకుంటున్నారు.
ఉద్యోగుల్లో కోట్ల రూపాయల సంపాదన సంపాదిస్తున్న వారు కూడా ఉన్నప్పటికీ.. వారిలో ఐటీ ఆధారిత, ఫార్మా ఆధారిత సంస్థల్లో పనిచేస్తున్న వారు మాత్రమే ఆ స్థాయిలో ఆర్జిస్తున్నారు. మిగతా విభాగాలలో ఈ స్థాయిలో సంపాదన ఉండడం లేదు. దీంతో అయితే ఇప్పుడు ఐటీ లో కృత్రిమ మేధ అందుబాటులోకి రావడంతో దాని ఆధారంగా పనిచేస్తూ సంపాదిస్తున్న వారు పెరిగిపోయారు. పెద్ద పెద్ద కంపెనీలు కృత్రిమ మేధలో పనిచేసే వ్యక్తులకు భారీగా ప్యాకేజీలు ఇస్తుండడంతో కనివిని ఎరుగని స్థాయిలో సంపాదన ఉంది. ఉదాహరణకు కృత్రిమ మేధ విభాగంలో పనిచేసే కొంతమంది ఇంజనీర్లు భారీగా ప్యాకేజీలు అందుకుంటున్నారు. అయితే వారికి బోనస్ ల రూపంలో భారీగా వస్తూ ఉండడంతో.. అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే బోనస్ రూపంలో వచ్చేవి పన్ను పరిధిలోకి రావు. అందువల్లే అటువంటి వారి వివరాలు టాక్స్ రిటర్న్స్ పరిధిలో ఉండవు. ఒకవేళ బోనస్ కూడా పన్ను పరిధిలోకి వచ్చి ఉంటే తెలంగాణలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.