Snake On Electric Wires: వర్షాకాలంలో పాములు విస్తారంగా సంచరిస్తుంటాయి.. వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురిసి.. జలాశయాలలోకి నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటిలో సంచరించడానికి కప్పలు, ఇతర జలచరాలు వస్తుంటాయి. అప్పుడు ఆహార అన్వేషణలో భాగంగా పాములు వాటిని తినడానికి వస్తుంటాయి.. వర్షాలు కురుస్తున్న సమయంలో వెచ్చగా తలదాచుకోవడానికి పాములు పుట్టలు లేదా బొరియలలో తాత్కాలిక నివాసం ఏర్పరచుకుంటాయి. వర్షం తగ్గిన తర్వాత బయటికి వస్తుంటాయి. ఇలా బయటికి వచ్చిన సమయంలో పాములు తాత్కాలిక ఆవాసంలో ఉంటాయి.
Also Read: ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు.. చివరకు 13 ఏళ్ల బాలికను కూడా వదలలేదు!
తాత్కాలిక ఆవాసానికి వచ్చే క్రమంలో పాములు కొన్ని సందర్భాల్లో తాము ఎటువంటి చోటులో ఉన్నామనే విషయాన్ని మర్చిపోతుంటాయి. అలా ఓ పాము వర్షాలు కురుస్తుంటే బయటికి వచ్చింది. తాత్కాలిక ఆవాసాన్ని వెతుక్కునే క్రమంలో విద్యుత్ తీగ మీద ఉండిపోయింది. అతి పెద్ద రూపం కలిగి ఉన్న ఆపాము విద్యుత్ తీగపై అలా ఉండిపోయింది. నిశితంగా పరిశీలిస్తే తప్ప విద్యుత్ తీగ మీద పాము ఉన్న విషయం గుర్తించలేం. అయితే ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి చూశాడు. దానిని తన కెమెరాలు ఫోటో తీసి సామాజిక మాధ్యమాలలో అందుబాటులో ఉంచాడు.. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా పాము నేలను విడిచిందని.. విద్యుత్ తీగతో సాము చేస్తోందని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు.
వాస్తవానికి పాములు మాంసాహారులు. వర్షాకాలంలో వాటికి సరిపడా ఆహారం లభించదు. అలాంటప్పుడు చెరువులు.. నీటి వనరులు ఉన్న ప్రాంతానికి వెళ్తుంటాయి. అక్కడ కప్పలు.. ఇతర జంతువులను తిని ఆకలి తీర్చుకుంటాయి. ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి.. కొన్ని సందర్భాలలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్తు స్టార్టర్ డబ్బాలలో కూడా ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. అరుదైన సందర్భాలలో విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కూడా కోల్పోతుంటాయి. తాజాగా విద్యుత్ తీగ మీద కనిపించిన అతి పెద్ద పాము ఉమ్మడి కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో ఓ యువకుడి కెమెరాకు చిక్కింది.. అది కాస్త ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.