Techie Life Story: మనిషి జీవితం ఎప్పుడూ ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. అందువల్లే నిన్నటిది మనది కాదు. రేపటి దానికి రూపులేదు. ఈ క్షణము మాత్రమే శాశ్వతం అని వెనకటికి ఓ సినీ కవీ అన్నాడు. దాని ప్రకారమే జీవితాన్ని ఆస్వాదించుకుంటూ వెళ్లాలని తను రాసిన పాటలో పేర్కొన్నాడు.
ముందుగానే చెప్పినట్టు మనిషి జీవితం క్షణక్షణం మారుతూ ఉంటుంది. ఈ సందర్భంలో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో తెలియదు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవచ్చు. లేదా చూస్తుండగానే కాళ్ళ కింద భూమి కంపించవచ్చు. ఉన్నట్టుండి అనుకోని విపత్తు చోటు చేసుకోవచ్చు. అందువల్లే మనిషి జీవితంలో ఏదీ స్థిరం కాదని.. ఏదీ స్థిరంగా ఉండదని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అందువల్లే దేని మీద పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని.. ఉన్న వాటిని వదులుకోవద్దని.. లేని వాటికోసం తాపత్రయ పడవద్దని చెబుతుంటారు..
Also Read: Inspirational Women : 58 ఏళ్ళ వయసులో ఇంటర్ పాస్ అయింది..ఈ మహిళ తెగువకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే!
స్ట్రోక్ కారణంగా గ్యాప్
మనిషి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడానికి ఇతడి జీవితం ఒక బలమైన ఉదాహరణ. అతడి పేరు సురేందర్. కన్నడ రాష్ట్ర రాజధాని లో ఉంటాడు. ఉన్నత విద్యావంతుడు. గతంలో అతడికి స్ట్రోక్ వచ్చింది. దీంతో వైద్యుల సలహాల మేరకు ఉద్యోగం నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే.. ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కుటుంబ పోషణ భారం మీద పడింది. దీంతో అతడు ఇంకా అత్యంతరం లేక ఆటోడ్రైవర్ గా మారిపోయాడు. బెంగళూరులో ఆటో తోలుకుంటూ జీవనాన్ని సాగించడం మొదలుపెట్టాడు. అయితే అతడు ఇటీవల బెంగళూరు నగరంలో ఓ ప్రాంతంలో ఓ మహిళను ఆటో ఎక్కించుకున్నాడు. ఆమె దిగాల్సిన చోట దింపడానికి ఆటోను నడపడం మొదలుపెట్టాడు. ఆటో ఎక్కిన మహిళ ఓ బహుళ జాతి సంస్థలో హెచ్ ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. సురేందర్ కన్నడ కంటే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతుండడంతో హెచ్ ఆర్ మేనేజర్ కు కాస్త అనుమానం కలిగింది. మీరు ఏం చదువుకున్నారని సురేందర్ ను అడిగితే.. తన వృత్తాంతం గురించి మొత్తం చెప్పాడు. అతడు చెప్పిన మాటలు మొత్తం విన్న ఆ హెచ్ ఆర్ మేనేజర్.. ఈ విషయాలను మొత్తం లింక్డ్ ఇన్ పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారడంతో ఆటో తోలుతున్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడానికి అనేక సంస్థలు ముందుకు వచ్చాయి.
సురేందర్ గతంలో ఓ సంస్థలో ఐటీ ఉద్యోగిగా పని చేశాడు. ఒకరోజు అతడికి స్ట్రోక్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత అతడు కోలుకున్నాడు. తీరా ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తే ఒక్క ఉద్యోగం కూడా లభించలేదు. చివరికి ఓ హెచ్ ఆర్ మేనేజర్ ద్వారా అందరికీ ఉద్యోగాలు వరుస కట్టాయి. అందుకే అంటారు మనిషి జీవితానికి స్థిరత్వం ఉండదని.. అది ఏ క్షణమైనా మలుపు తీసుకుంటుందని.. దానికి సురేందర్ అనే వ్యక్తి జీవితమే ఒక ఉదాహరణ.