https://oktelugu.com/

Top Sales Car: ఈ మూడు కార్లు సేల్స్ లో దున్నేస్తున్నాయి…

ఎస్ యూవీ కాంపాక్ట్ కార్లలో బెస్ట్ మోడల్ గా నిలిచింది హ్యుందాయ్ క్రెటా. 2023-24 ఆర్థిక సంవత్సంలో ఈ మోడల్ 1,62,773 యూనిట్లు విక్రయించుకుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : April 22, 2024 / 04:49 PM IST

    Hyundai Creta Compact Suv

    Follow us on

    Top Sales Car: ఇటీవల కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే వినియోగదారులు ఎవరికి వారే అభిప్రాయాన్ని కలిగి తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఫీచర్స్, మరికొందరు డిజైన్, ఇంకొందరు ధరలకు ఆకర్షితులై కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే మొత్తంగా ఎస్ యూవీ కాంపాక్ట్ కార్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ మూడు కార్లు అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి టాప్ 3 లో ఉన్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా…

    ఎస్ యూవీ కాంపాక్ట్ కార్లలో బెస్ట్ మోడల్ గా నిలిచింది హ్యుందాయ్ క్రెటా. 2023-24 ఆర్థిక సంవత్సంలో ఈ మోడల్ 1,62,773 యూనిట్లు విక్రయించుకుంది. నెలకు 13, 564 కార్ల చొప్పున అమ్ముడయ్యాయి. గత ఏడాది మార్చిలో మొత్తం 16,458 కార్లు విక్రయించారు. డిసెంబర్లో మాత్రం అత్యల్పంగా 9,243 యూనిట్లు అమ్ముడయ్యాయి.

    మారుతికి చెందిన గ్రాండ్ విటారా మంచి కాంపాక్ట్ కారు. ఈ కారు గత ఆర్థిక సంవత్సరంలో 1,21,169 యూనిట్లను అమ్మింది. ఇవి నెలకు 10,097 చొప్పున కార్లను విక్రయించింది. అత్యధికంగా జనవరిలో 13,438 యూనిట్లను విక్రయాలను సొంతం చేసుకున్న విటారా.. అత్యల్పంగా డిసెంబర్ లో 6,988 కార్లను మాత్రమే అమ్మింది.

    పై రెండు మోడల్ల తరువాత కియా కంపెనీకి చెందిన సెల్టోస్ నిలిచింది. గత ఏడాదిలో ఈ మోడల్ 1,00,423 యూనిట్లు అమ్ముడు పోయాయి. సెల్టోస్ మూడో స్థానంలో ఉన్నా గత ఆరు నెలల్లో దీని సెల్స్ పెరిగాయి. మెరుగైన ఫీచర్స్ తో పాటు ఇంజిన్ సమర్థవంతంగా పనిచేయడంతోనే ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది.