Garbage management in Sweden : ఈ భూమి మీద ప్రతిపదార్థానికి ఒక విలువ ఉంటుంది. ప్రతి వ్యర్ధానికి ఒక అర్థం ఉంటుంది. కాకపోతే దానిని సరైన విధానంలో ఉపయోగిస్తే అద్భుతాలు చేయవచ్చు. ఇదే పనిని చేసి నిరూపించింది స్వీడన్ దేశం. యూరప్ ఖండంలో అత్యంత చిన్నదైన ఈ దేశం అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలుస్తోంది. ఇక్కడ రోడ్లు.. జల వనరులు.. వ్యవసాయం.. బహుళ జాతి సంస్థలు అద్భుతంగా ఉంటాయి. మన దేశాన్ని చెందిన చాలామంది ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు. సాధారణంగా శుభ్రతకు స్వీడన్ దేశ ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తారు. అక్కడ ప్రభుత్వం కూడా చెత్తను జలవనరులలో.. ఇతర ప్రాంతాలలో డంపు చేయకుండా.. వ్యర్ధాల నుంచి అర్థవంతమైన పని చేస్తోంది. అంతేకాదు కోట్లల్లోసంపాదిస్తోంది.
ప్రపంచం మీద వ్యర్ధాలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత స్మార్ట్ కాలంలో ఈ – వ్యర్ధాలు మరింత పెరుగుతున్నాయి. వ్యర్ధాలను ఇష్టానుసారంగా పడడం వల్ల కాలుష్యం తీవ్రస్థాయిలో పెరుగుతోంది.. దీనివల్ల జంతుజాలం మనగడ తీవ్రమైన ప్రమాదంలో పడుతోంది.. దీనికి అడ్డుకట్ట వేయకపోవడం వల్ల కాలుష్యం అంతకంతకు పెరిగిపోతోంది. విలువైన వనరులలో ప్రమాదకర అవశేషాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ దేశంలో పెరిగిపోతున్న వ్యర్ధాల నిర్వహణను సక్రమంగా చేపడుతోంది స్వీడన్. వాటి ద్వారా ఆదాయాన్ని కూడా సంపాదిస్తుంది.. దేశంలో పోగుపడుతున్న చెత్తను రీసైక్లింగ్ చేసి స్వీడన్ దండిగా ఆదాయాన్ని వెనకేసుకుంటున్నది. స్వీడన్ దేశంలో గృహాల ద్వారా తోకపడుతున్న వ్యర్ధాలను 99 శాతం రీసైకిలింగ్ చేస్తున్నారు. తమ దేశంలోనే కాదు యునైటెడ్ కింగ్డమ్, నార్వే, ఇటలీ వంటి దేశాలలో పోగుపడుతున్న చెత్తను కూడా దిగుమతి చేసుకుంటున్నది. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది.. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సంవత్సరానికి 100 మిలియన్ డాలర్లు.. భారత మారకంలో 857 కోట్ల సంపాదిస్తోంది. అంతే కాదు 2.5 లక్షల గృహాలకు విద్యుత్ ను సరఫరా చేస్తోంది..” చెత్త ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడం ద్వారా స్వీడన్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ చెత్త ను రీ సైక్లింగ్ చేసి పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది.. తమ దేశాన్ని కాదు.. దాదాపు నాలుగు దేశాలను శుభ్రంగా ఉంచుతున్నది. స్వీడన్ చేస్తున్న ప్రయోగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంది. ఇటువంటి పనిని మిగతా దేశాలు కూడా చేస్తే సముద్ర జలాలు పరిశుభ్రంగా ఉంటాయి. నీటి వనరులు స్వచ్ఛంగా ఉంటాయి. భూమిపై కూడా భారం పడదు.. పర్యావరణం పచ్చగా ఉంటుంది. భూమి పదికాలాలపాటు ఇతర జీవులకు మనుగడ ఇస్తున్నది.. ప్రపంచానికి స్వీడన్ దేశం ఆదర్శంగా నిలుస్తున్నదని” పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.