HomeజాతీయంProgeria Disease India: యుక్త వయసులోనే ముసలి వాళ్ళయిపోయారు.. ఇంతకీ ఏమైంది వీళ్లకు..

Progeria Disease India: యుక్త వయసులోనే ముసలి వాళ్ళయిపోయారు.. ఇంతకీ ఏమైంది వీళ్లకు..

Progeria Disease India: చూస్తున్న వాళ్ళు చూస్తున్నట్టుగానే చనిపోతారు. కొందరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడతారు. అక్కడి నీళ్లు తాగినవాళ్లు ఏమాత్రం బతికి బట్ట కట్టలేరు.. చూస్తుండగానే ఆ గ్రామములో ఒక్కొక్కరు చనిపోవడం కలవరపాటుకు గురిచేస్తుంది. చదువుతుంటే ఖలేజా సినిమా గుర్తుకొస్తుంది కదూ. అదంటే సినిమా కాబట్టి లిబర్టీ ఉంటుంది. కానీ నిజ జీవితంలో అలా జరిగితే.. యుక్త వయసు ఉన్న అమ్మాయిలు వృద్దులుగా మారిపోతే.. ఆ కష్టం పగవాడికి కూడా రావద్దు.. ఆ బాధను ఈ ఇద్దరు అమ్మాయిలు అనుభవిస్తున్నారు. ప్రతిక్షణం నరకాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు.

ఆ ఇద్దరు అమ్మాయిలు పేరు రాజకుమారి.. రోషిని. ఇందులో రాజకుమారి వయసు 19 సంవత్సరాలు. రోషిని వయసు 14 సంవత్సరాలు. టీనేజ్ పిల్లలు ఎంతో అందంగా ఉంటారు. పైగా చలాకీగా కూడా కనిపిస్తుంటారు. కానీ ఇద్దరు అమ్మాయిలకు ఏమైందో తెలియదు. పైగా వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. టీనేజ్లో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వీరు ఇద్దరు వృద్దులుగా మారిపోయారు. జుట్టు రాలిపోవడం.. ముఖం కళవిహీనంగా అయిపోవడంతో ముసలి వాళ్ళ లాగా కనిపిస్తున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చెందిన రాజకుమారి, రోషిని ఇలా అయిపోవడానికి ప్రధాన కారణం అత్యంత అరుదైన ప్రొగేరియ జెనెటిక్ డిసార్డర్. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. చూస్తుండగానే చర్మం సాగిపోతూ ఉంటుంది. అవయవాలు అత్యంత బలహీనంగా ఉంటాయి. కనీసం అద్దంలో ముఖం కూడా చూసుకోలేని పరిస్థితి ఉంటుంది. అందువల్లే వీరిద్దరూ టీనేజ్ లోనే వృద్ధుల మాదిరిగా కనిపిస్తున్నారు. కనీసం స్కూల్ కి కూడా వెళ్లలేకపోతున్నారు. 80 లక్షల మందిలో ఒక్కరికే ఈ వ్యాధి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స చేయాలంటే చాలా ఖర్చవుతుందని.. పైగా మందులు కూడా అత్యంత అరుదుగా లభిస్తాయని వైద్యులు అంటున్నారు.

చిన్నప్పుడు మీరు బాగానే ఉన్నారని ఆ తర్వాతే ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని.. చివరికి ఇలా మారిపోయారని తెలుస్తోంది. తమ పిల్లలకు ఇలా కావడానికి ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆర్థిక శక్తి మేరకు అనేక రకాల ఆస్పత్రులలో చూపించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆ ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా జీవితాన్ని సాగించాల్సిన వారు.. నిర్వేదంలో కనిపిస్తున్నారు. తమ పిల్లల దుస్థితిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆ తల్లిదండ్రులు భావిస్తున్నారు.. అయితే ఈ వ్యాధి నివారణకు అయ్యే చికిత్స అత్యంత ఖరీదు కావడంతో.. ఆ ప్రభుత్వ పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version