Rajasthan: రాజస్థాన్‌లోని ఎడారిలో ఉన్న జైసల్మేర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జైసల్మేర్‌లోని ఇసుక తిన్నెల్లోని పొలంలో గొట్టపు బావి తవ్వుతుండగా, నీరు భూమిని పగులగొట్టి మరీ బయటకు వచ్చింది. ఈ నీటి వేగం ఎంతగా ఉందంటే అది దాదాపు మూడు నుంచి నాలుగు అడుగులకు ఎగబాకింది. ఆ తర్వాత దాదాపు 50 గంటల పాటు ఈ నీరు అదే వేగంతో బయటకు వస్తూనే ఉంది. ఇది ఎలా జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదా? శనివారం తెల్లవారుజామున 5 గంటలకు భూమి నుంచి ఉబికి వచ్చిన నీరు సోమవారం ఉదయం 7 గంటలకు నిలిచిపోయింది.
సమాచారం ప్రకారం, ఈ షాకింగ్ సంఘటన విక్రమ్ సింగ్ భాటి పొలంలో జరిగింది. అతని పొలం జైసల్మేర్‌లోని కెనాల్ ప్రాంతంలోని చక్ 27 BDకి చెందిన తీన్ జోరా మైనర్ సమీపంలో ఉంది. విక్రమ్ సింగ్ బీజేపీ మోహన్‌గఢ్ డివిజన్ అధ్యక్షుడు. తన పొలంలో గొట్టపు బావి తవ్వుతున్నాడు. ఇందుకోసం గొట్టపు బావి తవ్వే యంత్రాన్ని ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి నుంచి నీరు బయటకు వచ్చింది. నీటి పీడనం ఎక్కువగా ఉండడంతో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తుకు దూకింది నీరు. ఇది చూసిన విక్రమ్ సింగ్, చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. గొట్టపు బావిని 850 అడుగుల లోతు తవ్వుతుండగా ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత పైప్‌ను బయటకు తీస్తుండగా వేగంగా నీరు బయటకు రావడం మొదలైంది.
గొట్టపు బావి తవ్వే యంత్రం కూడా నీళ్ల ప్రవాహానికి వెంటనే మునిగిపోవడం ప్రారంభించింది. అక్కడ పనిచేస్తున్న వారు నీటిని ఆపేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. కొంత సమయం తర్వాత నీరు తగ్గుతుందని భావించారు. కానీ ఇది జరగలేదు. అదే వేగంతో భూమి నుంచి నీరు వస్తూనే ఉంది. ఈ నీరు క్రమంగా అతని పొలం అంతటా వ్యాపించింది. తర్వాత పొలం గట్లు తీసేశారు. ఈ విషయాన్ని ఆయన అధికార యంత్రాంగానికి తెలియజేశారు. కొద్దిసేపటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా నిరంతరం నీరు బయటకు వెళ్లడం వల్ల పొలంలో నాలుగైదు అడుగుల మేర నీరు నిండిందని విక్రమ్ సింగ్ చెబుతున్నారు.
చుట్టుపక్కల నీరు ప్రవహించడంతో
మోహన్‌గఢ్ నాయబ్ తహసీల్దార్ లలిత్ చరణ్ అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన ఆయన ఆ ప్రాంత ప్రజలను నీరు వస్తున్న చోట నుంచి 500 మీటర్ల పరిధిలోకి ఎవరూ వెళ్లకూడదని చెప్పారు. అయితే శనివారం పగలంతా, రాత్రి కూడా నీరు ఆగలేదు. ఆదివారం కూడా రోజంతా అదే వేగంతో నీటి ప్రవాహం కొనసాగింది. దీంతో ఎక్కడికక్కడ నీటి ఉధృతి నెలకొంది.
సోమవారం ఉదయం ఏడు గంటలకు నీరు నిలిచిపోవడంతో…
సాయంత్రం కెయిర్న్ వేద ఇండియా కంపెనీ, ఒఎన్ జిసి, ఆయిల్ ఇండియా కంపెనీ ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఈ విషయం ఎవరికి అర్థం అవడం లేదు. ఆదివారం కూడా రాత్రంతా ప్రవహించిన తర్వాత సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నీరు దానంతటదే నిలిచిపోయింది. సోమవారం తెల్లవారుజామున నీరు నిలిచిపోయే సమయానికి అధికార యంత్రాంగం, భూమి యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఈ నీరు, అక్కడి మట్టి నమూనాలను సేకరించి పరిశీలిస్తున్నారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Strange incident in jaisalmer district of rajasthan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com