Security Categories: సెక్యూరిటీ క్యాటగిరీల మధ్య ఉన్న తేడాల గురించి మీకు తెలుసా?

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే ఓ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్. వీరి సెక్యూరిటీ భారతదేశ ప్రైమ్ మినిస్టర్ కు ఉంటుంది. అంతేకాదు ప్రైమ్ మినిస్టర్ కుటుంబ సభ్యులకు ప్రొటెక్షన్ కల్పిస్తారు.

Written By: Swathi Chilukuri, Updated On : June 13, 2024 12:31 pm

Security Categories

Follow us on

Security Categories: ప్రముఖులు బయటకు వెళ్లాలంటే సెక్యూరిటీ ఉండాల్సిందే. అయితే ఈ సెక్యూరిటీ లో కూడా క్యాటగిరీస్ ఉంటాయి. అలా మన భారతదేశంలో ఉన్న సెక్యూరిటీ క్యాటగిరీస్ గురించి ఇప్పుడు ఓ సారి తెలుసుకుందాం.

#1 ఎస్ పి జి (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే ఓ స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్. వీరి సెక్యూరిటీ భారతదేశ ప్రైమ్ మినిస్టర్ కు ఉంటుంది. అంతేకాదు ప్రైమ్ మినిస్టర్ కుటుంబ సభ్యులకు ప్రొటెక్షన్ కల్పిస్తారు. ఇది 1988లో పార్లిమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సెక్యూరిటీ ఆరుగురికి మాత్రమే అందిస్తుంది.

#2 జెడ్ ప్లస్ (Z+)

ఎస్ పి జి తర్వాత హై లెవెల్ సెక్యూరిటీ ఫోర్స్ జెడ్ ప్లస్. ఇందులో మొత్తం 55 మంది ఉంటారు. వాళ్లలో పదిమంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఎన్ఎస్జీ ఇంకా పోలీస్ పర్సనల్ ఉంటారు.

#3 జెడ్ (Z)

మూడవ హైలెవెల్ సెక్యూరిటీ జెడ్ సెక్యూరిటీ. ఇందులో 22 మంది ఉంటారు. వాళ్లలో నలుగురు లేదా ఐదుగురు ఎన్ ఎస్ జి కమాండోస్ లు ఉంటారు. వారితో పాటు పోలీస్ పర్సనల్ ఉంటారు. జెడ్ క్యాటగిరి సెక్యూరిటీ అందుకునే వారిలో రాందేవ్, అమీర్ ఖాన్ లు కూడా ఉన్నారు.

#4 వై (Y)

ఈ సెక్యూరిటీలో 11 మంది ఉంటారు. వారిలో ఒకరు లేదా ఇద్దరు, ఎన్ ఎస్ జి కమాండోస్ లు ఉంటారు. మిగతా వారు పోలీస్ పర్సనల్ ఉంటారు. ఇందులో ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ని ప్రొవైడ్ చేసే సదుపాయం కూడా ఉంటుందట. మన దేశంలో ఈ వై క్యాటగిరి సెక్యూరిటీని చాలా మంది అందుకుంటున్నారు.

#5 ఎక్స్ (X)

ఇందులో ఇద్దరు సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. ఎక్స్ క్యాటగిరి లో కమాండోస్ ఉండరు. వీరికి కేవలం ఆర్మ్డ్ పోలీస్ పర్సనల్ మాత్రమే ఉంటారు.